ఎల్లో సిండికేట్ పైశాచికానందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎల్లో సిండికేట్ పైశాచికానందం

ఎల్లో సిండికేట్ పైశాచికానందం

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

తోక పత్రిక పతాక శీర్షిక కథనం.. 
చానల్‌లో రోజంతా అదే జోరు 
సాక్షి ఉద్యోగుల్లో ఆందోళన సృష్టించటానికి యత్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అన్నాడన్నట్లుంది ఎల్లో సిండికేట్ తీరు. అనతికాలంలోనే తమకు అందనంత ఎత్తుకు ఎదిగిన సాక్షి మీడియాపై అక్కసును, కక్షను పెంచుకున్న ఎల్లో సిండికేట్.. సాక్షి ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూ పొందుతున్న పైశాచికానందం ఇప్పుడు తారస్థాయికి చేరింది. సాక్షి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన లీకును అడ్డంపెట్టుకుని బరితెగించింది. సాక్షి మీడియాను మూసివేస్తారంటూ విషప్రచారాన్ని గుప్పించింది. జగతి పబ్లికేషన్స్ ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఎల్లో సిండికేట్‌కు చెందిన చానళ్లు బుధవారం తెల్లవారుజామునే హైడ్రామా మొదలుపెట్టాయి. 

సాక్షి మూతపడుతుందని ఉద్యోగులను ఆందోళనకు గురిచేసే వార్తలను అదేపనిగా ప్రసారం చేశాయి. సీబీఐ సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, మరోవైపు ప్రభుత్వం అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధిస్తూ చీకటి జీవో జారీ చేసి జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించిన చర్యలకు నిరసనగా వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో.. వారిని మరింత గందరగోళ పరచాలని విశ్వప్రయత్నం చేశాయి. జగతి పబ్లికేషన్స్ ఆస్తులు క్రయవిక్రయాలు జరగకుండా నిషేధిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడకముందే.. సాక్షిని మూసివేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరం చేశాయి. 

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల అంశంపై ఒకవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే తమ కట్టుకథలే వాస్తవాలంటూ నిత్యం తీర్పులిచ్చేస్తున్న ఈ ఎల్లో సిండికేట్.. మనసులోని కోరికను బయటపెట్టుకుంటూ ఏకంగా సాక్షి మీడియాను మూసివేస్తున్నారంటూ ప్రచారం గుప్పించింది. 

ఇంకా మూసేయలేదేమని ఆక్రోశం... 

ఒక తోక చానల్ అధినేత గురువారం తెల్లవారునే కార్యాలయానికి చేరుకుని.. ‘సాక్షిని మూసేశారు. చానల్‌లో తెగ హడావుడి చేసేయండి...’ అంటూ తన ఉద్యోగులను హైరానా పెడుతూ తెగ ఆనందపడిపోయాడు. నేరుగా సీఎం నుంచే సమాచారం వచ్చాక ఇంకా ఆలస్యమెందుకు అంటూ ఇతర మీడియా చానళ్లను కూడా పురమాయించాడు. సాక్షిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఫోన్లు చేసి విషయం చెప్పండి అంటూ ఆనందంతో గంతులేశాడు. డీఎస్‌ఎన్‌జీ వ్యాన్‌ను సాక్షి కార్యాలయానికి పంపించి ఏమవుతుందంటూ రిపోర్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఇంకా మూసివేయలేదా?’ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. ఆ తోక చానల్ గురువారం తెల్లవారుజామున మొదలుపెట్టిన ఈ బాగోతం సాయంత్రం వరకు కొనసాగిస్తూనే ఉంది. సీఎం కొరడా ఝళిపించారని, జగన్ ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఊదరగొట్టింది. 

తోక చానల్‌కు తందాన తాన... 
తోక చానల్ చెప్పిందే తడవుగా కాంగ్రెస్, టీడీపీల నాయకులు రంగంలోకి దిగి.. ఈ ఆస్తులనే కాదు అన్నింటినీ జప్తు చేయాలని, ప్రస్తుతం స్తంభింపజేసిన ఖాతాలతో పాటు మిగతా అన్ని ఖాతాలను స్తంభింపజేయాలని తమ డిమాండ్ల చిట్టా విప్పారు. అంతేకాదు తమ చిరకాల వాంఛగా ఉన్న.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ల మీద డిమాండ్‌లు పెట్టించారు. వేల మంది పనిచేస్తున్న ఒక మీడియా సంస్థను దెబ్బతీయటానికి కాచుకుకూర్చున్న ఈ ఎల్లో సిండికేట్‌కు తెరవెనుక కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినాయకుడు పెద్ద డ్రామానే నడిపినట్లు తెలుస్తోంది. సాక్షి మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ముమ్మరం చేసిన ప్రభుత్వానికి మీడియా రంగానికే చెందిన సంస్థలు వత్తాసు పలకటం ద్వారా తోటి ఉద్యోగులను బజారునపడేయాలనే విషపూరిత ఆలోచనలతో ఎల్లో సిండికేట్ వ్యవహరిస్తున్న తీరుపై పలు రంగాల ప్రముఖులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ద్వేషంతో ఇలాంటి వార్తలు ప్రసా రం చేసినట్లు కనబడుతోందని ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ కె.శ్రీని వాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది జర్నలిజం అనిపించుకోదన్నారు. 
Share this article :

0 comments: