ప్రభుత్వ కుట్రపై ఆగ్రహజ్వాలలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ కుట్రపై ఆగ్రహజ్వాలలు

ప్రభుత్వ కుట్రపై ఆగ్రహజ్వాలలు

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

* సర్కారు తీరుపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
* రాజధానితో సహా అన్ని జిల్లాల్లో పాత్రికేయుల ప్రదర్శనలు
* ‘సాక్షి’కి మద్దతుగా వాడవాడలా నిరసనలు
* గవర్నర్, ఎన్నికల అధికారి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌కు విజ్ఞాపనలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్‌పై ప్రభుత్వ కుట్రకు నిరసనగా వేలాది కలాలు గళమెత్తాయి. ఎన్ని కుట్రలైనా ఎదుర్కొనేందుకు మీవెంట మేమున్నామంటూ జర్నలిస్టు సంఘాలు నినదించాయి. సాక్షికి ప్రకటనలు నిలుపుదలచేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దుచేయాలంటూ వాడవాడలూ నిరసనలతో హోరెత్తాయి. బ్యాంక్ అకౌంట్‌లను నిలుపుదలచేయాలనే ఉత్తర్వులను సీబీఐ ఉపసంహరించాలని జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజధాని నగరంతోపాటు అన్ని జిల్లాలలోనూ గురువారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు జరిగాయి. 

రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సాక్షి పత్రిక, టీవీ చానల్ బ్యాంక్ ఖాతాల నిలుపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రకటనల నిలుపుదల జీవోను రద్దుచేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కమిషనర్ చంద్రవదన్ ను జర్నలిస్టులు కలసి తమ నిరసన తెలిపారు. 

సాక్షి పత్రిక, టీవీ చానల్‌పై ప్రభుత్వ కుట్రలను వ్యతిరేకిస్తూ రాజధాని నగరం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అన్ని దినపత్రికలు, టీవీ చానల్ విలేకరులు, సబ్ ఎడిటర్‌లు, ఉద్యోగులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మండే ఎండను లెక్కచేయకుండా మహిళా జర్నలిస్టులు సైతం పెద్దఎత్తున ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘‘స్వేచ్ఛకు సంకెళ్లా?...సిగ్గు...సిగ్గు.. బ్యాంక్ ఖాతాలు ఆపేసి కలాన్ని ఆపగలరా..? ప్రకటనలు నిలిపివేత ప్రభుత్వ కుట్ర.. సాక్షి వ్యక్తికాదు... జర్నలిస్టుల శక్తి’’ అన్న నినాదాలు మార్మోగాయి. అనంతరం ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతలు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. బ్యాంక్ ఖాతాల నిలుపుదలపై సీబీఐ పునరాలోచించాలని, ప్రకటనలను నిలుపుదలచేస్తూ ప్రభుత్వం విడుదలచేసిన జీవోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తిచేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాల నేతలు మాట్లాడారు...

కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై దాడే: శ్రీనివాసరెడ్డి
సాక్షి మీడియాకు ప్రకటనలు నిలుపుదలచేయడం, బ్యాంక్ ఖాతాలను ఆపుచేయడం పత్రికా స్వేచ్ఛపై దాడేనని ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కొన్ని మీడియా యాజమాన్యాలు మాత్రమే పత్రికా స్వేచ్ఛపై దాడి కాదంటూ ప్రచారం చేస్తున్నాయని, జర్నలిస్టులందరూ పత్రికా స్వేచ్ఛపై దాడిగానే భావించి నిరసనల్లో పాల్గొంటున్నారని అన్నారు. ‘‘సాక్షి బ్యాంక్ ఖాతాలను ఆపుచేయడంతో ప్రభుత్వానికి సంబంధంలేదని, కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తీసుకున్న చర్యగా సీఎం చెప్పారు. అయితే ఇప్పుడు సాక్షి కి ప్రకటనలు నిలుపుదలచేస్తూ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీచేయడంతోనే అసలు కుట్ర బయటపడింది’’ అని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. అధికార కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్ర చేశాయని ఆరోపించారు. 

ప్రభుత్వం తనగొయ్యి తానే తవ్వుకుంటోంది: అమర్
సాక్షిపై కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. ప్రకటనల నిలుపుదల, ఖాతాలను ఆపుచేయడం వంటి చర్యల వల్ల సాక్షిపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఉపాధిని దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. ‘జగన్‌తో ప్రభుత్వానికి రాజకీయ విభేదాలుంటే తేల్చుకోండి... నేరుగా అతనితో తలపడండి. ఆ విషయాలలో జర్నలిస్టు సంఘాలు జోక్యం చేసుకోబోవు. జర్నలిస్టుల ఉపాధికి భంగం కలిగే చర్యలకు పాల్పడితే మాత్రం సంఘాలు చూస్తూ ఊరుకోబోవు..’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళతా: అమర్‌నాథ్
సాక్షికి ప్రకటనలు నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం కచ్చితంగా కక్షసాధింపు చర్యగానే భావించాల్సి ఉంటుందని ఐజేయూ నేత అమర్‌నాథ్ అన్నారు. ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా రాష్ర్ట ప్రభుత్వ వైఖరిపై చర్చ పెడతానన్నారు. 

సాక్షిని మూసివేసే కుట్ర: నరేందర్‌రెడ్డి
సాక్షికి ప్రకటనలు నిలుపుదల చేయడం ద్వారా ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టి పత్రిక, టీవీ చానల్‌ను మూసివే యాలని ప్రభుత్వం చూస్తోందని ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ కుట్రేనని ధ్వజమెత్తారు. జర్నలిస్టు కుటుంబాలకు నష్టం జరిగితే ఉపేక్షించబోమని, దీర్ఘకాలిక ఆందోళనలు చేపడతామన్నారు.

ఇది ‘సాక్షి’ సమస్య మాత్రమే కాదు: సోమసుందర్
ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల జర్నలిస్టు కుటుంబాలు వీధినపడే పరిస్థితి వస్తోందని ఏపీయూడబ్ల్యూ జే అధ్యక్షుడు సోమసుందర్ అన్నారు. ‘‘ఇది సాక్షికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. జర్నలిస్టులందరికీ సమస్య’’ అని చెప్పారు. మీడియాపై దాడి కాదంటూ ప్రకటనలు చేసే యాజమాన్యాలు పునరాలోచించుకోవాలన్నారు. 

వీధుల పాలుచేయాలని చూస్తున్నారు: వైజయంతి
సాక్షి మీడియాను దెబ్బతీయడం ద్వారా జర్నలిస్టులను వీధులపాలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని మహిళా సీనియర్ జర్నలిస్టు పూర్ణానంద వైజయంతి మండిపడ్డారు. సాక్షిని మూసేయించడం ద్వారా ప్రజలకు ప్రత్యామ్నా మీడియా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. 

సీబీఐ క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నా
సాక్షి బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు గురువారం రాజ్‌భవన్ రోడ్డులోని సీబీఐ క్యాంపు కార్యాలయం (దిల్‌కుషా గెస్ట్‌హౌస్) ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు తొలుత గెస్ట్‌హౌస్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బయటికి నెట్టేసి గేటు మూసివేశారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగిస్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం దౌర్జన్యంతో జర్నలిస్టుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె.మంజరి, అమరయ్య, మామిడి సోమయ్య, ఎం.ఎ.రవూఫ్, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ ఉపాధ్యక్షులు పి.రాంచందర్, మధుసూధన్‌రెడ్డి, విజయానంద్, సాక్షి ప్రతినిధులు పి.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

సమాచార భవన్ ముట్టడి
సాక్షికి ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేస్తూ జారీ చేసిన 2097 జీవోను వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు సమాచార భవన్‌ను ముట్టడించారు. కమిషనర్ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. కమిషనర్ బయటికి రావాలంటూ బైఠాయించిన జర్నలిస్టులతో పోలీ సులు వాగ్వాదానికి దిగారు. కొంతమంది జర్నలిస్టులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని క మిషనర్ చాంబర్‌కు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సమాచార కమిషనర్ చంద్రవదన్ జర్నలిస్టులందరినీ పిలిపించి వారి డిమాం డ్‌ను తెలుసుకున్నారు. 

కమిషనర్‌తో జరిగిన భేటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.హష్మీ, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, జాతీయ నాయకులు అమరయ్య తదితరులు మాట్లాడారు. ఇప్పటికే సీబీఐ సాక్షి బ్యాంకు ఖాతాలను నిలిపివేసిందని.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలను నిలిపివేస్తూ జీవో జారీ చే సిందన్నారు. దీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు.
Share this article :

0 comments: