ఉద్యోగుల వివరాలివ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉద్యోగుల వివరాలివ్వండి

ఉద్యోగుల వివరాలివ్వండి

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

 సాక్షి పత్రిక, సాక్షి టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు ఉంచాలని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు హైకోర్టు నిర్దేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ మూడు సంస్థలూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మూడు సంస్థల పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ గురువారం విచారించారు. పిటిషనర్ల తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సీబీఐ ఏకంగా తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందని తెలిపారు. 

కరెంటు ఖాతాల్లో దాదాపు 8 కోట్ల రూపాయలు ఉన్నాయని, ప్రతి రోజూ ఈ ఖాతాల్లో లావాదేవీలు జరుగుతుంటాయని, ఖాతాల స్తంభన వల్ల పత్రికకు వివిధ రూపాల్లో వచ్చే మొత్తాలు జమ కావటం లేదని వివరించారు. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు జోక్యం చేసుకుంటూ.. సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.
Share this article :

0 comments: