రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను ఆస్తుల కేసులో సీబీఐ వరుసగా మూడో రోజూ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం.. జగన్ ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్టణం, వైఎస్ఆర్ జిల్లా, రాజమండ్రి, వరంగల్ తదితర అనేక ప్రాంతాల్లో బందోబస్తు పెంచడానికి తోడు.. ఆర్టీసీ బస్సులు రద్దు చేయడం, వైఎస్ఆర్ సీపీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు ఎవరూ ఉండవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలను పోలీసులు తీసుకున్నారు.

జగన్ నివాసమైన లోటస్ పాండ్, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో ఇంట్లో ఉండగానే పార్టీ నాయకుడు రాఘవబాబును పోలీసులు అరెస్ట్ చేయగా, వరంగల్ లో కొండామురళిని గృహ నిర్బంధం చేశారు.

అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు ఆపేశారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం పాలయ్యారు. మరోవైపు జననేత జగన్ ను అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళనతో కృష్ణా జిల్లా మోగులూరుకు చెందిన షేక్ ఫాతిమా అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది.
Share this article :

0 comments: