అర్ధరాత్రి అరెస్టులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అర్ధరాత్రి అరెస్టులు

అర్ధరాత్రి అరెస్టులు

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రకరాల కుట్రలకు తెరలేపుతున్న సర్కారు.. ఆ పార్టీ కార్యకర్తలనూ అణచివేసే చర్యలకు దిగుతోంది. జగన్ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశముందన్న సాకుతో పార్టీ నేతలు, కార్యకర్తలను దొరికినవారిని దొరికినట్లుగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎప్పుడూ ఎటువంటి వివాదాల జోలికి పోని వారిపైనా బైండోవర్ కేసులు పెడుతున్నారు. 

పలు జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మితోపాటు నేతలు సుంకర చిన్ని, బొమ్మన రాజ్‌కుమార్‌లతోపాటు 50 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ వెళ్లడానికి రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు వచ్చిన వీరిని రాత్రి 8.40 గంటల సమయంలో అరెస్టు చేశారు. 

వరంగల్ జిల్లాలో చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్, కురవి, చేర్యాల, జనగామ, తది తర ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు. పరకాలలోనూ పలువురు నేతలను అదుపులోకి తీసుకొని, సెల్‌ఫోన్లు లాక్కున్నట్లు సమాచారం. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే గురువారం 600కు పైగా కార్యకర్తలను బైండోవర్ చేశారు. పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కరీము ల్లా, అతని సోదరుడు, మాజీ కార్పొరేటర్ షంషేర్‌లతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తహశీల్దారువద్ద బైండోవర్ చేశారు. కరీముల్లా సోదరులపై గతంలో ఎటువంటి కేసులు లేకపోవడంతో తహశీల్దార్ పోలీసులను మందలించినట్లు సమాచారం. 
Share this article :

0 comments: