లిక్కర్ అంటేనే బొత్స.చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లిక్కర్ అంటేనే బొత్స.చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్

లిక్కర్ అంటేనే బొత్స.చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

ఢిల్లీ పెద్దల కాళ్లుమొక్కారు: జనక్‌ప్రసాద్
చిరు మెగాస్టార్ కాదు..డబ్బులు దాచిన మెగాస్టోర్

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో లిక్కర్ పేరు వినగానే ప్రజలకు గుర్తొచ్చేది పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఏసీబీ రిపోర్టులో పేరు తొలగించుకోవడానికి ఢిల్లీ పెద్దల కాళ్లను మొక్కిన నీచ చరిత్ర ఉన్న బొత్సకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొత్సనుద్దేశించి కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు. ‘బొత్స మద్యం సిండికేట్ నిర్వహిస్తూ పేదల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఆయన ఒక్క మద్యమే కాదు ల్యాండ్ మాఫియా చేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. బినామీలను పెట్టి సినిమా తీయిస్తున్న చరిత్ర కూడా ఆయనదే’ అని హర్షకుమార్ చెప్పారన్నారు. చంద్రబాబుతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుమ్మక్కయారని మీడియాకు లీకులిచ్చిన బొత్స... ఇప్పుడు ఏసీబీ రిపోర్టులో తన పేరు తొలగించగానే సీఎంతో కలిసి జగన్‌ను విమర్శిస్తూ ప్రజల్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. పీఆర్పీని కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ డబ్బును బెడ్ కింద దాచిన మెగాస్టోర్ అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి కూడా జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు నేపథ్యంలో జగన్‌పై సీబీఐ విచారణ చేపట్టి పది నెలలు కావొస్తున్నా.. ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన వివాదాస్పద 26 జీవోలు చట్టబద్దంగానే జరిగాయని చెప్పే దమ్ము బొత్సకు ఉందా? అని నిలదీశారు. ఒక వేళ చట్టప్రకారం లేకపోతే వాటిని రద్దు చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఆ జీవోలు విడుదలవుతున్నప్పుడు మంత్రిగా ఉన్న బొత్స డీసెంట్ నోట్ ఇవ్వకుండా గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా అని ఎద్దేవా చేశారు. 

జగన్ సీఎం కావాలని సంతకాలు చేయించిందెవరు?

వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత జగన్ సీఎం కావాలంటూ ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది ఎవరని బొత్సను జనక్‌ప్రసాద్ నిలదీశారు. పదవుల కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని ఊడిగం చేసే నీచ చరిత్ర కాంగ్రెస్ నేతలదేనని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. జూన్ 12 ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి గాల్లో దీపంలా మారనుందన్నారు.
Share this article :

0 comments: