‘సాక్షి’కి ప్రకటనల నిలుపుదల వ్యాజ్యాలపై... హైకోర్టులో నేడు విచారణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’కి ప్రకటనల నిలుపుదల వ్యాజ్యాలపై... హైకోర్టులో నేడు విచారణ

‘సాక్షి’కి ప్రకటనల నిలుపుదల వ్యాజ్యాలపై... హైకోర్టులో నేడు విచారణ

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

సాక్షి దినపత్రిక, టీవీలకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు గురువారం విచారించనున్నది. వాస్తవానికి ఈ నాలుగు వ్యాజ్యాలు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా, కోర్టు సమయం ముగియడంతో, ఈ వ్యాజ్యాలను గురువారం విచారిస్తానని న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి స్పష్టం చేశారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీలకు ప్రభుత్వ ప్రకటనలు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి జారీ చేసిన చీకటి జీవో 2097ను కొట్టివేయాలని, అలాగే సాక్షికి వెంటనే ప్రకటనలు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సోమవారం ఇందిరా టెలివిజన్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్, జగతి పబ్లికేషన్స్ ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఇ.ప్రసాదరెడ్డి, అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి.రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో చీకటి జీవోను కొట్టివేయాలని, ఈ కేసు తేలేంత వరకు జీవో అమలును నిలుపుదల చేయాలంటూ సాక్షి ఎడిటర్ వి.మురళి ఒక పిటిషన్, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎస్.రాజమహేందర్‌రెడ్డి, టి.వేణుగోపాలరావు తదితరులు మరో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సాక్షి బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింప చేయడాన్ని సమర్థిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో మూడు పిటిషన్లు దాఖలు చేశాయి. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ గురువారం విచారిస్తానని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు.
Share this article :

0 comments: