సోనియాకు జగన్ ‘ఫోబియా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సోనియాకు జగన్ ‘ఫోబియా’

సోనియాకు జగన్ ‘ఫోబియా’

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

రాజకీయాల్లో వాస్తవికతకు ఉండేంత ప్రాధాన్యం ప్రజాభిప్రాయానికి కూడా ఉంటుంది. అలా అని ఆ రెండింటి మధ్య తేడా ఉండి తీరాలనేమీలేదు. జగన్ మోహన్‌రెడ్డి అరెస్టుకు సంబంధించిన వాస్తవాలు, అవాస్తవాలను పక్కనబెట్టి, ఆయన అరెస్టుపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో వివరించవచ్చు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి సోనియాగాంధీ, ఒక ముఖ్యమంత్రి కుమారుడిని అన్యాయంగా వేధింపులకు గురవుతున్న నేతగా, జాతీయ హీరోగా మార్చడానికి చేయగలిగినదంతా చేస్తున్నట్టు అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ విమాన ప్రమాదంలో మరణించిన తదుపరి కాంగ్రెస్ సంస్కృతికి సహజమైన వారసత్వ సమస్య తలెత్తింది. వైఎస్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అప్పటికే ఎంపీ. పైగా రాష్ట్ర కాంగ్రెస్‌లో అత్యధికులు కూడా అతడే తండ్రికి వారసుడు కావాలని కోరుకున్నారు. కాబట్టి అంతా సాఫీగా సాగిపోయేదే. కారణమేమిటో ఏమోగానీ సోనియా దానికి అడ్డుపడ్డారు. కాంగ్రెస్‌కు అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న రాష్ట్రానికి తన కుమారుడు రాహుల్‌కంటే చిన్నవాడైన ఒక యువకుడు ముఖ్యమంత్రి కావడమనేది ఆమెను మరీ అంతగా భయపెట్టిందా? జగన్ బలానికి కత్తెర వేయ డం కోసం హడావిడిగా, ఆమె ఎలాంటి సన్నాహాలు లేకుండానే పత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని అస్థిరత్వం పాలు చేశారు. 

రాష్ట్ర పార్టీలోని వైఎస్ విధేయులకు, కేంద్ర నాయకత్వానికి విధేయులైన నిష్క్రియాపరులైన కొందరు నేతలకు మధ్యన అగాథం పూడ్చరానిదిగా పెరిగింది. ఆ తదుపరి జగన్ ఎంపీ పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సొంత పార్టీని స్థాపిం చారు. దీంతో కాంగ్రెస్, మంత్రి పదవులను ఆశజూపి, బహిష్కరణల పేరిట బెదిరించి ప్రభుత్వాన్ని ఎలాగోలా నిలబెట్టుకోగలిగింది. జగన్ భయంతో సినీ నటుడు చిరంజీవి వంటి కాంగ్రెస్ వ్యతిరేకులతో బేరసారాలు సాగించి, సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు మద్దతుదార్లయిన వారికి తప్పుడు సంకేతాలను పంపింది. నెలలు తిరిగేసరికి, ఊహించినట్టుగానే జగన్ బలం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నానాటికీ బలహీనపడింది. 

జగన్ పార్టీలో చేరిపోయేవారిని బెదిరింపులతో తప్ప నివారించలేని స్థితి ఏర్పడింది. ఇప్పు డు ఉప ఎన్నికల పరీక్షా సమయం వచ్చింది. అప్పటికే ఆదాయినికి మించిన ఆస్తుల ఆరోపణలతో సీబీఐ చేత జగన్‌పై క్రిమినల్ కేసులను పెట్టించిన ప్రభుత్వం ఇక ఇప్పుడు ఏం చేసింది? జగన్ ప్రచారాన్ని దెబ్బతీయడం కోసం ఎన్నికలకు ముందు అతన్ని అరెస్టు చేసింది. సీబీఐ జగన్‌ను విచారించడం మాత్రమే చేస్తుంటే, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయడమేమిటని న్యాయమూర్తి అంతకు ముందే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు! జగన్ మరుసటి రోజు సీబీఐ కోర్టులో హాజరు కావాల్సి ఉన్నా కూడా అరెస్టు చేశారు. 

దీంతో ప్రజలు ఇదంతా రాజకీయకక్ష అన్న నిర్ధారణకు వస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త అలర్ట్‌ను ప్రకటించింది. వీధుల్లో నిరసనలు జరగకుండా జగన్ మద్దతుదార్లను నిర్బంధించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే, జగన్ అంటే ఎంతటి శక్తివంతుడైన గొప్ప నేతో చాటడానికి చేయగలిగినదంతా చేసింది. అన్యాయంగా వేధింపులకు గురవుతున్న నేతగా ఇలా ప్రజల ముందు నిలిపిన జగన్‌కు వేరే ప్రచారం అవసరమేమైనా ఉందా? మొత్తంగా ఈ రాజకీయ నేపథ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్లకు ఇది ఎలా కనిపిస్తుందో ఆలోచించండి. 

జగన్ ఆదాయానికి మించి సంపాదించినవిగా ఆరోపిస్తున్న ఆస్తులన్నీ ఆయన తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించినవి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు వైఎస్ రాజకీయంగానూ, ఆర్థికంగానూ కూడా రాజపోషకునిగా ఉండేవారనేది అందరికీ తెలిసిందే. ములాయంసింగ్ యాదవ్, మాయావతి, లాలూప్రసాద్ యాదవ్‌లపైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులున్నాయి. యూపీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తూ, ఆ ముగ్గురూ జైలు గోడలకు వెలుపల హాయిగా గడుపుతున్నారు.

పదిమందికి పైగానే ప్రధాన కాంగ్రెస్ నేతలు పీకల వరకు అవినీతి కేసుల్లో దిగబడి ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిపైనా ఏ చర్యలూ లేవు. విదేశీ గూఢచార సంస్థల నుంచి సోనియా కుటుంబానికి నిధులు అందాయని, విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని ప్రతిష్టగలిగిన విదేశీ పత్రికలు, రచయితలు ఆరోపించారు. వారిపై పరువునష్టం కేసులను పెట్టడానికి సోనియా తిరస్కరించారు. కాంగ్రెస్ నేతలు నిజంతో చేస్తున్న గారడీ ఏదైనా గానీ, ప్రజలు మాత్రం జగన్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని అర్థం చేసుకునేది మాత్రం ఇలాగే. 

యూపీఏ ప్రభుత్వం నిస్సిగ్గుగా అవినీతికి, గిట్టనివారిపై వేధిం పులకు పాల్పడుతున్నా ప్రతిపక్ష పార్టీలు చేష్టలుడిగి చూస్తున్నాయి. మమతాబెనర్జీ లాగా తిరగబడే యూపీఏ మిత్రులు సైతం కేంద్రం పట్ల పైపై వ్యతిరేకతను మాత్రమే చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక రాజకీయ వేత్తగా జగన్‌మోహన్‌రెడ్డిని దేశవ్యాప్తంగా గుర్తిస్తారు. 

ఆయనను ఒక జాతీయ నేతగా తయారుచేయడానికి సోనియా చేయగలిగినదంతా చేస్తున్నారు. ఆమెకు ఇప్పుడు రాజకీయ ఆత్మహత్యా కాలం రాసిపెట్టయినా ఉండాలి లేదంటే ఆమె పార్టీలోనే ఎవరో ఒక ఏజెంటు విద్రోహానికి పాల్పడుతూనైనా ఉండాలి, జగన్ ఏజెంటు ఎవరైనా సోనియా నివాసంలో తిష్టవేసి ఉన్నాగానీ, ఆయన ప్రతిష్టను ఇంతగా ఇనుమడింపజేసే వ్యూహాన్ని రచించలేరు. 
(‘ది స్టేట్స్‌మన్’ సౌజన్యంతో...)
Share this article :

2 comments:

Laxminarayana Paladi said...

Yes, Sure, Jagan is certainly going to become a national leader, in the nearest future, to save our democracy and to protect political principles and eliminate waste politics like the present.

Laxminarayana Paladi said...

If politics are this mean, this unprincipled, this manner less, this inhuman this dirty; then better for the whole country, to go for suicide.