పునఃపరిశీలించండి. వైఎస్సార్ సీపీకి ‘ఫ్యాన్’ కేటాయింపుపై ఈసీకి హైకోర్టు ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పునఃపరిశీలించండి. వైఎస్సార్ సీపీకి ‘ఫ్యాన్’ కేటాయింపుపై ఈసీకి హైకోర్టు ఆదేశం

పునఃపరిశీలించండి. వైఎస్సార్ సీపీకి ‘ఫ్యాన్’ కేటాయింపుపై ఈసీకి హైకోర్టు ఆదేశం

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ‘ఫ్యాన్’ గుర్తును ఉమ్మడి గుర్తుగా కేటాయించాలంటూ ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని పునఃపరిశీలించాలని హైకోర్టు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి, జస్టిస్ కె.జి.శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 

ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు ‘ఫ్యాన్’ను ఉమ్మడి గుర్తుగా కేటాయించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఈసీని కలిసి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ స్పందించకపోవడంతో పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్ 1968లోని 12(3)(ఎ) క్లాజ్ ప్రకారం ఫ్యాన్ గుర్తును కామన్ సింబల్‌గా పొందేం దుకు తమ పార్టీ అభ్యర్థులకు అర్హత ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి నివేదించారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారని తెలిపారు. కామన్ సింబల్‌గా ఫ్యాన్ గుర్తును కేటాయించే విషయంలో ఈసీ అధికారులకు ఎటువంటి ఇబ్బందులూ లేవని, అయినా ఈ విషయంలో వారెటువంటి నిర్ణయం వెలువరించలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పార్టీ విజ్ఞప్తిని పునః పరిశీలించాలని ఈసీకి స్పష్టం చేసింది.
Share this article :

0 comments: