తిరుపతికి చిరంజీవి విడాకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతికి చిరంజీవి విడాకులు

తిరుపతికి చిరంజీవి విడాకులు

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కె.చిరంజీవి తిరుపతితో శాశ్వతంగా విడాకులు తీసుకున్నారు. రాజకీయంగా ఉన్న చివరి అనుబంధానికి కూడా రాం రాం చెప్పారు. రాజ్యసభ ద్వారా మున్సిపల్ కౌన్సిల్‌లో ఎక్స్ అఫిషియోగా కొనసాగే అవకాశాన్ని తిరుపతి కార్పొరేషన్‌కు ఇవ్వలేదు. రాజ్యసభ సభ్యునిగా తనకు ఉన్న అవకాశాన్ని ఆయన గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్స్ అఫిషియో సభ్యత్వం కోసం ఆప్షన్ ఇచ్చారు. దీంతో తిరుపతి నగరంతో రాజకీయంగా ముడిపడేందుకు ఉన్న ఒక్కగానొక్క చివరి అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు అయింది.

తిరుపతితో దూరం పెరిగిందిలా...
‘‘నేను రాజ్యసభకు వెళ్లినా తిరుపతిని వదలను. నా బాధ్యత మరింత పెరిగింది. ఇక్కడ అనుబంధాన్ని ఏ రకంగానూ తెంచుకోను. ఎమ్మెల్యేగా లేకపోతే తిరుపతితో బంధం ఎలా తెగుతుంది.’’ అని నెలన్నర క్రితం చిరంజీవి స్థానిక నాయకులపైన, మీడియాపైన చిర్రుబుర్రులాడారు. అయితే అదే ఇప్పుడు అక్షర సత్యం అయింది. 2008, ఆగస్టు 26న తిరుపతిలో పీఆర్పీని స్థాపించారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతి స్థానాల్లో పోటీచేస్తే, సొంత జిల్లా పాలకొల్లులో ఓడారు. తిరుపతిలో మాత్రం 15వేల మెజార్టీతో గెలిచారు. ఆ రోజు నుంచి తిరుపతి తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని, తన ఆత్మ తిరుపతిలోనే ఉంటుందని మీడియా ద్వారా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేసిన తరువాత నియోజకవర్గానికి రెండు నెలలకొకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో పంచాయతీ వార్డులు, మున్సిపల్ వార్డు లు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏ వార్డులో ఏ సమస్య ఉంది. 

పజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకోలేకపోయారు. అధికారిక పర్యటనకు రావటం తప్ప, ఏ రోజూ వార్డుల్లోకి వెళ్లి నేరుగా ప్రజలను కలుసుకోలేదు. ఇక ఇక్కడ సాధ్యం కాదు అనుకున్నా రో ఏమో మొత్తానికి రాజ్యసభ పదవికి ఆశపడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన తిరుపతి నియోజకవర్గాన్ని వదిలేశా
రు. పోనీలే రాజ్యసభ సభ్యునిగా అయినా స్థానికంగా అందుబాటులో ఉంటారు. తిరుపతి కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా కొనసాగుతారనుకున్నారు. అరుుతే చిరంజీవి సినిమా ఫక్కీలో ప్రజలకు చేయిచ్చి తిరుపతివాసులకు అందకుండా రాజధానికే పరిమితం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందించారు. ఎంతైనా సినీనటుడు కదా... మన నాయకుడు మనకు కూడా చేయిచ్చాడే అని పూర్వ పీఆర్పీ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తెల్లముఖాలేస్తున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యునిగా తిరుపతి కౌన్సిల్‌లో ఉంటే అప్పుడప్పుడూ తిరుపతి వచ్చేవారు. ఒకటి అర సిఫార్సులు చేసుకోవటానికి వీలయ్యేది, ఇప్పుడు అది కూడా పోరుుందే అని కాంగ్రెస్ నాయకులు లోలోన మధనపడుతున్నారు.
Share this article :

0 comments: