పరకాల బరిలో దిగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరకాల బరిలో దిగం

పరకాల బరిలో దిగం

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

పరకాల బరిలో తమ అభ్యర్థిని దించడం సాధ్యం కాదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. స్థానిక టీఎన్జీవోల భవన్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జేఏసీ రాజకీయ పార్టీ కాదన్నారు. అయితే, పరకాలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీమాంధ్ర పార్టీల ప్రతినిధులు గెలువకుండా జేఏసీ సర్వశక్తులను కేంద్రీకరిస్తుందని తెలిపారు. జేఏసీని దెబ్బ తీయాలన్న ఆంధ్రాపాలకుల కుట్రలో భాగంగానే కొన్నిపత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయన్నారు. ఈ 
దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కొద్దివారాల్లో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు రానున్నాయని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సాధనకు జేఏసీ బలమైన ఉద్యమాన్ని నిర్మించనుందని వివరించారు. జేఏసీ సంఘటితంగా ఉందని, ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కోదండరాంను దింపేద్దామంటూ కేసీఆర్ కొన్ని జిల్లాల జేఏసీ నేతలతో మాట్లాడారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ అసంకల్పితంగా మాట్లాడుకునే మాటలకు విలువ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఉద్యమక్రమంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని, వాటన్నింటినీ అంతర్గతంగా పరిష్కరించుకోగలిగే పరిపక్వత, నైపుణ్యం జేఏసీకి ఉందన్నారు.
Share this article :

0 comments: