ఎవరు శుద్ధపూసలు!? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరు శుద్ధపూసలు!?

ఎవరు శుద్ధపూసలు!?

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

 మామా, మాట్రిక్స్ ప్రసాద్ ని అరెస్ట్ చేశారుగా, ఇంకా ఎవరిని చేస్తరు మామా, లక్షల కోట్ల సహజ వనరుల్ని అప్పనంగా దోచేస్తున్న ముఖేష్ అంబానీని కూడా అరెస్ట్ చేస్తారా?
- వాడెందుకు అరెస్టవుతాడురా? ప్రతీ ఎన్నికలో కాంగ్రెస్ కి ఆర్థిక సాయం చేసేది వాళ్లే కదా... చివరకు వామపక్షాలూ ముఖేష్ కి ఆత్మీయులే కదా!!
- ఒక కేబినెట్ ఇండస్ట్రియల్ పాలసీలను సీబీఐ ప్రశ్నిచగలదా? అలాగైతే అన్ని కంపెనీలనూ రకరకాల రాయితీలతో ఆకర్షిస్తున్న గుజరాత్ మోడీని అరెస్ట్ చేస్తారా?
- అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు కదా, తన జోలికి పోరు... పోతే మోడీ ఒకటికి పది అంటిస్తాడు కదా... భయపడతారు!W
- మామా మరి భూకేటాయింపుల్లో అక్రమాలే ప్రాతిపదిక ఐతే ఐఎంజీ భారత్ అనే బినామీ పేరుతో చంద్రబాబు కుర్చీ దిగిపోయే ముందు వందల ఎకరాలు రాసిచ్చాడు కదా, క్విడ్ ప్రోఖో అంటే గుర్తొచ్చేది తనే కదా... ఎల్ అండ్ టీకి సెక్రెటేరియట్ డీ బ్లాక్ కంట్రాక్ట్ ఇచ్చి ఎణ్టీయార్ ట్రస్ట్ భవన్ కట్టించాడు కదా... చంద్రబాబునీ, ఎల్ అండ్ టీ వాళ్లనూ అరెస్ట్ చేస్తారా?
- చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగానే సపోర్ట్ చేస్తున్నాడు కదా... అరెస్ట్ ఎలా చేస్తారు?
- మరి 120 బినామీ పేర్లతో శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా మద్యం మాఫియా నడిపిస్తున్న బొత్స సత్తిబాబుని అరెస్ట్ చేస్తారేమో కదా మామా!
- అరే, పిచ్చోడా, తను పీసీసీ అధ్యక్షుడు కదా, ఎలా చేస్తారు? 
_ మరెలా మామా? పోనీ అమీర్ పేట భూకుంభకోణంలో ఇరికిన రోశయ్యను అరెస్ట్ చేస్తారా? కనీసం కేసైనా పెడతారా లేదా?
- మూర్ఖుడా, తను తమిళనాడు గవర్నర్... కేంద్రంతో గొడవ లేదు కదా... తన జోలికి పోరు...
- సరే మామా, ఐఎంజీ భరత్ కేటాయింపులకు సంబంధించి 2004 వరకున్న కేబినెట్ మంత్రులని బొక్కలో తోస్తారా?
- అరే, ఔలా, ఇప్పుడు టార్గెట్ జగన్ మాత్రమే... ఇంకెవరినీ ఏమీ చేయరు...
- వోకే మామా, పోనీ వైఎస్ కేబినెట్ లో ఉన్న అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి కదా?
- వాళ్లంతా కాంగ్రెస్ సర్కారులో ఉన్నారు కదా, జస్ట్ కిరణ్ కుమార్ కి పడని వాళ్లనే టార్గెట్ చేస్తారు...
- వాళ్ల సోదరులు చేసే అక్రమాలపై ఏమైనా విచారణ చేస్తారా?
- అదేమీ లేదు, కాంగ్రెస్ కి పడని వాళ్లపైనే విచారణలూ, కేసులూ, అరెస్టులూ...
- పోనీ ఇన్ని చెబుతున్నారు కదా, మార్గదర్శి, పాలమాకుల భూకుంభకోణం, ఫిలిం సిటీ అసైండ్ భూబాగోతం, విశాఖ ఆఫీసు చీటింగ్... ఈనాడు రామోజీ పై ఏమైనా కేసు పెడతారా?
- తను ఇప్పుడు కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ కదా, కేసు పెట్టరు, పాత కేసులూ కొట్టేస్తారు...
- అదేమిటి, తను కాంగ్రెస్ విరోధినని కోర్టుకు అఫిడవిటే ఇచ్చాడు కదా....
- కాంగ్రెస్ పిచ్చి ముం... కొడుకులకు అది అర్థమయ్యేలోగా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది...
- తారా చౌదరి కేసులో రేణుకా, వక్ఫ్ భూముల దురాక్రమణ కేసులో లగడపాటినీ, జాతీయ రోడ్ల కుంభకోణంలో రాయపాటినీ, కావూరినీ బొక్కలో తోస్తే ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది... మురళీమోహన్, విశాఖ మూర్తి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు, మేఘమధనం రఘువీరా... ఎందరో ఇంకెందరో... 
- వాళ్ల జోలికి పోతే కూసాలు కదిలిపోతాయి కదా, అందుకే పాపం, గీతా రెడ్డి, పొన్నాల, కన్నా, ధర్మాన వంటి చిల్లర నేతల జోలికి పోతారులే...
- ఇదేం రాజకీయం మామా, అందరూ నీతి నీతి అంటారు, మరి ఒక్క అవినీతి పరుణ్నీ అరెస్ట్ చేయరు అంటావు... ఇదెట్లా?
- అదేరా బాబూ... డిల్లీ చెప్పినట్లు వింటే నీతిపరుడు, లేదంటే అవినీతిపరుడు.... మనకు ఉపయోగపడతాడు అనుకుంటే నీతిపరుడు, లేదంటే అవినీతిపరుడు...
- బియ్యం ఎగుమతులు, బొగ్గు గనుల కేటాయింపులు, డిల్లీ ఎయిర్ పోర్ట్ కుంభకోణం, ఇస్రో స్కాం... రోజుకొక్క స్కాం బయటపడుతున్నా వీటిల్లో ఒక్కడికీ అరెస్ట్ వారెంట్ ఇవ్వరేం మామా...?
_ అరే, వాళ్లతో ఇప్పుడు ప్రాబ్లం లేదు కదరా... 
_ ఓహో, కేంద్రంతో బాగుంటే ఏ కేసూ ఉండదన్నమాట... ఎదురు తిరిగితే కష్టాలు ఉంటాయన్నమాట...
- అదే మరి, రాస్థ్ట్రంలో జరుగుతున్నదీ, నువ్వు అర్థం చేసుకోవాల్సిందీ!! 

source: http://laahiri.blogspot.in/
Share this article :

0 comments: