ఈ ప్రశ్నలకు బదులేది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ప్రశ్నలకు బదులేది?

ఈ ప్రశ్నలకు బదులేది?

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

సీబీఐ దర్యాప్తు మరిన్ని మలుపులు తిరిగింది. ‘సాక్షి’ బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసింది. అది కూడా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాలకు చెందిన కరెంట్ ఖాతాల్ని. ఆ తరవాత జగతి పబ్లికేషన్స్‌లో రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టి 11.7 శాతం వాటా కలిగి ఉన్న ఇన్వెస్టరు నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో చార్జిషీటు వేసే దశకు ఇంకా చేరుకోలేదని కూడా చెప్పారు. ఇంతలోనే ప్రభుత్వం ‘సాక్షి’కి ప్రకటనలను నిలిపివేస్తూ జీవో జారీ చేయటం... ‘సాక్షి’ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటుందంటూ ఒక వర్గం మీడియాలో హోరెత్తిపోవటం అందరికీ తెలిసిందే. అయితే ఖాతాల స్తంభనను, ప్రకటనల నిలిపివేతను సీబీఐ కోర్టులో సవాల్ చేసిన ‘సాక్షి’కి ఊరట లభించలేదు. హైకోర్టులో ఈ రెండిటినీ సవాల్ చేయగా... ప్రకటనల జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఖాతాల స్తంభన వచ్చేవారం విచారణకు రానుంది.

ఖాతాల స్తంభనకు సంబంధించి సీబీఐ ఎందుకంత దుందుడుకుగా వ్యవహరించింది?

ఎందుకంటే దొంగతనం చేసిన సొమ్మును ఇలా స్వాధీనం చేసుకోవచ్చని చట్టంలో ఉన్న నిబంధనను అడ్డం పెట్టుకుని... దాని ఆధారంగా కరెంట్ అకౌంట్లను స్తంభింపజేయటమన్నదే ఇక్కడ కీలక అంశం. ఆయా కరెంట్ ఖాతాల్లో ఉండేది రోజువారీ అడ్వర్టయిజ్‌మెంట్లు, పత్రిక కొన్న చందాదారులు ఇచ్చిన సొమ్ము ఆ ఖాతాల్లోకి వస్తుంది. దాన్ని అడ్డుకోవటమంటే పత్రికను అడ్డుకోవటం కాదా? 

దర్యాప్తు పూర్తయిందని ఒకవంక, ఇంకా చార్జిషీటు దశకే చేరలేదని మరోవంక చెప్పటమెందుకు? 

అసలు ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేస్తారు? ఉప ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయనగా ఇంత వేగంగా, తీవ్రంగా ఎందుకు కదలాల్సి వచ్చింది? ‘‘మేం ఇన్వెస్టర్లను అరెస్టు చేయం. వారి జోలికి వెళ్లం’’ అని కోర్టు ముఖంగా సీబీఐ న్యాయవాది ఎందుకు చెప్పారు? 

మళ్లీ ఇంతలోనే సీబీఐ ఎందుకు యూ టర్న్ తీసుకుంది? నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో వాన్‌పిక్‌కు ఇచ్చిన స్టాంపు డ్యూటీని ప్రస్తావించటమేంటి? 

ఈ రాష్ట్రంలో వేరే ఏ ప్రభుత్వమూ ఏ కంపెనీకీ స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వలేదా? పరిశ్రమ పెట్టే ప్రతి కంపెనీకీ ఇచ్చేదేగా? జగన్ కంపెనీల్లో ప్రసాద్ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టారని, కొంత వాటా విక్రయించగా ఇపుడు రూ.504 కోట్లు మిగిలాయని సీబీఐ చెబుతోంది. అసలు ముడుపులుగా పెట్టినవారికి లాభాలొస్తాయా? 

రూ.354 కోట్ల విలువైన వాటాల్ని లాభాలకు విక్రయించుకున్నారంటే మిగిలిన వాటానూ ఎప్పుడో ఒకప్పుడు లాభానికి విక్రయించుకునే అవకాశం ఉన్నట్టేగా? ప్రసాద్ ఒక్క సాక్షిలోనే పెట్టుబడి పెట్టలేదుగా? చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారుగా? ఒక పారిశ్రామిక వేత్తగా మునుపటి ప్రభుత్వాల హయాంలోనూ ప్రయోజనాలు పొందారుగా? అవన్నీ లెక్కలోకి రావెందుకు? 

ఈ ప్రశ్నలకు బదులేది?

విచారణ పూర్తయ్యాకే చార్జిషీటు వేస్తారన్న సంగతి సీబీఐకి తెలియదనుకోవాలా? 
‘సాక్షి’కి సమాచారమైనా ఇవ్వకుండా ఖాతాల్ని స్తంభించటం నైతికంగా సరికాదని సీబీఐకి తెలియదా? 

ఒక పత్రికకు ప్రకటనలు నిలిపేయటమంటే దాని ప్రాణం తీయకుండా ఆసుపత్రిలో చేర్చటమేనని ప్రభుత్వానికి తెలియదా? ఎమర్జెన్సీలో సైతం ఇంతటి దురాగతాలు జరగలేదే?

ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది తెల్ల దొరలా? ఎల్లో దొరలా?

మార్గదర్శిలో రికార్డుల స్వాధీనం పత్రికా స్వేచ్ఛపై దాడి చేసినట్టా చంద్రబాబూ?

నేరుగా సాక్షి ఖాతాలు నిలిపేస్తే ఇది పత్రికా స్వేచ్ఛకు సంబంధం లేని విషయమా?

ఈ గొంతులన్నీ ఎవరి కోసం అమ్ముడుపోతున్నాయి? వీళ్ల సమస్యేంటి? జగన్‌మోహన్ రెడ్డి జనాదరణా? ఆధిపత్యానికి చెక్ పెట్టిన సాక్షి పత్రికా? గెలుపు గుర్రం వైఎస్సార్ సీపీ అనేనా? 

కాంగ్రెస్-టీడీపీ- ఎల్లో మీడియా కుమ్మక్కుకు పై మూడూ ఉమ్మడి కారణమా?

వీళ్ల కుట్రలకు జనం సమాధానం చెప్పలేరనుకుంటున్నారా?
Share this article :

0 comments: