కోలాహలంగా సుచరిత నామినేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోలాహలంగా సుచరిత నామినేషన్

కోలాహలంగా సుచరిత నామినేషన్

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

 ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత బుధవారం నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ విజయోత్సవాన్ని తలపించింది. గుంటూరు రింగురోడ్ నుంచి బయలుదేరిన ర్యాలీలో ఆమె వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా నడిచారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొందరు పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయంలో మూడు సెట్ల నామినేషన్ పత్రాల్ని దాఖలు చేశారు.

పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డి.వెంకటరమణారెడ్డికి అందించారు. పార్టీ నేతలు గుదిబండి వెంకటరెడ్డి, కోన రఘుపతి, సినీనటుడు విజయ్‌చందర్, ఈవూరి అనూప్, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, మారుపూడి లీలాధర్‌రావు, షేక్ షౌకత్, అయూబ్‌ఖాన్, గులాం రసూల్, నసీర్ అహ్మద్, అన్నాబత్తుని సదాశివ, జెట్టి ఝాన్సీరాణి, బండారు సాయిబాబు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, నల్లమోతు రూత్‌రాణి, దాసరి నారాయణరావు, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, మూలె శ్రీనివాసరెడ్డి, బాపతు శ్రీనివాసరెడ్డి, బాపారావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రత్యర్థులు ఉలిక్కిపడేలా..
ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ప్రక్రియ ప్రభంజనాన్ని సృష్టించింది. నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఎరుగని రీతిగా అశేష జనవాహిని తరలివచ్చి ఆమెకు మద్దతుగా నినాదాలిచ్చారు. వైఎస్సార్ తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వేలాది గొంతులు గళం విప్పాయి. ప్రత్యర్థి పార్టీలు సైతం ఉలిక్కిపడేలా సుచరిత నామినేషన్ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని డాక్టర్ బాబూజగ్జీవన్‌రాం విగ్రహానికి, లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సుచరిత పూలమాలలు వేశారు. అనంతరం ఏటుకూరు బైపాస్‌మీదుగా ప్రత్తిపాడు రోడ్డులోకి రాగా, చుట్టుపక్కల గ్రామాల జనం ఘనస్వాగతం పలికారు. జగన్ బాటలో పయనిస్తూ, రైతుల పక్షాన నిలిచి రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ సుచరిత ఎమ్మెల్యే పదవి త్రుణప్రాయంగా త్యాగం చేసిన విషయం తెలిసిందే. 

మండేసూర్యుడు సాక్షిగా.. 
నిప్పులుకక్కుతున్న భానుడిని సైతం లెక్కచేయకుండా సుచరిత నామినేషన్ కార్యక్రమంలో అభిమానులు తరలివచ్చారు. ఏటుకూరు, పుల్లడిగుంట, ఐదవ మైలు, కుర్నూతల అడ్డరోడ్డు, కోయవారిపాలెం, బొర్రావారిపాలెం, తిక్కిరెడ్డిపాలెం గ్రామాల నుంచి వచ్చిన జనం ర్యాలీగా వచ్చారు. వేలాది మంది అభిమానుల నడుమ ఆమె కాన్వాయ్ ప్రత్తిపాడు రామవాగు నుంచి తహశీల్దార్ కార్యాలయానికి చేరింది. ఆమె అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నామినేషన్ కార్యాక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు.. తనపై విశ్వాసాన్ని చూపుతున్న ఓటర్లకు సుచరిత కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల నాయకులకు సుచరిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Share this article :

0 comments: