పథకం ప్రకారమే జగన్ అరెస్టు: వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పథకం ప్రకారమే జగన్ అరెస్టు: వైఎస్సార్ సీపీ

పథకం ప్రకారమే జగన్ అరెస్టు: వైఎస్సార్ సీపీ

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

ప్రజల్లో జనాదరణ పెంచుకుంటున్న తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కాంగ్రెస్, టీడీపీలు ఒక పక్కా పథకం ప్రకారమే అరెస్టు చేయించాయని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పార్టీ కేంద్ర పాలక మండలి, కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం అభిప్రాయపడింది. కుట్ర పూరితంగా జరిగిన ఈ అరెస్టును సభ్యులు ముక్త కంఠంతో ఖండించారు. జగన్ అరెస్టు అనంతరం సోమవారం ఉదయం నగరంలో అందుబాటులో ఉన్న ముఖ్యనేతల అత్యవసర సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. 

సమావేశం వివరాలను పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వెల్లడించారు. కాంగ్రెస్‌ను వీడిన తరువాతనే జగన్‌పై వేధింపులు ప్రారంభం అయ్యాయనీ, ఆయన ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజాదరణను పెంచుకోవడాన్ని ఓర్చుకోలేక పోయిన టీడీపీ కూడా అందుకు తోడయ్యిందనీ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన దుయ్యబట్టారు. జగన్‌ను అరెస్టు చేసిన రోజు ఒక చీకటి రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మినీ ఎమర్జెన్సీ తరహాలో పాలన సాగుతోందని ఆగ్రహం వ్క్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను ఎంతో కొంత తగ్గించాలనీ, ఎలాగూ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నాం కనుక మెజారిటీనైనా తగ్గించాలనే దురుద్దేశ్యంతోనే అరెస్టు జరిగిందన్నారు. 

జగన్‌ను ప్రజల్లో తిరక్కుండా అరెస్టు చేస్తే విధ్వంసాలు అవుతాయనీ వాటిని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలనే కుట్రను రచించారని ఆయన అన్నారు. అందుకే జగన్ జైలు నుంచి విడుదల అయ్యే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ఆవేశ కావేశాలకు లోను కాకుండా రెచ్చి పోకుండా సంయమనం పాటిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే ఉండాలని గట్టు పిలుపు నిచ్చారు. మే 28వ తేదీన ఎప్పటిలాగే జరగాల్సిన టీడీపీ మహానాడును కూడా చంద్రబాబునాయుడు వాయిదా వేశారంటే అది కుట్రలో ఒక భాగమని రామచంద్రరావు అన్నారు. అరెస్టు సంగతి బాబుకు ముందే తెలిసి ఇలా చేశారని ఆయన అన్నారు. విధ్వంసాలు జరిగినట్లు చూపించాలని ప్రభుత్వం తాపత్రయపడుతోందనీ ఆయన అన్నారు. 

తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉన్నా వెల్లాల రామ్మోహన్‌తో పాటు పలువురిని అరెస్టు చేసి వారితో బలవంతంగా విధ్వంసాలకు పాల్పడాలనే కుట్ర జరిగిందని పోలీసులు చెప్పించారని ఆయన అన్నారు.రాష్ట్రంలో కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆయన అన్నారు ఆరోగ్య పరీక్షలకు ఆసుపత్రికి వెళ్లి తమ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావును కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అనీ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగాయన్నారు. 28వ తేదీన మరో పది గంటల్లో సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన జగన్‌ను సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఈ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. 

తన బిడ్డను ఎందుకు అన్యాయంగా అరెస్టు చేశారని ప్రశ్నించి విజయమ్మ దీక్షకు పూనుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అని అయినా చూడకుండా ఆమెను నిర్దాక్షిణ్యంగా తరలించడం దారుణమని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఇచ్చే విలువ ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దనీ పోరాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని గట్టు అన్నారు. ముఖ్య నేతల సమావేశంలో భూమా శోభానాగిరెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, మాజీ మంత్రి ఎస్.సంతోష్‌రెడ్డి, డి.ఏ.సోమయాజులు వాసిరెడ్డి పద్మ, పి.ఎన్.వి.ప్రసాద్, ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, కడప జిల్లా నాయకుడు రఘురామిరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: