ప్రజలు సంయమనం పాటించాలి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు సంయమనం పాటించాలి: జగన్

ప్రజలు సంయమనం పాటించాలి: జగన్

Written By news on Wednesday, May 23, 2012 | 5/23/2012

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జరిపిన కేటాయింపుల్లో తప్పులు వెతకాలని సీబీఐ చూస్తోందని జగన్ ఆరోపించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున 532 ఎకరాలు ధారదత్తం చేసిన చంద్రబాబు వైపు కన్నెత్తి చూడటం లేదని సీబీఐ వైఖరిపై జగన్ నిప్పులు చెరిగారు. గోల్ఫ్ ఆడుకోవడానికి చంద్రబాబు ఇచ్చిన భూములపై విచారణ జరపడంలేదని, ఉపాధి కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలకు భూముల్ని వైఎస్ కేటాయించిన భూములపై సీబీఐ విచారణ జరుపుతోందన్నారు.

తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. అంతేకాకుండా సాక్షి పేపర్, టెలివిజన్ ను మూసి వేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తన అరెస్ట్ తర్వాత హింసను ప్రేరేపించేందుకు కాంగ్రెస్, టీడీపీలు పథకం రచిస్తున్నాయని, ఆ హింసను తనపై వేసేందుకు కూడా కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలువడం చేతకాని పార్టీలు హింసను సృష్టించి ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారన్నారు.

సహనం, సంయమనం పాటించాలని జగన్ ప్రజల్ని కోరారు. తమకు నచ్చిన వారికి ఓటు వేయకుండా ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్టితులలోనూ ఎన్నికలు జరిగేలా చూడాలని.. జూన్ 12 తేదిన కాంగ్రెస్, టీడీపీలకు సరియైన సమాధానం చెప్పాలని జగన్ కోరారు.
Share this article :

0 comments: