జగన్ యాత్రలో జనహోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ యాత్రలో జనహోరు

జగన్ యాత్రలో జనహోరు

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012



ఎండలు మండుతున్నాయి.. రెంటచింతల 47 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపించింది. అయినా అభిమాన జనం ఖాతరు చేయలేదు. మహానేత తనయుడు తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి నిలువెల్లా కనులై నిరీక్షించారు. ఆయన చూసి పరవశించి పోయారు. జననేత మమేకమవుతుంటే తమ కష్టాలను చెప్పుకొని భరోసా పొందారు.
మాచర్ల, న్యూస్‌లైన్ : అడుగడుగునా వెల్లువెత్తిన జన స్పందన నడుమ జగన్ మాచర్ల నియోజకవర్గంలో మూడో రోజు రోడ్డుషో సాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని ఆశీర్వదించండి అంటూ పలు చోట్ల పిలుపు నిచ్చారు. గురువారం నియోజవకర్గంలోని రెంటచింతల, మాచర్ల రూరల్ మండలం, దుర్గి మండలాల్లో జగన్ ఎన్నికల ప్రచారం సాగింది. రోడ్డుషో సాగింది ఇలా.. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు రెంటచింతలలోని తుమ్మా జోసఫ్‌రెడ్డి నివాసం నుంచి జగన్ రోడ్డుషో ప్రారంభించారు. రెంటచింతల ప్రధాన రహదారి మీదుగా కానుకమాత చర్చికి చేరుకుని అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ నుంచి పయనమై లూథరన్ మాత చర్చికి చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. రోడ్డుషోలో అందరిని పలకరిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ పోలేరమ్మ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆ తర్వాత కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెంటచింతల్లో రోడ్డుషో నిర్వహించారు. ప్రతి చోట ప్రజలు కాన్వాయ్‌ను ఆపి మరి జగన్‌ను కలిసేందుకు పోటీ పడ్డారు. జగన్ ప్రతి చోట ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం రెంటాల చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రోడ్డుషో సాగింది. అనంతరం పార్టీ నాయకులు నవులూరి భాస్కరరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన అల్పహార విందుకు హాజరయ్యారు. తర్వాత ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్డుషోలో ప్రసంగించారు. రెంటాల నుంచి పయనమై మంచికల్లు గ్రామం చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు కోలాట నృత్యాలతో జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామ ప్రధాన సెంటర్ చేరుకుని ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా సుదీర్ఘంగా ప్రసంగించారు. అక్కడ నుంచి పయనమై గన్నవరం చేరుకున్న జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. గన్నవరంలో రోడ్డుషో నిర్వహించి ప్రసంగించారు. అక్కడి నుంచి పయనమై ఆత్మకూరు చేరుకుని, అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మండల కేంద్రమైన దుర్గి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, రోడ్డుషో ముగించారు. తిరుగుపయనమై మాచర్ల పట్టణం చేరుకుని పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసంలో రాత్రి బసకు చేరుకున్నారు.

ముఖ్యనేతల హాజరు..
పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్కే, పార్టీ నేతలు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘరాం, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నాయకులు నన్నపనేని సుధ, డాక్టర్ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, చింతా సుబ్బారెడ్డి, మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, పులివర్తి రత్నబాబు, నూతల పాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: