వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై నిఘా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై నిఘా

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై నిఘా

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 25న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ రోజు జిల్లా నేతలను కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వ్యూహం పన్నుతున్నారు. ముందుగానే 144 సెక్షన్ విధించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నారు. తమ అధినేత జగన్‌పై కాంగ్రెస్, టీడీపీలు పన్నుతోన్న కుట్రలను గమనిస్తూనే ప్రజల అండదండలతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇదిలావుండగా, ఈ నెల 25న విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారులు జగన్‌కు సూచించారు. దీంతో అదే రోజున జిల్లాలోని నాయకులను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోందని సమాచారం. ఇందులో భాగంగానే వివిధ పోలీస్ స్టేషన్లలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామ, మండల స్థాయిల్లో పార్టీలో కీలకంగా వ్యవహరించే వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పేర్లను ఆరా తీస్తున్నారు. మరో వైపు ఇంటిలిజెన్సు పోలీసులు పార్టీ నేతల కదలికలు, నిరసన ప్రదర్శనల గురించి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఏదొక కారణం చూపి వివిధ పట్టణాల్లో 144 సెక్షన్ అమలు పరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లోకి తేవడం గమనార్హం. 

జిల్లాలో పార్టీ నేతలు ఎక్కువ మంది ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా భావించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘావర్గాలను అప్రమత్తం చేసి నేతల పేర్లు సేకరిస్తున్నారు. అంతేకాకుండా మరికొంత మందిపై బైండోవర్ కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
Share this article :

0 comments: