ఇదండీ లక్ష కోట్ల కథ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదండీ లక్ష కోట్ల కథ...

ఇదండీ లక్ష కోట్ల కథ...

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

నాటి గోబెల్స్ కూడా ఇప్పుడు బతికి ఉండి ఉంటే తన కళను లక్షరెట్లు అభివృద్ధి చేసిన చంద్రబాబు తెలివితేటలకు రోజుకు లక్షసార్లు మూర్చపోయేవాడేమో!! రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం ప్రచురించిన టీడీపీ అందులో వైఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఏవేవో లెక్కల్ని కూర్చారు. రాజకీయలపై, బాబు అబద్ధాల కళపై అవగాహన ఉన్నవాళ్లు వాటిని చదివి నవ్వుకున్నారు... సరే, రాజకీయాల్లో ఉన్నాక ఏవేవో ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, కొన్ని అతిశయోక్తులు సహజమే కానీ ఒకరిపై బురద జల్లడంలో బాబు అండ్ కో ఏ స్థాయికి వెళ్తాయో చెప్పడానికి ఈ లక్ష కోట్ల లెక్కే ఒక ప్రబల ఉదాహరణ! ఆ లక్ష కోట్ల లెక్కల అసలు మర్మాన్ని ఆ పుస్తకరచయితల్లో ఒకడైన మైసూరారెడ్డే ఇలా వెల్లడించాడు...
.
‘‘వాస్తవానికి ఆ పుస్తకం జగన్‌కు సంబంధించింది కాదు. అసలు లక్ష కోట్ల అవినీతి అనే ఆరోపణకు ఒక చరిత్ర ఉంది. జలయజ్ఞంలో ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం పర్సెంటేజీ చొప్పున ఎంతవుతుందో లెక్కగట్టమని, అది టీడీపీ అధినేత ఆదేశమని నాకు చెప్పారు. ఆ ప్రకారం మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం లెక్క గడితే తొలుత రూ.2 వేల కోట్లు అయింది. ఇది మరీ తక్కువగా ఉందని మళ్లీ ఏవో లెక్కలు వేశాం. అప్పుడు రూ.4 వేల కోట్లు వచ్చింది. ఇదీ చాలదని భావించి లీడర్ కంటికి ఆనాలంటే మరికొంత పెంచుదామని గాలి పోగేసి రూ.15,000 కోట్ల రూపాయలని తేల్చాం. అది కూడా సంతృప్తిగా లేకపోవడంతో రూ.30 వేల కోట్లుగా చేశాం. తర్వాత లక్ష కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణ సిద్ధం చేశాం. ఈ ఫిగర్‌ను నాయకుడు బాగుందని మెచ్చుకున్నాడు. ఈ ఆరోపణల్లో ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదు.. సచ్చిందీ లేదు.. ఎవరూ చూసిందీ లేదు..."
.
.
ఇదండీ లక్ష కోట్ల కథ... దీన్ని పట్టుకుని నోరు తిరగని వాళ్లు సైతం లచ్చ లచ్చ అని ఒకటే సొల్లు... బాబుది ఔరా ఎంతటి చాతుర్యం? ఇలాంటి నాటకాలూ, బూటకాలూ, చావు తెలివితేటల్లో ఒక్క శాతమైనా నిజంగా జనం సంక్షేమానికి వెచ్చించి ఉంటే ఎంత మంచి నాయకుడయ్యేవాడు...!!
Share this article :

0 comments: