డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు

డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

ఉప ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించి మతి భ్రమించింది: గట్టు రామచంద్రరావు
డిప్రెషన్‌కులోనై చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు
ఎస్సీ, ఎస్టీ కార్డులు విఫలం కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు
తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు బాబు చేసింది శూన్యం
కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత ఆయనదే
వైఎస్ ఒక్క నెలలో తొమ్మిది కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు
అధికారంలోకి వచ్చిన ఏడాదే రూ.1,568 కోట్లు కేటాయించారు
అందుకే బీసీలు జగన్‌వెంట నడుస్తున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 18 నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. వైఎస్ కుటుంబానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాక్షస పుట్టుకకు ప్రతిరూపమైన చంద్రబాబు డిప్రెషన్‌కులోనై ఒక్కోమారు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఎస్సీలకు వ్యతిరేకమని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ప్రజలు నమ్మకపోగా బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎస్సీలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేశారు. 

ఎస్సీ అస్త్రం విఫలమవడంతో ఎస్టీ కార్డును ప్రయోగించారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. కానీ బాబు హయాంలోనే వాటికి సంబంధించిన అనుమతులు దుబాయి కంపెనీలకు కట్టబెట్టిన విధానాన్ని గిరిజనులు ప్రశ్నించడంతో కంగుతిన్నారు. ఆఖరికి ఏం చేయాలో పాలుపోక తాజాగా బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు’’ అని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో బీసీలకు చేశారో వివరించాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు 2003-04 సంవత్సర కాలంలో బీసీలకు కేవలం రూ.348 కోట్లు కేటాయిస్తే, వైఎస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.1,568 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీలు ప్రాణంగా చూసుకునే కులవృత్తులను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ధ్వజమెత్తారు. 

బీసీల్లో ఉన్న సన్న, చిన్న కారు రైతులను దగా చేశారని మండిపడ్డారు. వైఎస్ సువర్ణయుగంలో పేదరికాన్ని నిర్మూలిస్తే, చంద్రబాబు రాక్షస పాలనలో పేదల్ని మట్టుబెట్టారని దుయ్యబట్టారు. ‘‘హైదరాబాద్‌కు బిల్‌క్లింటన్ వస్తున్నారని చెప్పి పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను కుక్కల మాదిరిగా వాహనాల్లో తరలించిన విషయం రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బలుపెక్కి చనిపోతున్నారన్నారు. డబ్బు కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వారిని ఘోరంగా అవమానించిన నీచ చరిత్ర బాబుది. కరెంటు బిల్లు కట్టలేని రైతులను జైల్లో పెట్టాలని ప్రత్యేక జీవోలు తెచ్చిన ఘనత ఈ మహానుభావుడిదే’’ అని మండిపడ్డారు. 

బోగస్ కంపెనీలతో అనుచరులకు దోచిపెట్టారు
చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం ద్వారా రూ.625 కోట్లు టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టారని గట్టు విమర్శించారు. బోగస్ కంపెనీలు, ఫ్యాక్టరీలను అప్పటికప్పుడు సృష్టించి పనికిరాని వస్తువులను పంపిణీ చేశారని చెప్పారు. చంద్రబాబు బీసీ కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేస్తే, వైఎస్ ఒక్క నెలలో 9 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి, వారికి లోన్లు కూడా ఇప్పించారని గుర్తుచేశారు. వైఎస్ మరణం తర్వాత నిరాదరణకు గురైన బీసీ కార్పొరేషన్‌ల గురించి ప్రతిపక్షనేత హోదా లో చంద్రబాబు నోరెందుకు మెదపరు? బీసీలకు అండగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు కాంగ్రెస్ పెద్దలు తూట్లు పొడుస్తుంటే బాబు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఇవేవీ పట్టని చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలను ఓటు అడిగే అర్హత ఒక్క జగన్‌కు మాత్రమే ఉందన్నారు. అదే విధంగా బీసీలు కూడా తమ రాజకీయ వారసుడిగా జగన్‌ను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతగాకనే కులాలు, మతాలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. 

కొనుగోలు చేయడం చంద్రబాబు బుద్ధే!
వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర్‌రావులు నెలజీతగాళ్లని టీడీపీ నేత శోభాహైమావతి చేసిన వ్యాఖ్యలను గట్టు ఖండించారు. జూపూడి చేసిన ప్రజా ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడిన టీడీపీ నేతలు... ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేసరికి నెలజీతగాడయ్యారా? అని నిలదీశారు. డబ్బుతో వ్యక్తులను కొనుగోలు చేసే నీచమైన బుద్ధి చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అందుకే ఆయన హయాంలో జరిగిన ఆప్రో ఏసియన్ గేమ్స్‌లో ఇతర రాష్ట్రాలనుంచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన దౌర్భాగ్యుడని విమర్శించారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీకి తమని విమర్శించే అర్హత లేదని గట్టు దుయ్యబట్టారు.
Share this article :

0 comments: