రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

రాస్తారోకోలు.. ధర్నాలు.. ప్రదర్శనలతో హోరెత్తిన జిల్లాలు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: జగన్ అక్రమ అరెస్టుపై జనం భగ్గుమన్నారు. సీబీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. జగన్ అరెస్టు వార్త తెలియగానే స్వచ్ఛందంగా రోడ్ల మీదకు తరలివచ్చి నిరసనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. 

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోయినా, శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నా పార్టీ కార్యకర్తలను, ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చాలాచోట్లా 144 సెక్షన్ విధించి ముందస్తు అరెస్టుల పేరిట అదుపులోకి తీసుకుని భయభ్రాంతులకు గురిచేశారు. జగన్ అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్ జంక్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 
చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ధర్నా చేశారు. నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పలమనేరు, కుప్పం, చంద్రగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి చర్చి సెంటర్ వరకు పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. 

తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం నుంచే ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జగన్ అరెస్టు వార్త తెలియగానే జిల్లాలో జనం, కార్యకర్తలు రోడ్డెక్కారు. శాంతి ర్యాలీలు, రాస్తారోకోలు, మౌన ప్రదర్శనలు, కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ర్యాలీలు నిర్వహించారు. జగ్గంపేటలో జైల్‌భరో పేరిట పార్టీ నేతలు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులు ఆందోళనకు దిగారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. లిడ్‌క్యాప్ మాజీ డెరైక్టర్ తలారి వెంకటరావు ఆదివారం రాత్రి దేవరపల్లిలో నిరాహార దీక్ష ప్రారంభించారు. భీమవరంలో పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ధర్నా నిర్వహించారు. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలులో నిరసన ప్రదర్శనలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా అంతటా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బాలాయపల్లి మండలంలో నిండలి రోడ్డు వద్ద రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీతారాంపురం మండలం బసినేనిపల్లి వద్ద వందలాది మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

విజయనగరం జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, చీపురుపల్లి, ఎస్.కోట, బాడంగి, బలిజిపేట తదితర మండలాల్లో కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేశారు. 

గుంటూరు జిల్లా మంగళగిరి, రేపల్లె, పిడుగురాళ్లలో రాస్తారోకోలు జరిగాయి. 

కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, కడప, కమలాపురం, బద్వేలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నంటాయి.

అనంతపురం జిల్లాలో అనంతపురం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రిలో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 

కృష్ణా జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. కర్నూలులో ఏడో నంబర్ జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిలా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, బీర్కూరు, కామారెడ్డిలో సోనియా, సీబీఐ దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

ఖమ్మంలో సీఈసీ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ రామసహాయం నరేష్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మయూరి సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. పాల్వంచ, అశ్వాపురం, పినపాక, మణుగూరు, బూర్గంపాడు మండలాలు ఆందోళనలు, ప్రదర్శనలతో హోరెత్తాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో జాతీయప్రధాన రహదారిపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కర్ణాటకలోనూ ఆగ్రహ జ్వాలలు
జగన్ అరెస్ట్‌పై బెంగళూరులోని ప్రవాసాంధ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ వద్ద తొమ్మిదవ జాతీయ రహదారిపై వందలాది మంది జగన్ అభిమానులు ఆదివారం రాత్రి రాస్తారోకో చేపట్టారు. ఇది బ్లాక్ డే అని వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, పదాధికారులు భక్తవత్సలరెడ్డి, భాస్కరరెడ్డి పేర్కొన్నారు.
Share this article :

0 comments: