ఇది రాక్షస రాజకీయ క్రీడ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది రాక్షస రాజకీయ క్రీడ

ఇది రాక్షస రాజకీయ క్రీడ

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి రాక్షస రాజకీయ క్రీడను సాగిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యనిర్వాహ క మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని చూసి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హృదయమున్న నాయకులూ, ఆలోచన గల వారూ ఎవరూ మిగలబోరని జోస్యం చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌పై జరుగుతున్న అణచివేత చర్యలను చూసి సహించలేకే టీడీపీ నుంచి మైసూరారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని సంఘీభావం ప్రకటించారని స్పష్టం చేశారు. పులివెందులలో వైఎస్ విజయమ్మపై పోటీ చేసిన జగన్ పిన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఆయనకు అండగా ఉండటానికి వచ్చారని అంబటి గుర్తు చేశారు. జగన్‌కు ఏదైనా జరిగితే ప్రజలు తిరగబడి ఓట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని అంబటి హెచ్చరించారు.

ఆది నుంచీ వివక్షాపూరితమే: సీబీఐ విచారణ పూర్తిగా వివక్షాపూరితంగా సాగుతోందని అంబటి అన్నారు. 26 జీవోలు జారీ చేసిన మంత్రులపై సుప్రీంకోర్టు నోటీసులిచ్చాకే విచారణ సాగుతోందని గుర్తు చేశారు. సీబీఐ విచారణ క్రమాన్ని తొలి నుంచీ తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ‘‘జగన్ కేసుల్లో అత్యుత్సాహంతో ఆయన ఇంటి బాత్రూములను కూడా సోదా చేసిన సీబీఐ, మంత్రులపై ముందే ఎందుకు విచారణ జరపలేదు? సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు వెళ్లి, కోర్టు నోటీసులిచ్చాకే సీబీఐ హడావుడిగా రంగంలోకి దిగింది. బీసీ మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణారావును బలిగొంది. వాన్‌పిక్ జీవోల జారీకి సంబంధించి సీబీఐ ముందు నోరు విప్పలేదని చెప్పిన మోపిదేవితో, ‘వైఎస్ రాజశేఖరరెడ్డి చెబితేనే చేశా’నని అరెస్టు తరవాత ఆయన సమర్పించిన సుదీర్ఘ రాజీనామా లేఖలో చెప్పించడం వెనక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల కుట్ర దాగుంది.

సీబీఐ అడిగితే చెప్పని మోపిదేవి, తన రాజీనామా లేఖలో మాత్రం అలా ఎలా రాస్తారు? దీని వెనుక ఎవరి హస్తముంది? జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే అలా రాయడం నిజం కాదా? ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆ 26 జీవోలు అక్రమమో, సక్రమమో తెలియజేస్తూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? ఆ జీవోలన్నీ సరైనవేనంటూ అఫిడవిట్ సమర్పిస్తే అసలు జగన్‌పై కేసే ఉండదని భావించే ఆ పని చేయలేదు. దాని ఫలితంగానే అది ప్పుడు మంత్రులకు చుట్టుకుంది. జగన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే, భయపడుతున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. మా నాయకునికి ఎలాంటి భయాందోళనలూ లేవు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునే ఉద్దేశంతోనే కోర్టు తలుపు తడుతున్నారు’’ అని అంబటి వివరించారు.

కుట్రలను ఎదుర్కొందాం: హైదరాబాద్‌లో సైనిక పాలనను తలపించేలా అడుగడుగునా పోలీసులు మోహరించి పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు పని చెప్పేలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. ‘‘పార్టీ కార్యకర్తలెవరూ భయపడాల్సిందేమీ లేదు. జగన్‌కు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఎదుర్కొందాం. సంయమనం పాటిద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు.

ఆ పత్రికలకు వార్తలుండవు గనకే: జగన్ ఆరెస్టు విషయంలో తమకు అనుమానాలున్నాయని అంబటి అన్నారు. వెంటనే అరెస్టు చేస్తే జగన్ చెప్పిందే నిజమవుతుంది గనుక అలా చేయక పోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ జగన్‌ను వెంటనే అరెస్టు చేస్తే ఆయనకు వ్యతిరేకంగా రాసుకోవడానికి ఎల్లో మీడియా పత్రికలకు వార్తలేమీ ఉండవు. విచారణ పేరుతో ఆయనను ఇంకా కొద్ది రోజుల పాటు పిలిస్తే, ‘సీబీఐ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన జగన్’, ‘తెల్లబోయిన జగన్’ వంటి శీర్షికలతో ఎల్లో పత్రికల్లో వార్తలు ప్రచురించుకోవచ్చు. ఆ తరవాతే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌ను అరెస్టు చేయాలనే కుట్ర ఇప్పటికే జరిగిందన్నారు. జగన్‌కు వెన్నెముక లేదన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. జగన్ వెన్నెముక లేని నాయకుడైతే, బొత్స సీసాల కొద్దీ మద్యం ఎందుకు పోసుకుంటున్నారని వ్యంగంగా వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: