భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

నెల్లూరు పార్లమెంటరి నియోజకవర్గానికి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుబ్బరామిరెడ్డి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం కలిశారు. భన్వర్ లాల్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు .. తిరుపతిలో కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తూ బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ నేత వీహెచ్ మౌనదీక్ష హడావుడిని సుమోటాగా తీసుకుని చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ద్వారా ఓటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్ సీపీ నేతలు బాజిరెడ్డి, ఎడ్మకిష్టారెడ్డి, శివకుమార్ లు ఉన్నారు. 
Share this article :

0 comments: