నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం సీబీఐకి హితవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం సీబీఐకి హితవు

నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం సీబీఐకి హితవు

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

- జగన్ కేసులో సీబీఐకి హైకోర్టు హితవు
- జగన్ విషయంలో సెక్షన్ 41 ప్రకారం నడుచుకోవాలని సీబీఐకి ఆదేశం 
-సీబీఐ సమన్లపై హైకోర్టులో జగన్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు 
-సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక జగన్‌ను ఒక్కసారి కూడా పిలవలేదు 
-28న హాజరు కావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్‌కు సమన్లు పంపింది 
-ఈ మధ్యలో సీబీఐ హడావుడిగా సమన్లు పంపాల్సిన అవసరమేమొచ్చింది? 
-జగన్ ఎక్కడికీ పోలేదు.. ప్రతి రోజూ ప్రజల మధ్యనే ఉంటున్నారు 
-సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది 
-విచారణ పేరుతో ఉదయం పిలిపించి.. సాయంత్రం అరెస్టు చేస్తోంది 
- ఈ కేసులో పదేసి చార్జిషీట్లు దాఖలు చేస్తోంది.. ఇలా ఏ కేసులోనూ జరగలేదు 
- ఈ కేసులో మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? 
- ఎన్నికల సమయంలో అధికార పార్టీ సీబీఐని ఉపయోగించుకుంటోంది 
- వైఎస్సార్ బతికి ఉంటే ఈ కేసులే ఉండేవి కావు.. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ 
- నిష్పాక్షిక దర్యాప్తునకు నిర్దేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించిన న్యాయమూర్తి 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం సీబీఐకి హితవు పలికింది. ఈ నెల 25న తమ ముందు హాజరు కావాలంటూ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. జగన్ విషయంలో చట్ట నిబంధనలను తప్పకుండా పాటించాలని, ముఖ్యంగా సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారం నడుచుకోవాలని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీబీఐ తనకు సమన్లు జారీ చేయటాన్ని సవాలు చేస్తూ జగన్ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ చంద్రకుమార్ విచారించారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్‌ను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా సీబీఐ జగన్‌కు సమన్లు జారీ చేసి, వ్యక్తిగత హాజరుకు ఆదేశించిందని తెలిపారు. పెట్టుబడుల వ్యవహారం లో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేసిం దని, ఆ తరువాత అనుబంధ చార్జిషీట్లు కాక, ప్రత్యేక చార్జిషీట్లు దాఖ లు చేస్తూ వస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికే మొత్తం మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, అందులో ఒక దానిని ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించటం కూడా చేసిం దని ఆయన కోర్టుకు నివేదించారు. 

సీబీఐ అధికార దుర్విని యోగానికి పాల్పడుతోందని, విచారణ పేరుతో ఉదయం పిలి పించి, సాయంత్రం వరకు కూర్చోబెట్టి, సాయంత్రం ఇంటికెళ్లే వేళ అరెస్టులు చేస్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే జగన్‌కు సమన్లు జారీ చేసి, ఈ నెల 28న హాజరు కావాలని చెప్పిందని, మరి అలాం టప్పుడు సీబీఐ ఈ మధ్యలో ఎందుకు సమన్లు జారీ చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ తీరిక లేకుండా ఉన్నారని, ఎన్నికలు ముగిసిన తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారణకు వస్తారని తెలిపారు. ఒక కేసులో సీబీఐ పది చార్జిషీట్‌లు దాఖలు చేస్తోం దని, ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఇలా జరగలేదని ఆయన వివరించారు. ఇంత అత్యవసరంగా జగన్‌కు సమన్లు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

జగన్ ఎక్కడికీ పారిపోలేదని, ఆయన ప్రతి రోజూ ప్రజల కోసం వారి సేవలో ఉన్నారని తెలిపారు. వైఎస్‌బతికి ఉంటే ఈ రోజు ఈ కేసులూ అవీ ఉండేవి కావని, ఆయన లేరు కాబట్టే, ఇన్ని ఆరోపణలు చేయగలుగుతున్నారని సుశీల్‌కుమార్ కోర్టుకు నివేదిం చారు. ఇప్పటి వరకు సీబీఐ ఒక్క మంత్రిని కూడా అరెస్ట్ చేయలేదని తెలిపారు. అధికార పార్టీ సీబీఐని ఉపయోగించుకుంటోందని వివరించారు. ఈ వాదనలను సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు తోసిపుచ్చారు. 

అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేద ని తెలిపారు. దర్యాప్తు పూర్తిస్థాయిలో సాగుతోం దని, ఇటీవల వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిలను అరెస్ట్ చేశామని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జగన్ విషయంలో చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ముఖ్యంగా సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఆ తరువాత మరోసారి ఈ కేసు గురించి జగన్ న్యాయవాదులు ప్రస్తావించారు. 

ఉప ఎన్నికలైన తరువాత విచారణకు హాజరవుతామని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పొందుపరుస్తూ, పిటిషన్‌ను డిస్పోజ్ (పరిష్కరించటం) చేశారు. అయితే.. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేస్తే.. ఎల్లో మీడియా పిటిషన్‌ను కొట్టివేసిందంటూ, తోసిపుచ్చిందంటూ యథాప్రకారం తప్పుడు ప్రచారం ప్రారంభించింది. తమ టీవీ చానళ్లలో అదే పనిగా హోరెత్తించింది.
Share this article :

0 comments: