అ సొమ్ము చిరంజీవిదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అ సొమ్ము చిరంజీవిదే

అ సొమ్ము చిరంజీవిదే

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

తిరుపతి కేంద్రంగా రాష్ట్రానికి ధనప్రవాహం 
ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి కుమార్తె ఇంటిపై జరిపిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ముపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతమైన చెన్నైలో పెద్దమొత్తంలో డబ్బులు దొరకడంపై నిర్దిష్ట విచారణ జరిపితే చిరంజీవి బండారం బయటపడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. ఈ మేరకు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డితో కలిసి సచివాలయంలో ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒకే చోట రూ.35.66 కోట్ల నగదు దాచిపెట్టడంపై ఆనేక అనుమానాలున్నాయని చెప్పారు. ఇప్పటికే తిరుపతి కేంద్రంగా భారీమొత్తంలో డబ్బు రాష్ట్రంలోకి చేరిందని, మిగిలిన మొత్తం మాత్రమే చెన్నైలోని చిరంజీవి కుమార్తె ఇంట్లో పట్టుబడ్డట్లు తెలుస్తోందన్నారు. ‘‘చిరంజీవి కూతురు ఎలాంటి వ్యాపారం చేయడంలేదు.

రూ.25వేలు దాటితేనే చెక్కు ద్వారా లావాదేవీలు జరపాలని ఆర్‌బీఐ నిబంధనలు ఉన్నాయి. అలాంటపుడు ఒకేచోట కోట్ల నగదు ఎందుకు దాచిపెట్టారో తేల్చాలి’’ అని డిమాండ్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన తిరుపతిలో కాంగ్రెస్ ఓడిపోతే పరువు పోతుందనే భయంతో ఓటర్లకు డబ్బులు పంచేందుకే చిరంజీవి చెన్నైలో డబ్బు దాచిపెట్టారని, దీనిపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి రఘువీరారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో ఉద్యోగాలిస్తామని కళ్యాణదుర్గంలోని తన ఇంట్లో నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారని, అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని యువతకు వల వేయడం ద్వారా కోడ్‌ను ఉల్లంఘించారన్నారు. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కిన రఘువీరాపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈసీని కోరారు.
Share this article :

0 comments: