పదవే కాదు.. ప్రాణమైనా వదులుతా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పదవే కాదు.. ప్రాణమైనా వదులుతా!

పదవే కాదు.. ప్రాణమైనా వదులుతా!

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

 దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వారి కుటుంబం కోసం ఎమ్మెల్యే పదవే కాదు.. ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయదుర్గంలో జననేత వైఎస్ జగన్ పాల్గొన్న రోడ్‌షోలో పాతబస్టాండ్‌లో వేలాదిగా తరలి వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఐదేళ్లు పదవిలో ఉండాలని ఓటు వేశారు.. అయితే రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్గించడానికి .. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిచ్చాం. అందుకే రెండున్నర ఏళ్లకే పదవిని వదులు కోవాల్సి వచ్చిందన్నారు. 

రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాత్రం అంతా బాగుందనుకుంటోంది. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రేషన్‌కార్డులు ఇవ్వడం లేదు.. ఫించన్లు కొత్తవి మంజూరు చేయడం లేదు.. రైతులకు సక్రమంగా విద్యుత్ ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల అమలు కోసం జగన్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలిపారు. తన జీవితాంతం వైఎస్ జగన్ కోసం నిబద్దతతో పనిచేస్తానని చెప్పారు. దేశంలోని కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి ఎన్ని పన్నాగాలు పన్నినా.. జగన్‌ను ఏమి చేయలేరు. సాక్షి దినపత్రిక, టీవీల ను నిలబెట్టుకోవడానికి మా ఆస్తులు అమ్మి అయినా సరే వాటిని దక్కించుకుంటాం. 

సాక్షిని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాపాడుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి కార్యకర్తలు, నాయకులు జైజగన్ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తన ను ఆశీర్వదించి పులివెందుల కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలను రామచంద్రారెడ్డి కోరారు.
Share this article :

0 comments: