సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: ఏబీకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: ఏబీకే

సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: ఏబీకే

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరుగుతున్న రౌండు టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం సీబీఐని ఉపయోగించుకుంటున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. సాక్షి సిబ్బంది అంతిమంగా విజయం పొందుతారని ఏబీకే ఆకాంక్షించారు.


సంక్షోభం వచ్చినప్పుడు జర్నలిస్టులంతా ఏకతాటిపైకి రావాలని సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి పిలుపునిచ్చారు. పత్రికను అమ్ముకోవటం, ప్రకటనలు తెచ్చుకోవటం పత్రికా స్వేచ్ఛలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని పలు కోర్టులు తీర్పులు చెప్పాయని వరదాచారి గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు మాత్రమే పత్రిక ఖాతాలు ఫ్రీజ్ చేయవచ్చని ఆయన అన్నారు.


రాజకీయ కారణాలతో మీడియాపై దాడులు చేయకూడదనే సంకేతాలను ప్రజల్లోకి వెళ్లాలని సాక్షి దినపత్రిక ఎడిటర్ మురళి అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడికి నిరసనగా శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండు టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి పత్రిక, ఛానల్ ను మూసివేస్తున్నారనే వదంతులతో తమ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు.
Share this article :

0 comments: