జనసంద్రమైన రాజంపేట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసంద్రమైన రాజంపేట

జనసంద్రమైన రాజంపేట

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012

 ‘నేల ఈనిందా.. ఆకాశం ఊడిపడిందా’.. అన్న చందంగా రాజంపేట పురవీధులు జనసంద్రంతో హోరెత్తాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా, చిన్న, పెద్దా తేడా లేకుండా మూడు గంటల పాటు సాగిన ర్యాలీలో పాల్గొని మీకు మేమున్నాం అంటూ జగన్‌కు అండగా నిలిచారు.
శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాజీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి అమరనాథరెడ్డి ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ పార్టీ నేతలు జేసీబీ సుబ్బారెడ్డి, సాయిబాబా, పోలా శ్రీనివాసరెడ్డి, రామరాజుల ఇళ్లకు వెళ్లి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన గంగాధ ర కుటుంబాన్ని పరామర్శించారు. 

అనంతరం కాంగ్రెస్ వర్గీయుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుల్లంపేట వాసి నరసయ్యను పరామర్శించారు.అన్నమయ్య కళాశాల ఛైర్మన్ చొప్పా యల్లారెడ్డితో కొద్దిసేపు చర్చించారు. అక్కడి నుంచి మన్నూరు సమీపానికి 11.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున జననేత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి రాజంపేట పట్టణంలోకి ర్యాలీ ప్రారంభం అయింది. సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న పాత బస్టాండ్ చేరేందుకు రెండు గంటల సమయం పట్టింది. 

దారిపొడవునా అభివాదం చేస్తూ, ఆత్మీయ పలకరింపులు చేస్తూ జగన్ ముందుకు సాగారు. ర్యాలీ సాయంత్రం 3 గంటలకు ముగిసింది. అనంతరం వీరబల్లికి బయలుదేరగా మార్గమధ్యంలోని పాలెం వద్ద మహిళలు జననేతను చూసేందుకు పరుగెడుతూ వచ్చారు. వారిని గమనించిన జగన్ కాన్వాయ్ నిలిపారు. నీవు సల్లంగా ఉండాల సామి అంటూ కాళ్లపై పడే ప్రయత్నం చేశారు. అయితే వారిని వారిస్తూ ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించారు. అనంతరం రెండు కొండల నడుమ ఉన్న బాలరాచుపల్లె మీదుగా సానిపాయికి 4.20 గంటలకు చే రుకున్నారు.
Share this article :

0 comments: