ఇలాగైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఇలాగైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం

ఇలాగైతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012


జాతీయ జర్నలిస్టు సంఘాల హెచ్చరిక
సాక్షిపై సర్కారు వైఖరిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
ఢిల్లీలో ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్
ఆర్గనైజేషన్స్’ ఆధ్వర్యంలో అత్యవసరంగా సమావే శమైన సంఘాలు
సాక్షిపై వేధింపులు ఆపాలని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని ప్రధాని, సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి
పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకునేది లేదు
ఖాతాలు స్తంభింపజేయడం సరికాదంటూ ఏకగ్రీవ తీర్మానం
సాక్షిపై వేధింపులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడి

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: ప్రజల మనస్సాక్షి ‘సాక్షి’ మీద సర్కారు జులుంపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలోనూ పాత్రికేయలోకం కదిలింది. కలానికి సంకెళ్లు వేసేందుకు జరుగుతున్న కుటిల కుట్రలపై మండిపడింది. సాక్షి మీడియాపై సర్కారు సాగిస్తున్న దమననీతిని జాతీయస్థాయిలో జర్నలిస్టు సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానల్‌పై వేధింపులు ఆపకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించాయి. సీబీఐ దర్యాప్తు పేరుతో సాక్షిపై కొనసాగిస్తున్న వేధింపులను తక్షణమే నిలిపివేయాలని, ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. సాక్షి ఖాతాలను స్తంభింపజేయడంతోపాటు ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేసిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో ‘కాన్ఫిడరేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్’ ఆధ్వర్యంలో పలు జర్నలిస్టు సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ భేటీకి ఫెడరేషన్ ఆఫ్ పీటీఐ ఎంప్లాయీస్ యూనియన్ తర పున రాజ్‌బీర్‌సింగ్, అజయ్ త్యాగి, సంజయ్ సిన్హా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి మదన్ సింగ్, ఆల్ ఇండియా న్యూస్‌పేపర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున మదన్ తల్వార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, యూఎన్‌ఐ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎంఎల్ జోషీ, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌యూజేఐ) తరపున రాజేంద్ర ప్రభు హాజరయ్యారు. కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎంఎస్ యాదవ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ‘‘సాక్షి ఇన్వెస్టర్లపై ఎలాంటి విచారణ జరిగినా ఫర్వాలేదు. కానీ ఆ పేరుతో సాక్షి ఖాతాలను స్తంభింపజేయడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు..’’ అంటూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని కార్మికశాఖతోపాటు సంబంధిత ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయాలని భేటీలో నిర్ణయించారు. కొద్దిరోజుల నుంచి సాక్షిపై జరుగుతున్న వేధింపులపై ఈ భేటీలో పాల్గొన్న ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. సమావేశం అనంతరం కాన్ఫిడరేషన్ అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

కుట్రలో భాగమే ‘సాక్షి’కి ప్రకటనల నిలిపివేత
‘సాక్షి’కి ప్రకటనలను నిలిపేయడం కుట్రలో భాగమే. దాడులపై ముందు నుంచి తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కోటి అమలు చేస్తున్నారు. పత్రికలకు వచ్చే ప్రకటలను రాకుండా నిలిపేయడం చాలా తప్పు. రాజకీయ భేదాభిప్రాయాలతో ప్రభుత్వం పత్రికపై దాడులు చేయడం, ప్రతిబంధకాలు చేయడం సరికాదు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ పత్రికలు, జర్నలిస్టులు సాక్షికి అండగా నిలవాలి. సీబీఐ ప్రారంభం నుంచి రాజకీయ ఒత్తిళ్లతో, పాలకపక్షం చెప్పినట్టుగా పనిచేస్తుందనడానికి చాలా కేసులు ఉదాహరణలుగా ఉన్నాయి. అందుకే సీబీఐని స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే పత్రికలు రాయకూడదనడంలో అర్థం లేదు. ఒకవేళ పత్రికలు అసత్యాలు రాస్తే నోటీసులివ్వాలి. పత్రికా స్వేచ్ఛపై దాడులు జరగకుండా అన్ని రాజకీయ పార్టీలు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి చట్టం చేయాలి.
- ప్రశాంత్ మిశ్రా (పొలిటికల్ ఎడిటర్, దైనిక్ జాగరణ్)

ఐక్యపోరాటాలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే పత్రికల గొంతు నులిపే పని మొదలుపెట్టినట్టు స్పష్టమవుతోంది. ‘సాక్షి’పై దాడిని అడ్డుకోకుంటే రేపు అన్ని పత్రికలతోనూ ఇలానే వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాస్తవాలను ఇవ్వడమే పరమావ ధిగా పత్రికలు పనిచేయాలి. దాడులను నిలువరించడానికి జర్నలిస్టు సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడడం కొత్తకాదు.
- అశ్వినీ కుమార్, రెసిడెంట్ ఎడిటర్, పంజాబ్ కేసరి

ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలి
‘‘సాక్షిపై సర్కారు అనుసరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆ సంస్థలోని ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి సకాలంలో జీతాలు అందేలా చూడాలి. సాక్షి యాజమాన్యానికి ఏమవుతుందన్నది మాకు సంబంధం లేదు. ఉద్యోగుల సంక్షేమం, వారి ప్రయోజనాలే ముఖ్యం. సాక్షికి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపొద్దు. ఖాతాలను సీబీఐ స్తంభింపజేయడం ఒప్పోతప్పో కోర్టులు చూసుకుంటాయి. సీబీఐ అయినా, ప్రభుత్వం అయినా సాక్షి ఉద్యోగులకు హానీ జరగకుండా చూడాలన్నదే మా అభిమతం. మీడియా సంస్థలు అనుసరించే వైఖరులు ఏవైనా కానీవ్వండి. ఆ వైఖరుల కారణంగా ఆయా సంస్థలపై దౌర్జన్యానికి దిగడం సరికాదు. ఉగ్రవాదం, ప్రమాదకరమైన కార్యకలాపాలను పోత్రహిస్తే తప్ప వాటిపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. పత్రికా యజమానులపై కేసులతో పత్రికను ముడిపెట్టడం తగగు. ఈ రెండింటిని వేర్వేరుగా చూడాలి. ఈ విషయంలో రాజకీయాలకు ఆస్కారం కల్పించొద్దు’’
- రాజేంద్రప్రభు, ఎన్‌యూజేఐ

ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తాం..
‘‘సాక్షిపై సర్కారు కొనసాగిస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి, దాని యజమాని పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పత్రికా యాజమాన్యం మంచిదనో, చెడ్డదనో మేం చెప్పడం లేదు. కానీ ప్రభుత్వం వ్యవహార ైశె లి కచ్చితంగా భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను హరించేదిగానే ఉంది. ఓ మీడియా సంస్థపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడడం ఎమర్జెన్సీ తర్వాత ఇదే మొదటిసారి. మేం దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దృష్టికి తీసుకువెళ్తాం. సాక్షి మీద సాగుతున్న దాడులపై కలుగుజేసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరతాం. భావప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగమే ప్రసాదించింది. దీనికి భంగం కలగకుండా చూసుకోవాల్సినబాధ్యత మనందరిపైనా ఉంది. ఈ విషయంలో పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు ఒక్కటి కావాలి. ఆందోళన చేస్తున్న పాత్రికేయులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ టం దారుణం. వారికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలి. ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ దుర్వినియోగపరుస్తున్నారు.’’
పరమానంద పాండే, ఐఎఫ్‌డబ్ల్యూజే
Share this article :

0 comments: