ఆ పేలుడు కాంగ్రెస్ వారి పనే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఆ పేలుడు కాంగ్రెస్ వారి పనే!

ఆ పేలుడు కాంగ్రెస్ వారి పనే!

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012


హైదరాబాద్, మే 29: విజయవాడ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి 
జిల్లా కొండాపూర్‌లో ఉన్న లగడపాటి ఫామ్ హౌస్ ‘ప్లాసిడా’లో శుక్రవారం అర్థరాత్రి పేలుడు జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడిన ఈ సంఘటనలో ఫామ్ హౌస్ పాక్షికంగా దెబ్బతింది. ఈ సంఘటన జరిగి రెండు రోజులైనా గోప్యంగా ఉంచారు. అయితే మంగళవారం ఇది వెలుగులోకి రాగా ఈ సంఘటనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే పాల్పడ్డారని లగడపాటి ఆరోపించడం, ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. తీరాచూస్తే ఈ సంఘటనకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అని తేలడంతో లగడపాటి తదితరులు కంగు తిన్నారు. కొండాపూర్‌లోని లగడపాటి ఫామ్‌హౌస్‌ను శుక్రవారం అర్థరాత్రి సమయంలో పేల్చివేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఫామ్‌హౌస్ పాక్షికంగా దెబ్బతింది. తెలంగాణ సాధనకోసమే తాము దీనికి పాల్పడినట్లు ఒక కరపత్రాన్ని కూడా అక్కడవారు పెట్టారు. దీనిపై లగడపాటి స్పందిస్తూ తన ఫామ్‌హౌస్‌ను పేల్చివేసేందుకు ప్రయత్నించింది తెలంగాణ వాదులు కాదని, తెలంగాణ వాదులైతే అక్కడ కరపత్రాలు వదలి వెళ్ళరని చెప్పారు. తాను ఇటీవల కాలంలో జగన్‌పై విమర్శలు చేస్తున్నందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తమ ఫామ్‌హౌస్‌ను పేల్చి వేసేందుకు ప్రయత్నించి ఉంటారని లగడపాటి ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆగ్రహం చెందారు. ఈ సంఘటనపై విచారణ జరపాల్సిందిగా పోలీసు అధికారులు ఆదేశించారు. ఈ సంఘటనకు పాల్పడిన నలుగురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రాపురం డిఎస్‌పి ఎం మధుసూదన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌కు చెందిన ఎం శివకుమార్ (37) అతని అనుచరులు అలకుంట రాజు (21), సిరిపురం ఆనంద్ (23), శ్రీకాంత్ (22)లతో కలిసి లగడపాటి ఫామ్ హౌస్‌ను పేల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షునిగా పని చేస్తున్న శివకుమార్ తన అనుచరులతో కలిసి ఫామ్ హౌస్ పైఅంతస్తులో ఒక గదిని డిటొనేటర్లు, జిలిటెన్ స్టిక్స్‌తో పేల్చివేసినట్లు చెప్పారు. తెలంగాణ సాధనకోసమే తాము ఈ పని చేసినట్లు వారు చెప్పారు.
ఆయనే నిప్పెట్టుకున్నాడు
నిరూపిస్తానన్న వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ, మే 29: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రిసార్ట్‌కు ఎవరో నిప్పుపెట్టలేదు... స్వార్థ ప్రయోజనాల కోసం తనంతట తానే ఉద్దేశపూర్వకంగా జెలెటిన్ స్టిక్స్ ద్వారా పేల్చేందుకు ప్రయత్నం చేసుకున్నారంటూ మాజీ శాసనసభ్యుడు, వైఎస్సార్సీ నేత వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాధా ఉద్వేగంతో మాట్లాడారు. ప్రమాదం సంభవించిన చోట తెలంగాణకు సంబంధించిన కరపత్రాలు లభ్యమయ్యాయి అంటూనే ఇదంతా జగన్ అనుచరుల పని అంటూ నిందారోపణలు చేయటం దారుణమన్నారు. లగడపాటికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైతే పూర్తి ఆధారాలను ఆ జడ్జి ముందుంచగలనన్నారు. 2014 నాటికి బొత్స స్థానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టటానికి ఇప్పటి నుంచే తాను పార్టీ అధిష్టానానికి చేరువయ్యేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి పదవిపై కూడా లగడపాటి కనే్నసి ఉంచారని అన్నారు. 2004 ఎన్నికల్లో లగడపాటి విజయవాడ ఎంపి సీటు ఎలా సాధించుకున్నారో తనకు బాగా తెలుసంటూ మరోమారు సీటు కోసం లేదా పదోన్నతి కోసం ఢిల్లీలో రాజకీయాలు నడుపుకోవాలి మినహా ఇక్కడ ఇటువంటి జిమ్మిక్కులు వేయవద్దని రాధాకృష్ణ హితవు చెప్పారు. రాజగోపాల్ తన అతిథి గృహాన్ని తనంతట తానే ఉద్దేశపూర్వకంగా తగులబెట్టించుకునే ప్రయత్నం చేసారనడానికి తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు. ఏ నాయకుడు.. ఎవరి ద్వారా ఏయే గనుల నుంచి జెలెటిన్ స్టిక్స్ సేకరించి తీసుకెళ్లారో తనవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు.
http://www.andhrabhoomi.net/content/lagadapati-3
Share this article :

0 comments: