లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైయస్ ఫ్యామిలీకిఇదా కానుక? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైయస్ ఫ్యామిలీకిఇదా కానుక?

లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైయస్ ఫ్యామిలీకిఇదా కానుక?

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

అయ్యా... తినడానికి పట్టెడు మెతుకులు లేవు... అంటే నేనున్నా అంటూ ఆదుకున్నాడు వైఎస్. అయ్యా... పండించడానికి కాసింత సాయం లేదు... అంటే నేనున్నా అంటూ సాయం అందించాడు వైఎస్. అయ్యా... ప్రాణం పోతా ఉంది వైద్యం లేదు... అంటే నేనున్నా అంటూ సంజీవని అయ్యాడు వైఎస్. అయ్యా... నా బిడ్డ చదువుకు ఆసరా లేదు... అంటే నేనున్నా అంటూ ఫీజు కట్టి రసీదు చేతిలో పెట్టాడు వైఎస్. బిడ్డలు ఎగిరెళ్లి పోయారు...
ముసలితనంలో అవస్థలు పడుతున్నాను అంటే.... వృద్ధులకు చేతి కర్ర అయ్యాడు వైఎస్.
ఒక ఇల్లు అతడి వల్ల వెలిగింది. ఒక ఇల్లాలు అతడి వల్ల బిడ్డలకు కడుపారా తిండి పెట్టుకుంది. ఒక ఇల్లు అతడి వల్ల కళకళలాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం వైఎస్ వల్ల లబ్ధి పొందింది.
తెలుగునాడులోని ప్రతి కుటుంబం వైఎస్ పట్ల ఆరాధన పెంచుకుంది.
వైఎస్ కుటుంబం తన కుటుంబం అనుకుంది.
వైఎస్ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అనుకుంది.
కాని- ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?
పాలకులా వీళ్లు? కాదు... రాబందులు అంటున్నారు జనం.
మనుషులా వీళ్లు? కాదు... అసురులు అంటున్నారు జనం.
వైఎస్ వల్ల లబ్ధి పొంది వైఎస్ నీడలో నాయకులు అయ్యి పదవులు పొంది చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్న వీళ్లంతా కృతజ్ఞతను మర్చిపోయి... కృతఘ్నలై అర్ధరాత్రి పూట వైఎస్ కుటుంబాన్ని రోడ్డు మీద కూచోబెట్టే దారుణానికి వొడిగట్టారంటే.... ఆ కుటుంబం ఏం పాపం చేసింది? ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వీళ్లు రేపు ప్రతి కుటుంబాన్నీ రోడ్డున పడేయరా?


అనగనగా ఒక కథ:
ఒక చక్రవర్తిని శత్రువులు చుట్టుముట్టారు. అంతవరకూ స్నేహితులుగా ఉన్నవారే ద్రోహులుగా మారి ఆయన్ను రకరకాలుగా కవ్విస్తున్నారు. ఆయనను వీధులలో ఊరేగిస్తూ వెంటపడి హింసిస్తున్నారు. వెటకారాలు చేస్తూ వికృతంగా నవ్వుతున్నారు.
ఒకడైతే చాలా గట్టిగా అరుస్తున్నాడు - ‘‘ఆ చక్రవర్తిని త్వరగా ఉరికంబం ఎక్కించండి. అతడి కాళ్లూ చేతులను నరికేయండి. తలకు ముళ్లకిరీటం తగిలించండి. హింసించండి... చంపండి’’.... చాలా తీవ్రంగా అరుస్తున్నాడు. 
ఆ అరుస్తున్నవాడి వైపు చక్రవర్తి శాంతంగా చూశాడు.
కాని జనం మాత్రం తట్టుకోలేకపోయారు.
‘‘ఒరేయ్ ద్రోహి’’ అని పెద్దగా అరిచారు.
ఆ ద్రోహి జనం వైపు చూశాడు. 
జనం అన్నారు- ‘‘ఒరేయ్ ద్రోహి... నీకు మొదట నోరు లేదు. మూగవాడివి. అలాంటిది నీకు చక్రవర్తి నోరు ఇచ్చాడు. ఇప్పుడు అదే నోటితో ఏమని అరుస్తున్నావో తెలుసా? ‘చక్రవర్తిని ఉరికంబం ఎక్కించండి’ అని! మొదట్లో నీకు కాళ్లు లేవు. కుంటివాడివి. చక్రవర్తి నీకు నిలబడే ధైర్యం ఇచ్చాడు. ఇప్పుడు అదే ధైర్యంతో పరుగెత్తుకు వచ్చి ఏమంటున్నావో తెలుసా? ‘వీలైనంత తొందరగా చక్రవర్తి తలను ఖండించండి’ అని!! మొదట్లో నీకు కంటి చూపు లేదు. చక్రవర్తి తన చల్లని చూపుతో నీకు చూపు తెప్పించాడు. ఇప్పుడు అదే చూపు ఏమి ఆశిస్తుందో తెలుసా? ‘చక్రవర్తి రక్తం కంట చూడాలి’ అని!!!’’
ఆ మాటలు విని ఆ ద్రోహి సిగ్గుతో తల వంచుకున్నాడు!
‘ఏమైంది నాకు?’ అనుకున్నాడు. 
‘ఏ మాయ నన్ను కమ్మేసింది’ అని అనుమానపడ్డాడు.
ఉన్నపళాన చక్రవర్తి కాళ్లపై పడి- ‘క్షమించమని వేడుకోవడానికి కూడా అర్హత లేని వాడిని’ అంటూ జీవితాంతం కుమిలిపోయాడు!

********* 

ఈ కథ కల్పనో వాస్తవమో తెలియదుగాని కల్పన చాటు ‘వాస్తవం’ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.
ఆనాడే కాదు ‘ఈనాడు’ కూడా ద్రోహి ఉన్నాడు. కాదు ద్రోహులు ఉన్నారు. ద్రోహాలు ఉన్నాయి.

******* 

ఒక గతం:
ముని శాపానికి గురైనట్లుగా కరువుతో విలవిలలాడుతోంది రాజ్యం. పొలాలు బీడు పడ్డాయి.
చెరువుల కంట్లో కన్నీరు తప్ప నీరు లేదు. పల్లెలో పల్లె లేదు. జనాల్లో జీవం లేదు. పల్లె ఎక్కడికో వలస పోయింది. అప్పుడు రాజన్న పాదయాత్రతో ఊరువాడా మేల్కొంది. ఆశగా ఎదురుచూసింది.
తలకు రుమాలు కట్టుకొని బహుదూరం నుంచి మండుటెండల్లో నడుచుకుంటూ వచ్చిన ఆయన ఏడుస్తున్న పొలాలను ఓదార్చాడు. కన్నీళ్లు తప్ప నీళ్లు లేని చెరువులకు ‘మన రాజ్యం వస్తుంది’ అని ధైర్యం చెప్పాడు. మండుటెండల్లో చల్లటి చినుకులు కురిసాయి. ఆ చినుకుల సాక్షిగా 
‘మనం గెలుస్తాం’ అన్నాడు ఆయన.
నమ్మకానికి చినుకు సాక్షి.
గెలుపుకు చినుకు సాక్షి.
నమ్మకం గెలిచింది. రైతు గెలిచాడు... రాజన్న గెలిచాడు!
మృత్యువు ఒడిలో ఉన్న కాంగ్రెస్‌కు జీవం పోసి, నడిపించి, పరుగెత్తించి, బలహీనమైన చేతులకు బలాన్ని ఇచ్చి... ఆ బలానికి ఆయుధమిచ్చి.... విజయాన్ని ఇచ్చిన వాడు రాజశేఖరుడు!
‘మీ మేలు మరిచిపోలేము ప్రభూ’ అన్నారు వాళ్లు ఒకే గొంతుతో!

******* 

ఒక వర్తమానం:
అవును... వాళ్లు మరిచిపోయారు... వైఎస్ చేసిన మేలును మర్చిపోయారు... ద్రోహానికి ఒడిగట్టారు.
రాజన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి చీకట్లో పెట్టడానికి కంకణం కట్టుకున్నారు. ఉప ఎన్నికల్లో దొడ్డి దారిన గెలిచి ‘విజయం మాదే’ అంటూ ఢిల్లీకి కప్పం కట్టాలనుకున్నారు.
‘నా కొడుకును ఏం చేయబోతున్నారు?’ అని ఆ అమ్మ దీనంగా అడుగుతోంది.
‘మేము ఏమైనా చేయగలం!’ అంటోంది రాక్షసుల రాజ్యం.
గతంలో ఇలాగే రైతు కన్నీరు నేలను తాకినప్పుడు చంద్రబాబు చిరాకు పడ్డాడు. ‘వ్యవసాయం పరమ దండగ’ అని ఎగిసిపడ్డాడు. ‘అయ్యా! మీ వైఖరి చాలా తప్పు’ అన్నవాళ్లను జైళ్లలోకి తోసి, సంఘవిద్రోహులుగా చూపి... ‘మేము ఏమైనా చేయగలం’ అని నవ్వాడు ఆ పాలకుడు.
రైతు కన్నీరు ముందు ఆ రాక్షస నవ్వు నిలవలేకపోయింది... పారిపోయి ఎక్కడో దాక్కుంది!
‘నా కొడుకును ఏం చేస్తారు? పొద్దుననగా వెళ్లిన బాబు... ఇప్పటికీ తిరిగి రాలేదు’... ఆ అమ్మ ఏడుస్తూనే ఉంది.
చరిత్రలో ఎప్పటిలాగే ‘మేము ఏమైనా చేయగలం’ అని రాక్షసపాలకులు క్రూరంగా నవ్వుతున్నారు.
ఎప్పటివరకు నవ్వగలరు?
పాపం పండే వరకు. (ఆ రోజులు వచ్చేశాయి!)
రాజన్న కుటుంబం అంటే ఆత్మీయ అనుబంధాలు వెల్లివెరిసే కుటుంబం అని, పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయనకు కుటుంబసభ్యులతో గడపడం అంటే చాలా ఇష్టం అని, మనవళ్లు, మనవరాళ్లు చెప్పే తీయటి కబుర్లు వినడం అంటే చాలా ఇష్టమని, భార్యాపిల్లలతో ప్రకృతి దారుల్లో నడుస్తూ పెరుగుతున్న మొక్కలను పలకరించడం అంటే చాలా ఇష్టం అని అందరూ చెప్పుకుంటారు.
ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది.
రాజన్న లేని ఆ కుటుంబానికి ఓదార్పు ఇచ్చి అండగా నిలవాల్సిన సమయంలో ఆకాశంలో రాబందుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది. రాక్షసుల పాశవిక భాష వినిపిస్తోంది. నియంతల పదఘట్టనలు వినిపిస్తున్నాయి.
గొంతు నులిమే కుట్రలు కనిపిస్తున్నాయి.
రక్తపిపాసులందరూ సంఘసంస్కర్తల అవతారాలెత్తి నైతిక విలువలు వల్లిస్తున్నారు.

******* 

జగన్‌ను సీబిఐ విచారిస్తున్న సమయంలో టీవి ముందు కూర్చున్న హైదరాబాద్‌లోని ఒక మధ్యతరగతి ఇంటి పెద్దావిడ అంది:
‘‘రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన దగ్గరి నుంచి ఆయన కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తున్నారు. పిలగాడిని నాశనం చేయాలని చూస్తున్నరు. వాళ్లను ఇబ్బంది పెట్టేటోళ్లు ఉసురు తగిలి సస్తరు’’ అంటూ జగన్‌పై కుట్ర చేస్తున్నవాళ్లను తిడుతోంది ఆ పెద్దావిడ. 
‘‘పై నుంచి వైయస్ అన్నీ చూస్తూనే ఉంటాడు. పాపాత్ముల పని పడతాడు’’ అన్నాడు వేడిరక్తం యువకుడు.... ఇలాంటి కామెంట్స్ రాష్ట్రం నలుమూలలా ఇంటింటా ప్రతి నోటా వినిపిస్తూనే ఉన్నాయి.

****** 

‘కుటుంబం’ అనేది ప్రేమతో తయారుచేయబడిన అద్భుతమైన, అందమైన ఇల్లు అని ఒక చైనీస్ సామెత చెబుతుంది.
ప్రజలు ప్రేమించిన ప్రజామనిషి రాజన్న. ‘రాజన్న కుటుంబం’ అనే అందమైన ఇంట్లోకి విషసర్పాలు దూరాయి. ఆ కుటుంబసభ్యులను భయభ్రాంతులను చేయాలని, కాటేయాలని చూస్తున్నాయి.
‘తప్పు చేస్తున్నారు... పాలకుల్లారా... పాశవికుల్లారా... చాలా తప్పు చేస్తున్నారు. ఉసురు తగిలి కొట్టుకుపోతారు... మళ్లీ కనిపించకుండా మట్టికొట్టుకుపోతారు!’ అంటూ ఆ విషసర్పాలకు ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.

కొసమెరుపు:
‘జైలుకి జగన్’ అని టీవీలో స్క్రోలింగ్.
ఈ విషాదంలోనే ఎవరో చమత్కరించారు:
‘జైలుకి జగన్’లో ‘లు...కి’ అనే అక్షరాలు తాత్కాలికం!
‘జై జగన్’ మాత్రమే శాశ్వతం!!

రాజన్న కుటుంబం అంటే ఆత్మీయ అనుబంధాలు వెల్లివెరిసే కుటుంబం అని, పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయనకు కుటుంబసభ్యులతో గడపడం అంటే చాలా ఇష్టం అని, మనవళ్లు, మనవరాళ్లు చెప్పే తీయటి కబుర్లు వినడం అంటే చాలా ఇష్టమని అందరూ చెప్పుకుంటారు. ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. రాజన్న లేని ఆ కుటుంబానికి ఓదార్పు ఇచ్చి అండగా నిలవాల్సిన సమయంలో ఆకాశంలో రాబందుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది.
Share this article :

0 comments: