జేఏసీ కన్వీనర్ హఠాన్మరణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జేఏసీ కన్వీనర్ హఠాన్మరణం

జేఏసీ కన్వీనర్ హఠాన్మరణం

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్:సాక్షి దినపత్రిక, సాక్షి మీడియాపై సీబీఐ దాడుల పట్ల తీవ్రం గా కలత చెంది మరో గుండె ఆగిపోయింది. ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్, మాతృభూమి ఆటో డ్రైవర్స్ యూని యన్ ప్రధాన కార్యదర్శి, సాక్షి అభిమాని కర్ర కాశీ విశ్వనాథం (61) శనివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ భేటీలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘మా అభిమాన దినపత్రికను మూసేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఆటో కార్మికులకు తొలి నుంచి అండదండగా నిలిచిన సాక్షి అంటే మాకెంతో ఇష్టం. అలాంటి పత్రిక గొంతు నొక్కే దాడులను చూసి తట్టుకోలేకపోతున్నాం. సాక్షిని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం.

ఏ పార్టీ జెండా పట్టుకోకుండా, దేనికీ కొమ్ముకాయకుండా వందలాది సమ్మెలు, పోరాటాలు చేసిన చరిత్ర నాది. సాక్షి కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. అలా ప్రసంగిస్తుండగానే తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూలిపోయారు. సాక్షి ఉద్యోగులు, పాత్రికేయులు ఆయనను వెంటనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే విశ్వనాథం తుదిశ్వాస విడిచారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు.

30 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం

ఆటో కార్మికుల సమస్యలపై 30 ఏళ్లుగా పోరాడుతున్న విశ్వనాథం వారాసిగూడలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య లలిత, కొడుకు సుబ్రహ్మణ్యం, కూతుళ్లు అపర్ణ, పద్మావతి ఉన్నారు. విశ్వనాథం భౌతిక కాయానికి ఆదివారం ఉదయం 10 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆకస్మిక మతి పట్ల సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎడిటర్ వర్ధెల్లి మురళి, పత్రిక, టీవీ సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Share this article :

0 comments: