పరకాల బీజేపీ అభ్యర్థి విజయచంద్రారెడ్డి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరకాల బీజేపీ అభ్యర్థి విజయచంద్రారెడ్డి!

పరకాల బీజేపీ అభ్యర్థి విజయచంద్రారెడ్డి!

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

వరంగల్ జిల్లా పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ విజయచంద్రారెడ్డిని ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఆయన పట్ల మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ ముందున్న అందరి అభ్యర్థిత్వాలను పార్టీ క్షుణ్ణంగా పరిశీలించింది. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన జంగారెడ్డే ఉత్తమమని భావించిన పార్టీ పెద్దలు ఆయన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో టీఆర్‌ఎస్ పోటీకి నిలుపవచ్చని భావిస్తున్న భిక్షపతిని పార్టీలోకి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయి. దానికాయన ససేమిరా అనడంతో డాక్టర్ విజయచంద్రారెడ్డిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
Share this article :

0 comments: