ముందే చెప్పిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందే చెప్పిన జగన్

ముందే చెప్పిన జగన్

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

* 3,4 రోజుల్లో తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని 22నే వెల్లడించిన వైఎస్ జగన్
* ఇదే విషయంపై ప్రధానికి, సీఈసీకి నాడు జగన్ లేఖ

రాష్ట్రంలో ఉప ఎన్నికలను నిలిపేసేందుకుగాను తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్నాయన్న సంగతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22వ తేదీనే బయటపెట్టారు. ఈ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ గల్లంతైపోతాయని తెలియడంతో.. తనను అరెస్టు చేయించి ఆపై రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలన్నదే అధికార, ప్రతిపక్షాల పన్నాగమని ఆయన కుండబద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు జగన్ ఈ వివరాలు వెల్లడించారు. అదే రోజు ఈ విషయంపై ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు లేఖ ద్వారా కూడా ఆయన తెలియపరిచారు. 22వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘‘రాష్ట్రంలో 18 చోట్ల జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలూ (కాంగ్రెస్, టీడీపీ) గల్లంతైపోతాయని వారికి(పార్టీ అధినేతలకు) పూర్తిగా సమాచారం వచ్చిందంట. అందుకే.. మొన్న వయలార్ రవి(కాంగ్రెస్ అధిష్టానం దూత) ఇక్కడకు వచ్చారట.. వచ్చి సీబీఐ జాయింట్ డెరైక్టర్‌ను, అదేపనిగా డీజీపీని పిలిపించుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంతనాలు జరిపారట. తర్వాత చంద్రబాబు నాయుడితో కూడా సంభాషణలు జరిపారట. అంతేకాదు మరో మూడు, నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేస్తారట. నన్ను అరెస్టు చేసినప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలను రెచ్చగొడతాయట. అంతేకాదు అవి జగనే చేయించాడని చెబుతారట. ఆ తర్వాత ఈ 18 చోట్ల ఎన్నికలు జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. 

ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారు. ప్రజలు మెచ్చిన వ్యక్తే.. నాయకుడు అవుతాడని తెలిసి... అలా జరగకూడదని ఢిల్లీ పెద్దలు, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎన్నెన్ని కుయుక్తులు పన్నుతున్నారంటే.. నిజంగా ఇంత స్థాయి నీచమైన రాజకీయాలు నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదని చెబుతున్నా. బాధనిపిస్తుంది.. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో నా రాష్ట్రాన్ని చూస్తున్నప్పుడు. వీళ్లు చేస్తున్న నీచమైన రాజకీయాలు ఎవరూ చూడటం లేదని అనుకుంటున్నారు. పై నుంచి దేవుడనే వాడు కచ్చితంగా చూస్తున్నాడు. కచ్చితంగా త్వరలో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవుతుంది. ఒక్కటై ఒక ఉప్పెన పుడుతుంది.. తుపాన్ వస్తుంది. ఆ తుపాన్‌లో వీరంతా కొట్టుకుపోయే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్తున్నా.’’

అల్లర్ల సృష్టి కోణం కూడా....
జగన్ వెల్లడించిన కుట్ర కోణంలో భాగమైన ‘అల్లర్ల సృష్టి’ శుక్రవారమే బయటపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సేవాదళ్ నాయకుడు వెల్లాల రామ్మోహన్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోనికి తీసుకుని రాత్రి 11 గంటలకు వదిలిపెట్టారు. మళ్లీ శనివారం ఉదయం ఆయనను ఇంటి నుంచే తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు అతనితో పాటు మరో ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి.. వీరు ముగ్గురు ఒక లీటరు పెట్రోల్‌తో వంద బస్సులు తగలబెట్టేందుకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. వాస్తవానికి.. పోలీసులు ముందస్తు ప్రణాళికతో రామ్మోహన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తాము రాసిచ్చిన స్క్రిప్టును చదివేలా ఏర్పాటు చేసుకున్నారు. తమ పార్టీ నేతలు ఆదేశించిన ప్రకారం తాము ఈ కుట్రకు పాల్పడుతున్నామని రామ్మోహన్ చేత చెప్పించిన వీడియో క్లిప్పింగ్‌ను గతంలో ఎన్నడూ లేని విధంగా యూట్యూబ్‌లో పెట్టి తగినంత ప్రచారం కల్పించారు.
Share this article :

0 comments: