న్యాయవ్యవస్థపై గౌరవం కూడా చూపని సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయవ్యవస్థపై గౌరవం కూడా చూపని సీబీఐ

న్యాయవ్యవస్థపై గౌరవం కూడా చూపని సీబీఐ

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012



* 28లోగా జగన్‌ను అరెస్టు చేయకపోవచ్చన్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి
* అరెస్టుపై మీవి భయాలే తప్ప ఆధారాలు లేవని... జగన్‌కు తాత్కాలిక ముందస్తు బెయిలు నిరాకరణ
* న్యాయవ్యవస్థపై గౌరవం కూడా చూపని సీబీఐ
* న్యాయమూర్తి వ్యాఖ్యలకూ విలువివ్వని వైనం
* కోర్టుకు హాజరుకావటానికి కొన్ని గంటల ముందు అడ్డగోలుగా అరెస్టు
* 41(ఎ) ప్రకారం ధ్రువపరచుకోవటానికని పిలిచి అదుపులోకి తీసుకున్న సీబీఐ

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారనేది ‘భయం’ కాదని.. అది నూటికి నూరు శాతం నిజమని తేలిపోయింది. ‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఆయనపై దాఖలు చేసిన కేసులో దర్యాప్తు ఇప్పటికే పూర్తయిపోయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని, దాన్ని తాము పరిగణనలోకి తీసుకోవటం కూడా జరిగిందని ఇటీవలే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టంచేసింది. అందుకని ఈలోగా ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చని కూడా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎ.పుల్లయ్య అభిప్రాయపడ్డారు. అంతేకాదు. ‘‘అరెస్టు చేస్తారనేది మీ భయమే తప్ప అందుకు తగిన ఆధారాలు లేవు. బహుశా! కొందరు ఇచ్చిన తప్పుడు సలహాల వల్ల జగన్‌మోహన్‌రెడ్డి భయపడి ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసి ఉండొచ్చు’’ అని కూడా ఆయన చెప్పారు.

అయితే తమది భయం కాదని, అది నిజం కాబట్టే తాము న్యాయస్థానానికి రావాల్సి వచ్చిందని ఆ రోజే జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్ గట్టిగా చెప్పారు. ‘‘జగన్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అందుకని ఆ 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అందుకని ఈ సమయంలో రాలేనని, జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ కోరినా సీబీఐ అధికారులు నిరాకరించారు. ఇదంతా ఎన్నికల ముందు ఆయన్ను అరెస్టు చేసి ప్రచారం చేయకుండా అడ్డుకోవటానికే తప్ప మరో దానికోసం కాదు’’ అని సుశీల్ వివరించారు కూడా.

వారి ఎదుట హాజరుకాకపోతేనే...
‘‘దర్యాప్తు పూర్తయిపోయాక కూడా ఇంకా తదుపరి దర్యాప్తు చేయటమనే ప్రసక్తి ఉండదు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై దాఖలు చేసిన కేసులో దర్యాప్తు ముగిసింది కనుక సీబీఐ ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చు. ఒకవేళ సీబీఐ కోరినట్టుగా వారి ఎదుట హాజరు కాకపోవటం, వారికి సహకరించపోవటం వంటి ఇతరత్రా కారణాలుంటే తప్ప’’ అని కూడా ప్రత్యేక జడ్జి స్పష్టంగా చెప్పారు. అలా చెప్తూనే.. ముందస్తు బెయిలుపై తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.

దర్యాప్తులో అన్నిటినీ వదిలేసి.. కేవలం రాజకీయుల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ.. పక్షపాతాన్ని స్పష్టంగా బయటపెట్టుకుంటున్న సీబీఐకి కనీసం న్యాయ స్థానాలపై కూడా గౌరవం లేదనేది ఆదివారం నాటి చర్యతో స్పష్టమైపోయింది. ఒకవంక 28న తమ ముందు హాజరు కావాల్సి ఉంది కనక ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పినా.. అలా హాజరు కావటానికి కొన్ని గంటల ముందే సీబీఐ జగన్‌ను తమ అదుపులోకి తీసుకుంది. తానేం చేయాలనుకున్నదో స్పష్టంగా బయటపెట్టింది. 28న ముందస్తు బె యిలుపై విచారణ జరగనుండటంతో పాటు అదే రోజున జగన్‌మోహన్‌రెడ్డి కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది కూడా. కానీ ఈ రెండూ జరగక ముందే సీబీఐ ఆగమేఘాలపై అరెస్టు చేసేసింది.

కోర్టులో నోరు విప్పని సీబీఐ..
అరెస్టు చేస్తారనేది జగన్‌మోహన్‌రెడ్డి తరఫు లాయర్ల భయం కావచ్చని, తమ ముందు హాజరయ్యేలోగా ఆయన్ను అరెస్టు చేయకపోవచ్చని న్యాయమూర్తి చెప్పినపుడు కోర్టులోనే ఉన్న సీబీఐ న్యాయవాది దీనిపై నోరు మెదపలేదు. తమ మనసులో ఉన్న అరెస్టు ఉద్దేశాన్ని గనక ఆయన ఆ రోజే బయటపెట్టి ఉంటే కోర్టులో పరిణామాలు వేరుగా ఉండేవేమో! ఆయనను తాము అరెస్టు చేస్తామని చెప్తే న్యాయమూర్తి ముందస్తు బెయిలును పరిగణనలోకి తీసుకునేవారేమో! ఇవేవీ చేయకుండా కోర్టులో మౌనం దాల్చిన సీబీఐ.. తదుపరి విచారణకు ముందే తాను అనుకున్నది చేసేయటం దర్యాప్తు సంస్థ ఏ లక్ష్యంతో పనిచేస్తోందో, తనకు ‘అప్పగించిన టార్గెట్’ను పూర్తి చేయటానికి న్యాయస్థానాలపై కనీస గౌరవం కూడా చూపకుండా ఏ స్థాయికి దిగ జారిపోతోందో కళ్లకు కట్టింది.

పూర్తిగా సహకరించారు కదా!
తాత్కాలిక ముందస్తు బె యిలుపై ఉత్తర్వులిచ్చిన సందర్భంగా న్యాయమూర్తి పుల్లయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41(ఎ) ప్రకారం సీబీఐ జగన్‌కు నోటీసులిచ్చి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తమ వద్దనున్న సమాచారాన్ని ధ్రువపరచుకోవటానికే ఆయన్ను హాజరు కావాలని కోరుతున్నట్లు అందులో పేర్కొంది. నిజంగా అరెస్టు చేయాలని భావిస్తే దర్యాప్తు అధికారి ఏ నోటీసూ ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు. నోటీసు ఇచ్చారంటే దానర్థం ఈ కేసుకు సంబంధించిన కొన్ని అంశాల్ని ధ్రువపరచుకోవటానికే. పెపైచ్చు సీబీఐ ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక మార్చి 31న దర్యాప్తును ముగించి చార్జిషీటు దాఖలు చేసింది.

ఒకవేళ జగన్‌ను అరెస్టు చేయాలనుకుంటే అప్పట్లో చార్జిషీటు దాఖలు చేయకముందు దానికి బోల్డంత అవకాశముంది. పెపైచ్చు ఈ కేసులో జగన్ తొలి ముద్దాయి కూడా. అయినా సరే దర్యాప్తునకు కీలకమైన ఆ ఏడు నెలల్లో ఆయన్ను అరెస్టు చేయలేదు. దర్యాప్తు ముగిశాక ఇప్పుడు అరెస్టు చేస్తారనుకోవటం లేదు’’ - ఇవీ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు. వీటిని బట్టి చూసినపుడు స్పష్టమయ్యే విషయం ఒక్కటే! దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతుల్ని సీబీఐ ఏమాత్రం పాటించటం లేదని! చట్టంపై చూపించాల్సిన గౌరవాన్ని సీబీఐ ఏమాత్రం చూపించటం లేదని! 41(ఎ) ప్రకారం నోటీసులిచ్చి.. కొన్ని అంశాల్ని ధ్రువపరచుకోవటానికే పిలుస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ.. మరి ఇంత హడావుడిగా ఎందుకు అరెస్టుకు పాల్పడింది?

న్యాయమూర్తి అభిప్రాయం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ పిలిచినపుడు వారి ఎదుట హాజరు కాకున్నా.. విచారణకు సహకరించకున్నా అరెస్టు చేయొచ్చు. కానీ మూడు రోజులుగా వారు పిలిచిన సమయానికే వెళుతున్నారుగా? అడిగిన ప్రశ్నలన్నిటికీ వివరణ ఇచ్చానని, విచారణ ప్రశాంతంగా జరిగిందని చెప్తున్నారుగా? మరి సీబీఐ ఎందుకింత కుట్ర పన్నింది? న్యాయమూర్తి అభిప్రాయపడినట్లుగా దర్యాప్తునకు కీలకమైన ఏడు నెలల పాటు అరెస్టు చేయని సీబీఐ.. ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది?
Share this article :

0 comments: