సీఎంవి పచ్చి అబద్ధాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎంవి పచ్చి అబద్ధాలు

సీఎంవి పచ్చి అబద్ధాలు

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

అమ్మ చెబితేనే కేసు వేశానని శంకర్రావు చెప్పింది నిజం కాదా?
కక్రూకు హక్కుల కమిషన్ చైర్మన్ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారు?
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసుల దౌర్జన్యాలు సీఎంకు తెలియకుండా జరుగుతున్నాయా?
కాంగ్రెస్ వల్లే వైఎస్ సీఎం కాగలిగారని చెప్పడం హాస్యాస్పదం
మహానేత మరణంపై ప్రజల్లో ఇప్పటికీ ఉన్న అనుమానాలనే విజయమ్మ ప్రస్తావించారు
దమ్ముంటే హెలికాప్టర్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను బయటపెట్టండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబ ద్ధాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు రోజా ధ్వజమెత్తారు. జగన్ కేసులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభావం లేదని సీఎం చెప్పడం చూస్తుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం విజయమ్మ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం నంగనాచి కబుర్లను ప్రజలు నమ్మరని అన్నారు. ‘‘జగన్‌పై పిటిషన్ వేసిన శంకర్రావు కాంగ్రెస్ శాసన సభ్యుడు కాదా? అమ్మ చెబితేనే కేసు వేశానని ఆయన చెప్పిన మాట వాస్తవం కాదా? కేసు వేసిన తర్వాతే శంకర్రావుకు మంత్రి పదవి ఇవ్వలేదా?’’ అని సీఎంను రోజా ప్రశ్నించారు. జగన్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయమూర్తి కక్రూకు మానవ హక్కు ల కమిషన్ చైర్మన్ పదవి ఏ ప్రాతిపదికన ఇచ్చారో ప్రజలకు చెప్పాలని అన్నారు. జగన్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని అవాకులు చెవాకులు పేలుతున్న సీఎంకు కనీస ఇంగితజ్ఞానం లేదా? అని దుయ్యబట్టారు. 

‘‘జగన్ 2004-09 మధ్య కాలంలో ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు. ఏనాడైనా ఆయన సచివాల యంలో కనిపించారా? ఆయన ఫలానా అధికారికి ఫలనా పని చేసిపెట్టమని ఫోన్ చేసినట్లు ఉంటే రుజువు చెయ్’’ అని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై రెండు, మూడు రోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సీఎంకు తెలియకుండానే జరుగుతోందా అని ప్రశ్నిం చారు. నేతలను గృహ నిర్బంధం చేయడం, విజయమ్మను పరామర్శించడానికి వస్తున్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సీఎం ఆదేశాల మేరకే కాదా? అని అడిగారు. కాంగ్రెస్ వల్లే వైఎస్ రెండుసార్లు సీఎం కాగలిగారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ’’మహానేత వైఎస్ రెండుసార్లు సీఎం ఎలా కాగలిగారో రాష్ట్ర ప్రజలందరికీ తెలు సు. అంతేకాదు.. కేంద్రంలో కూడా అధికారం ఎవరి వల్ల వచ్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్ ఐదేళ్లపాటు ప్రజారంజక పాలన అందించడం వల్లే ప్రజలు మరోసారి పట్టం కట్టారు’’ అని చెప్పారు. అదే అధిష్టానం సీఎంగా కూర్చోబెట్టిన రోశయ్య కనీసం ఏడాదిన్నర పాటు ఎందుకు పాలన సాగించలేకపోయారని ప్రశ్నించారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ ఎంతకాలం ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో వైఎస్ పెట్టిన పథకాలు కాంగ్రెస్‌వేనని చెబుతున్న నేతలు దేశంలో మరే ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే జగన్‌పై విచారణ జరుగుతోందని చిలుక పలుకులు పలుకుతున్న సీఎం కిరణ్.. అదే కోర్టు 26 జీవోలపై స్పందన కోరితే ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. జీవోలకు సంబంధించి న్యాయస్థానంలో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీశారు. వైఎస్ ఉన్నప్పుడు జగన్‌పై దర్యాప్తు చేసినప్పుడు మెచ్చుకున్న వారు ఈరోజు ఎందుకు విమర్శిస్తున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పం దిస్తూ.. ‘‘పరిటాల రవి కేసులో ఆనాడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎంగా వైఎస్ స్వయంగా సీబీఐ దర్యాప్తు చేయించారు. 

అప్పుడు ఆరోపణలు వచ్చిన వారందరిపైన విచారణ పూర్తి చేసిన తర్వాతే జగన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ ఈరోజు దర్యాప్తు పూర్తి కాకుం డానే ఆరోపణలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టిన వారి లో సగం మందినే విచారణ చేయడమంటే ఇందులో ఉన్న మతలబేమిటి?’’ అని రోజా నిలదీశారు. రాజకీయం కోసమే విజయమ్మ వైఎస్ మరణంపై మాట్లాడుతున్నారని సీఎం చెప్పడం పూర్తి అవాస్తవమన్నారు. మహానేత మరణంపై ప్రజల్లో ఇప్పటికీ ఉన్న అనుమానాలనే ఆమె ప్రస్తావించారన్నారు. ఎలాంటి కుట్రలు జరగపోతే హెలికాప్టర్‌లో ఉన్న కాక్‌పిక్ వాయిస్ రికార్డర్‌ను ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. దమ్ముంటే ఇప్పటికైనా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను ప్రజలకు వినిపించాలని డిమాండ్ చేశారు.

జగన్ ఏ తప్పూ చేయలేదు: జగన్ ఏ తప్పూ చేయనందునే కాంగ్రెస్ అధినేత సోనియాను ఎదిరించి బయటకొచ్చారని, తప్పు చేసుంటే లిక్కర్ డాన్ బొత్స మాదిరిగా అమ్మ భజన చేసేవారని అన్నారు. జగన్‌ను అరెస్టు చేసేందుకే బీసీ మంత్రిని బలిచేశారన్నారు. కేంద్రం లో 2జీ కుంభకోణంలో కూడా చిదంబరంను, సోనియా కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎస్సీ మంత్రి రాజాను బలిచేశారని చెప్పారు. ఈరోజు వైఎస్ కుటుంబంపై వీరంగం సృష్టిస్తున్న సీబీఐ.. బోఫోర్స్ కేసులో సోనియాను, ఇతర కుటుంబ సభ్యులను ఎం దుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తూ.. వారికి జేబు సంస్థగా సీబీఐ మారిందని రోజా దుయ్యబట్టారు. సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్ సింగ్ చెప్పిన మాటలు ఇందుకు నిదర్శనమన్నారు. 9 నెలలుగా సాక్ష్యాలను తారుమారు చేయని జగన్, ఉప ఎన్నికల ముందే తారుమారు చేస్తారా అని సీబీఐ జేడీని ప్రశ్నించారు.
Share this article :

0 comments: