ఉప ఎన్నికల వేళ ఊపందుకున్న కక్షసాధింపు చర్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల వేళ ఊపందుకున్న కక్షసాధింపు చర్యలు

ఉప ఎన్నికల వేళ ఊపందుకున్న కక్షసాధింపు చర్యలు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

ఊసులో లేకుండా పోతామన్న కాంగ్రెస్, టీడీపీల భయమే కారణం
ఎమర్జెన్సీని తలదన్నిన సాక్షి ఖాతాల స్తంభన, ప్రకటనల నిలిపివేత
ఫక్తు రాజకీయ కక్షసాధింపు కోణంలో సాగుతున్న సీబీఐ దర్యాప్తు
పొంతనే లేని వాదనలతో చార్జిషీట్లను వండివారుస్తున్న దర్యాప్తు సంస్థ
వైఎస్, జగన్‌లను ఎలాగోలా అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యం
రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి మరీ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్న వైనం
ఎమ్మార్, ఓఎంసీ.. కేసు ఏదైనా అసలు టార్గెట్ మాత్రం జగనే..

వాస్తవాలను యథాతథంగా వార్తలుగా మలుస్తూ, ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతూ, వారి ఆదరణతో తిరుగులేని రీతిలో దూసుకెళ్తున్న తెలుగు వారి మనస్సాక్షిపై.. నిత్యం ఎన్ని కుట్రలు! అడుగడుగునా ఎన్నెన్ని కుతంత్రాలు!! ఇటు అధికార పార్టీ. అటు పచ్చ పార్టీ. వాటికి పక్క దరువు వేస్తూ.. మూర్తీభవించిన పైత్యం వంటి పచ్చ మీడియా. కక్షసాధింపు చర్యలు, నేలబారు ఆరోపణలు, రొడ్డకొట్టుడు రాతలతో అనునిత్యం ఎందుకీ ముప్పేట దాడి! అసలు సాక్షిని చూస్తే వీరికి ఎందుకింత కంటగింపు? కేసుల ముసుగులో సాక్షిపై జరుగుతున్న కక్షసాధింపులు, వాటి సాకుతో కొనసాగుతున్న తీవ్రస్థాయి విష ప్రచారం లోగుట్టును, వాటి వెనక దాగున్న అసలు వాస్తవాలను విజ్ఞులైన పాఠకుల ముందుంచుతున్నాం...
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి

కేసు వివరాల్లోకి వెళ్లే ముందు దీని పూర్వాపరాల్ని కొంచెం ప్రస్తావించాల్సి ఉంటుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 2008 మార్చి 23న ‘సాక్షి’ పత్రిక ప్రారంభమయింది. 2009లో వైఎస్ మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అదే ఏడాది... అంటే 2009 సెప్టెంబర్ 2న విమాన దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. 

యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి చెందింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దుర్ఘటన స్థలం వద్ద తండ్రికి నివాళులర్పించిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి... మృతుల కుటుంబాల్ని ఓదార్చటానికి రాష్ట్రమంతటా పర్యటిస్తానన్నారు. ఆ మాట ప్రకారం ‘ఓదార్పు యాత్ర’ ఆరంభించారు. చాలామంది కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర వద్దని చెప్పారు. చివరికి అధిష్టానం కూడా ఆంక్షలు పెట్టింది. అయినా జగన్ పట్టించుకోలేదు. యాత్రను కొనసాగించారు. ఇంతలో... అంటే 2010 అక్టోబర్లో కాంగ్రెస్‌కే చెందిన ఎమ్మెల్యే పి.శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం వల్లే పలు సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దానిపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై కనీసం తేదీగానీ, సంతకం గానీ లేవు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా విమర్శలు, దాడులు పెరగటంతో పార్టీలో తానిక ఇమడలేనంటూ 2010 నవంబర్ 29న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేశారు. 

రాష్ట్రంలో మొదలుపెట్టిన ఓదార్పు యాత్రను కొనసాగిస్తానని చెబుతూ... ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇది జరిగిన 3 రోజులకే... అంటే 2010 డిసెంబర్ 2న ఆదాయపు పన్ను శాఖ జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. జగతి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులన్నిటినీ ఆదాయంగా పరిగణిస్తూ... దానిపై పన్ను చెల్లించాలని వాటిలో పేర్కొంది. ‘సాక్షి’ దాన్ని కోర్టులో సవాల్ చేసింది. న్యాయ పోరాటం మొదలైంది. ఇంతలో... అంటే జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నెలన్నర తరవాత 2011 జనవరి 24న శంకర్రావు లేఖను తనంతట తానే సుమోటోగా విచారణకు తీసుకుంటున్నట్లు హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతివాదులకు... అంటే జగతి సంస్థకు, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేసింది. విశేషమేంటంటే ఈ మధ్యలోనే కోర్టుకు లేఖ రాసిన శంకర్రావు మంత్రి అయ్యారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

మృతుల కుటుంబాలను ఓదార్చటానికి యాత్ర చేస్తాననటం జగన్ చేసిన తప్పా? 
ఇచ్చిన మాట ప్రకారం అధిష్టానం వద్దన్నా యాత్రను కొనసాగించటం తప్పా? 
ఆయన నాయకుడిగా ఎదుగుతున్నాడని భయపడి కొందరు కాంగ్రెస్ నాయకులు 
అధిష్టానం సాయంతో ఆయన్ను అణిచే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా?
అధిష్టానం నయానోభయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపించటం లేదా? 
ఆయన రాజీనామా చేసిన 3 రోజులకే ‘సాక్షి’కి ఐటీ శాఖ నోటీసులిచ్చిందంటే అర్థమేంటి?


టీడీపీ వచ్చి చేరింది

శంకర్రావు రాసిన ఐదు పేజీల లేఖ ఆధారంగా 2011 జనవరి 24న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులివ్వగా... తరువాతి వారానికి అంటే 2011 జనవరి 31న శంకర్రావు కోర్టుకు కొన్ని పత్రాలు సమర్పించారు. తన లేఖకు ఆధారాలన్నారు. తరవాత ఫిబ్రరి 9న శంకర్రావు మరో అఫిడవిట్ దాఖలు చేశారు. తన లేఖకు మరిన్ని ఆధారాలంటూ 333 పేజీల డాక్యుమెంట్లు సమర్పించారు. 

ఇది జరిగిన నెల రోజులకే... అంటే మార్చి 14న ఈ కేసులో తమను కూడా వాదులుగా చేర్చుకోవాలంటూ తెలుగుదేశం నేతలు కె.ఎర్రన్నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్రావు దాఖలు చేసిన పత్రాల్నే వీరూ దాఖలు చేశారు. చిత్రమేంటంటే కొన్ని పేజీలు శంకర్రావు పిటిషన్లో వేసినవి యథాతథంగా ఈ పిటిషన్లో కూడా వచ్చి చేరాయి. పేజీ నంబర్లతో సహా, ఆయా పేజీలపై రాసుకున్న రఫ్ రాతలతో సహా అన్నీ శంకర్రావు, తెలుగుదేశం నేతల పిటిషన్లలో పునరావృతమయ్యాయి. 


వై.ఎస్.జగన్‌ను వేధించటానికి కాంగ్రెస్, తెలుగుదేశం ఒక్కటయ్యాయని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా? 

తమ టార్గెట్ జగన్‌మోహన్‌రెడ్డి కనుక కాంగ్రెస్ అధిష్టానం, తమ టార్గెట్ ‘సాక్షి’ కనుక టీడీపీ ఒక్కటయ్యాయని తెలియటం లేదా? 

ఇద్దరూ వేర్వేరు కేసులు దాఖలు చేస్తే ఓకే. కానీ ఇద్దరూ ఒకే పత్రాల్ని పంచుకుని మరీ వేశారంటే, శంకర్రావు పిటిషన్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందంటే విషయం తెలియటం లేదా?



విచారణకు హైకోర్టు ఆదేశం...

శంకర్రావు లేఖను టేకెన్ అప్ రిట్‌గా తీసుకున్న హైకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. తెలుగుదేశం నేతలు ఇంప్లీడ్ పిటిషన్ వేసి నాలుగు నెలలు కూడా గడవక ముందే విచారణ పూర్తయింది. నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ సారథ్యంలోని బెంచ్ ఈ కేసులోను, ఎమ్మార్ కేసులోను సీబీఐ చేత ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ జూలై 11, 12 తేదీల్లో ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన అనంతరం రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో తనకు నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. 

దీన్ని సవాల్ చేస్తూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ‘‘ఇది ప్రాథమిక విచారణే కదా! దీన్లో నిలిపేయటానికేముంది? సీబీఐ ప్రాథమిక నివేదిక ఇచ్చాక ఆ నివేదిక మీకూ అందుతుంది. దాని ఆధారంగా పూర్తి స్థాయి విచారణకు గనక ఆదేశిస్తే అప్పుడు మీరెలాగూ మమ్మల్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది’’ అంటూ సుప్రీంకోర్టు జగన్ సంస్థల పిటిషన్లను కొట్టివేసింది. ఇంతలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలకు చెందిన వారిని, ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ప్రతినిధుల్ని పిలిచి విచారించిన సీబీఐ... హైకోర్టు నిర్దేశించిన గడువులోగానే అంటే 2011 జూలై 26న సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించింది. తరవాత మళ్లీ ఆగస్టు 1న మరో నివేదిక కూడా సమర్పించింది. 

ఈ నివేదికలో ఏముందో తనకు చూపించాలని జగన్ సంస్థల న్యాయవాదులు కోరారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నోటీసులిచ్చినా సర్కారు స్పందించలేదు. ప్రభుత్వ వాదనను కోర్టులో చెప్పనే లేదు. నాలుగు రోజుల్లో వాదనలు ముగిశాయి. 4వ తేదీన హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. వారం తిరిగేసరికల్లా... అంటే ఆగస్టు 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం కొన్ని సంస్థలకు పోర్టులు, సెజ్‌లు, భూములు కేటాయించింది. లీజులతో పాటు హోటళ్లకు అనుమతులిచ్చారు. సడలింపులూ ఇచ్చారు. 

ఈ ప్రయోజనాలు పొందినవారు అందుకు ప్రతిఫలంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. దీనిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ల చేత పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నాం’’ ఇదీ తీర్పు సారాంశం. దీంతో పాటు ఎమ్మార్ కేసులోనూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ‘‘ప్రాథమిక విచారణ నివేదిక మాకివ్వాలని సుప్రీంకోర్టు సైతం చెప్పింది. మాపై విచారణకు ఆదేశించే ముందు ఆ నివేదికలో ఏముందో మాక్కూడా తెలియాలిగా? దాన్ని మాకివ్వకుండా పూర్తిస్థాయి విచారణకు ఆదేశించటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం’’ అని ‘సాక్షి’ లాయర్లు కోర్టులో వాదించారు. కాకపోతే అప్పటి న్యాయమూర్తి జస్టిస్ కక్రూ ఏమన్నారంటే... ‘‘మేం ఆ నివేదికను చూసి మళ్లీ సీల్ చేసేశాం. అయినా మేం విచారణకు ఆదేశిస్తున్నది ఆ నివేదిక ఆధారంగా కాదు. అందుకని దాన్ని మీకివ్వాల్సిన అవసరం లేదు’’ అని. 

దీనిపై ‘సాక్షి’ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ‘‘దర్యాప్తునకు ఆదేశించారు కదా! మీరు నిర్దోషులైతే అదేదో దర్యాప్తులోనే తేలుతుంది. మీరు తప్పు చేయకుంటే దాన్ని నిరూపించుకునేందుకు ఇదో అవకాశం కదా’’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లను కొట్టేసింది. 

తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది 2011 మార్చి 14న. ప్రాథమిక విచారణ కూడా ముగిసి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది 2011 ఆగస్టు 10న. ఐదు నెలల్లో హైకోర్టు విచారించటం... ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించటం... అది పూర్తి కావటం... దానిపై మళ్లీ విచారణ జరగటం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించటం... ఈ లోపు రెండు సార్లు సుప్రీం కోర్టు కొట్టివేయటం... అన్నీ జరిగిపోయాయి. ఇక్కడ సహజంగా తలెత్తే ప్రశ్నలేంటంటే... 

ఏ కేసులోనైనా చట్ట సంస్థలైన లోకాయుక్త, కాగ్, విజిలెన్స్ విభాగం, ఏసీబీ ఇలా ఏదో ఒక సంస్థ సాక్ష్యాధారాలతో నివేదికలిస్తేనే సీబీఐ విచారణకు ఆదేశిస్తారు. మరి ఈ కేసులో ఏ నివేదిక ఆధారంగా ఆదేశించారు? సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికలో ఏముంది? 

దాన్ని జగన్ సంస్థలకెందుకు ఇవ్వలేదు? సుప్రీం చెప్పినా సరే ఎందుకు నిరాకరించారు? 
దాని ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించకపోతే మరి దేని ఆధారంగా ఆదేశించినట్లు? ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొందరికి లబ్ధి కలిగిందని, అందుకు ప్రతిగా వారు పెట్టుబడులు పెట్టారని కోర్టు పేర్కొంది. అంటే ప్రభుత్వ నిర్ణయాలు తప్పు అని కాదా? 

మరి దానిపై ప్రభుత్వం తన కౌంటర్‌ను సైతం ఎందుకు దాఖలు చేయలేదు? {పభుత్వ వాదన వినకుండానే తీర్పు ఎలా వెలువడింది? 

తాను చేసింది తప్పో ఒప్పో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? 

సీబీఐ దర్యాప్తునకు పాటించాల్సిన పద్ధతులెందుకు పాటించలేదు? ఈ దర్యాప్తుకు నిర్దిష్ట గడువు ఎందుకు విధించలేదు?


సీబీఐ దాడులు మొదలయ్యాయ్

ఆగస్టు 10న బుధవారం తీర్పు వెలువడింది. అది ఆగమేఘాలపై మూడు రోజుల్లో సీబీఐకి అధికారికంగా అందింది. మధ్యలో రెండు రోజులు సెలవు దినాలొచ్చినా... ఈ లోపే సీబీఐ సిబ్బందిని సమీకరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డిని ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కొన్ని గంటల వ్యవధిలో... అంటే 18వ తేదీన మూకుమ్మడి దాడులు మొదలుపెట్టింది. ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి రికార్డుల్ని, కంప్యూటర్లను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. మరోవంక భారతీ సిమెంట్స్‌తో పాటు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లందరి కార్యాలయాలు, ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది. వారి వద్ద నుంచి పత్రాల్ని, కంప్యూటర్లని, డేటాను స్వాధీనం చేసుకుంది. పలువురిని పిలిచి ప్రశ్నించింది. 

ఒకరకమైన భయోత్పాతాన్ని సృష్టించింది. అక్కడి నుంచి ఈ కేసులో రెండవ నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయి రెడ్డిని, ఇన్వెస్టర్లను, అధికారుల్ని, ఇతరులను పలుమార్లు పిలిచి ప్రశ్నించింది. కాకపోతే సీబీఐ చేస్తున్నది, చేయబోయేది, ఏం చేయాలనేది ముందుగానే రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఇప్పటికీ అవుతూనే ఉంది. సాక్షుల్ని పిలిచి రహస్యంగా విచారించిన అంశం కూడా ఆ మీడియాలో స్వయంగా వాళ్ల ఎదురుగానే జరిగినట్లుగా వెలువడింది. ఎన్నెన్నో కథనాలు ఈ రకంగా వెలువడగా... దీనిపై హైకోర్టులో కేసు కూడా దాఖలయింది. సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణ మీడియా వారితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారని, వందలకొద్దీ ఫోన్లు చేస్తున్నారని, ఆయన్ను నిలువరించాలని కోరుతూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు పిటిషన్ వేశారు. తరవాత ఏ కారణాల వల్లో దాన్ని ఉపసంహరించుకున్నారు. 

అరెస్టులు ఆరంభం...

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఈ ఏడాది జనవరి 2న ఆడిటర్ విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరవాత మార్చి 31న చార్జిషీటు దాఖలు చేసింది. నిజానికి చార్జిషీటు దాఖలు చేస్తే విచారణ పూర్తయినట్లే. కానీ సీబీఐ ఇక్కడే షాకిచ్చింది. తరవాత రెండో చార్జిషీటు దాఖలు చేసింది. తరవాత మూడోది కూడా వేసింది. ఇంకా వేస్తూనే ఉంటానని స్పష్టంచేసింది.

అప్పటికే కొన్ని పదులసార్లు పిలిచి.. వందల గంటలు విచారించిన విజయసాయిరెడ్డిని మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? 

సాధారణంగా దర్యాప్తు పూర్తయ్యాక వేసేదే చార్జిషీటు. మరి సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తూ చార్జిషీట్లు వేస్తుండటంలో అర్థమేంటి? 

ఎన్నాళ్లీ దర్యాప్తు సాగుతుంది? ఇంకెన్ని చార్జిషీట్లు దాఖలవుతాయి? 

ఎన్నాళ్లు ఎంతమందిని అరెస్టు చేస్తూ పోతుంది? దీనికి అంతూ పొంతూ లేదా?

ఈ ప్రశ్నలకు బదులేది?

వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడంటూ ఆయన మరణించేదాకా ప్రధాని మన్మో హన్, సోనియా ప్రశంసించలేదా? ఇప్పుడాయన కుట్రదారయ్యారా?

చట్టాన్ని గౌరవించటమంటే సోనియాకు విధేయంగా ఉండటమా?

కాగ్, విజిలెన్స్, ఏసీబీ, లోకాయుక్త... ఇలా దేన్నుంచీ ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నివేదిక లేకుండానే విచారణకు ఆదేశించటం నిజం కాదా? 

ఈ కేసులో సర్కారు కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? 
క్విడ్ ప్రో కో అంటే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనేగా! అది తేల్చాలంటే ఆ జీవోలిచ్చిన మంత్రుల్నీ విచారించాలి కదా?

పీపీపీ కాంట్రాక్టులు, జీటుజీ, ఈపీసీ ఒప్పందాలు టీడీపీ హయాంలో పుట్టిన కాన్సెప్టులు కాదా? 

హైటెక్ సిటీ ప్రాజెక్టును లిమిటెడ్ ఇన్విటేషన్ ప్రాతిపదికన ఎల్ అండ్ టీకి కట్టబెట్టలేదా? 
కృష్ణపట్నం, గంగవరం, ఎమ్మార్, రహేజా, వాడ్రేవు ప్రాజెక్టులు... కాకినాడ పోర్టు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఐఎంజీ వచ్చింది టీడీపీ హయాంలో కాదా? 

వైఎస్సార్ ప్రభుత్వం అనుసరించిందీ ఆ నిబంధనలనేగా? వాటికి వ్యతిరేకంగా తెచ్చిన 
కొత్త నిబంధనలేమైనా ఉన్నాయా?

ఇన్వెస్టర్లకు నష్టాలు, భారీ షేరు విలువ వంటి సీబీఐ సూత్రాలు ‘ఈనాడు’కు వర్తించవా? నష్టాల కంపెనీలో రిలయన్స్ ఏమాశించి ఇన్వెస్ట్ చేసింది? ముకేశ్ అంబానీకి ఒక్క రూపాయైనా రామోజీ డివిడెండ్ చెల్లించారా?

రూ.1,800 కోట్లు నష్టాల్లో ఉన్న సంస్థలో గొట్టం కంపెనీల ద్వారా అంబానీ ఎందుకు 
పెట్టుబడి పెట్టారు? ఆ గొట్టాల్లోంచి ‘ఈనాడు’లోకి డబ్బెందుకు వచ్చింది? 
దీన్ని బయటపెట్టినందుకేనా రామోజీకి, చంద్రబాబుకు ‘సాక్షి’ అంటే కక్ష? 
వేరొక మీడియా ఉంటే ఈ పాపాలు బయటకు వస్తాయనేనా ఇంత కుట్ర?
‘సాక్షి’ లేకుంటే రామోజీ ‘420’ పనుల్ని వేరే మీడియా ఎత్తి చూపించగలదా? 
Share this article :

0 comments: