చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు

చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012

* చెప్పినట్లు చేస్తే ‘బయటపడేస్తామ’ని మోపిదేవిపై పెద్దల ఒత్తిళ్లు
*నిన్నమొన్నటి వరకు వాన్‌పిక్ భూ కేటాయింపుల్లో తప్పులు జరగలేదని ఉద్ఘాటించిన మోపిదేవి
*అరెస్టు నేపథ్యంలో వైఎస్ వల్లే సంతకాలు చేసినట్లు చెప్పాలంటూ మోపిదేవిపై కాంగ్రెస్ పెద్దల ఒత్తిళ్లు
* అలాగైతేనే బయటపడేస్తామని హామీ
*ఆ మేరకే రాజీనామా లేఖపై సంతకం చేశారంటున్న సన్నిహితులు
* సీఎంపై కత్తులు నూరిన పీసీసీ నేతే మంత్రాంగం నడిపిన వైనం
* తప్పు చేసినా నిర్దోషిగా బయటపడతారంటూ ఆనక ప్రకటనలు
* తొలుత విచారణ కోసమే అరెస్టు అని భావించిన మోపిదేవి
* కేసులో దోషిగా చేర్చినట్లు తెలుసుకుని హతాశుడైన వైనం
*తమను బలిచేస్తున్నారని ఇతర మంత్రుల్లోనూ తీవ్ర ఆందోళన
* సీఎం తమను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం
* మంత్రులందరికీ చుట్టుకోక తప్పదంటున్న న్యాయ నిపుణులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ భూముల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నమొన్నటి వరకు చాలా గట్టిగా చెప్పిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత మాట మార్చి.. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒత్తిడి మేరకు ఫైళ్ల మీద సంతకాలు చేశానని తన రాజీనామా లేఖలో పేర్కొనటం వెనుక పెద్దల ఒత్తిళ్లు, భారీ వ్యూహం ఉన్నట్లు తెలిసింది. వాన్‌పిక్ భూముల కేటాయింపు విషయంలో మోపిదేవిని సీబీఐ ఇదివరకే రెండుసార్లు విచారించింది.

ఆ విచారణ సందర్భంగా కూడా మంత్రిమండలి నిర్ణయం మేరకు ఆ భూముల కేటాయింపు జరిగిందని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో గుంటూరు పర్యటన సందర్భంగా కూడా భూ కేటాయింపుల్లో ఎలాంటి తప్పులూ జరగలేదని పునరుద్ఘాటించారు. ఇంత గట్టిగా చెప్పిన మోపిదేవిని సీబీఐ అరెస్టు చేయటం, ఆ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో.. అంతకు ముందు చెప్పిన దానికి విరుద్ధంగా.. వైఎస్ ఒత్తిడి మేరకు ఫైళ్లపై సంతకాలు చేశానని పేర్కొనటం మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం విస్మయానికి గురిచేసింది.

తెర వెనుక ఏదో జరిగి బలమైన కారణం లేకపోతే మోపిదేవి ఆ రకమైన రాజీనామా లేఖపై సంతకం చేసే వారే కాదని వారు అంటున్నారు. ఈ కేసులో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆయన కుటుంబాన్ని, ఆయన సన్నిహితులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇంత కాలం సాగిన సీబీఐ విచారణ కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని.. పైగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో.. ఆ అపవాదు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడాలంటే సొంత పార్టీ నేతలను కొందరిని బలిచేయకతప్పదన్న ఆలోచన మేరకే మోపిదేవి అరెస్టు జరిగిందని మంత్రుల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ అరెస్టు వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మరో సీనియర్ మంత్రి పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు నడిపించారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మోపిదేవి బలహీనవర్గాల నుంచి ఎదిగిన నాయకుడు. ఢిల్లీ స్థాయిలో ఆయన కు ఎలాంటి లాబీయింగ్ లేదు. రాష్ట్రస్థాయిలోనూ బలమైన వర్గం కానీ గ్రూపు కానీ లేదు. ఈ పరిస్థితులను అవకాశంగా చేసుకుని.. మోపిదేవిని నిస్సహాయ స్థితి లోకి నెట్టివేసిన కాంగ్రెస్ పెద్దలు తాము అనుకున్నట్లు కథను నడిపిస్తున్నట్లు పార్టీ వర్గాలే వివరిస్తున్నాయి. బలీహ నవర్గాలకు చెందిన తనను బలిపశువును చేస్తున్నారని, ఇది అన్యాయమని మోపిదేవి వెంకటరమణ ఎంతగా ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ.. ఆయనపై పలురకాల ఒత్తిళ్లు తెచ్చి, మాయమాటలు ప్రయోగించారని తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అరెస్టు తరువాత మోపిదేవి కాంగ్రెస్ పార్టీ పైనా, కేంద్ర నాయకత్వం పైనా, సీబీఐ తీరు పైనా తమ పైనా విమర్శలు, ఆరోపణలు గుప్పించకుండా ఆయనను మభ్యపెట్టారు.

‘‘ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయాలని నిర్ణయించాం. దానికి ముందుగా మీ అరెస్టు తప్పదు. మేం చెప్పినట్లు నడచుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తాం’’ అని ఆయనను నమ్మించారు. అరెస్టు ఎలాగూ తప్పదని, సీబీఐ మిమ్మల్ని అరెస్టు చేయాలని నిర్ణయించినందున తాము చెప్పినట్లు నడవకుంటే కేసు నుంచి బయట పడే పరిస్థితీ ఉండదని భయపెట్టారు. ‘‘అసలు తప్పుచేయనప్పుడు ఎందుకు రాజీ నామా చేయాలి? రాజీనామా చేస్తే తప్పు చేసినట్టు అంగీకరించినట్టు అవుతుం ది? రాజీనామా చేసే ప్రసక్తే లేదు...’’ అని అప్పటివరకూ మోపిదేవి చాలా గట్టిగా చెప్తూ వచ్చారు.

అరెస్టుకు ముందు రోజు సీబీఐ విచారణ తర్వాత కూడా ఆయన మీడియాతో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చానళ్లు కూడా మోపిదేవి చెప్పిన విషయాలను ప్రసారం చేశాయి. ఇంత జరిగినా అరెస్టయిన తర్వాత అం దుకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు తెచ్చిన రాజీనామా లేఖపై సంతకం చేయటం మంత్రులు చాలా మందికి అంతుబట్టటం లేదని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

నన్నెందుకు బలిచేస్తున్నారు?
తొలి రోజు విచారణ సందర్భంలోనే సీబీఐ తీరును పసిగట్టిన మోపిదేవి తనను అరెస్టు చేస్తారన్న అభిప్రాయానికి వచ్చి ఆ వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అంతకుముందే సీబీఐకి వత్తాసుగా ఉన్న కొన్ని పత్రికల్లో మోపిదేవి అరెస్టుపై వార్తలు కూడా వెలువడ్డాయి. సీఎంను కలిసిన సందర్భంలోనే మోపిదేవిపై తీవ్ర ఒత్తిళ్లు వ చ్చాయి. అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణను కలసిన సమయంలోనూ ఇదే రకమైన వాతావరణం కనిపించటంతో మోపిదేవి తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యారు.

ఈ కేసులో జగన్ వ్యవహారం పైనే కాంగ్రెస్ ఉనికి ఆధారపడి ఉందని, ఆయన్ను నిలువరించాలంటే ఇంతకు మించిన మార్గం లేదని, మీకేమీ భయం అక్కర్లేదని, తాము చూసుకుంటామని ఆ నేతలు చెప్పటంతో మోపిదేవి నమ్మారని తెలుస్తోంది. తెర వెనుక జరిగిన ఈ తతంగాన్ని ఒక నాయకుడు ముందుగానే ఒక చానల్‌కు చేరవేశాడు. దాంతో.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకే తాను సంతకాలు చేశానని, జగన్ ధనదాహానికి తాను బలిపశువునయ్యానని మోపిదేవి సీబీఐ ముందు చెప్పారంటూ ఆయన అరెస్టును చూపటానికి ముందే ఆ చానల్ కథనం ప్రసారం చేసింది.

అంతకుముందు ఉదయమే తిరిగి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన నేతలు అందుకు అనుగుణంగా రాజీనామా లేఖ తయారీ తదితర వ్యవహారాలపై దృష్టిసారించారు. మధ్యాహ్నానికి ఆ లేఖపై మోపిదేవి చేత సంతకం చేయించి సాయంత్రం మీడియాకు విడుదల చేశారు. అయితే తన అరెస్టు వ్యవహారం కేవలం విచారణ వరకే పరిమితమవుతుందని మోపిదేవి భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసులో తననో నిందితుడిగా చేసి అరెస్టు చేయటంతో ఆయన ఒక్కసారిగా హతాశుడయ్యారని సన్నిహితులు చెప్పారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సాయంత్రం మంత్రులతో భేటీలో కేవలం విచారణ కోసమే అరెస్టు జరిగిందని, మోపిదేవి త్వరలోనే బయటకు వచ్చేస్తారని చెప్పారు. అయితే ఆయన్ను నిందితుడిగా చూపి సీబీఐ అరెస్టు చేసిన విషయం ఆ తరువాత తెలుసుకున్న మంత్రులు సీఎం తమనూ మభ్యపెడుతున్నారని, రేపు తమ గతీ ఇదేనేమోనని ఆవేదనకు గురయ్యారు.

మిగతా మంత్రుల్లో భయం భయం...
ముఖ్యంగా 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు ఈ పరిణామాలపై తీవ్ర గందరగోళంలో పడ్డారు. మరోపక్క మోపిదేవిని అరెస్టు చేస్తారని అనుకోలేదని, ముందుగా తనకెలాంటి సమాచారమూ లేదని సీఎం మంత్రులతో పేర్కొనటం కూడా సందేహాలకు తావిస్తోంది. తమకింద పనిచేసే అధికారిని అరెస్టు చేస్తేనే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇవ్వకుండా జరగదని.. అలాంటిది కేబినెట్ మంత్రి అరెస్టు విషయం తనకు తెలియదని సీఎం చెప్తుండటం చూస్తుంటే ఆయన తమను ఎంతగా తప్పుదోవ పట్టిస్తున్నారో తెలుస్తోందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు తమకూ అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.

ఆ పరిస్థితి వస్తే మేమేం చేయాలి?
మోపిదేవికి వచ్చిన పరిస్థితే వస్తే ఏం చేయాలని ఒక మంత్రి తన సన్నిహితుడైన సీనియర్ న్యాయవాదితో చర్చించారు. ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తేనే ఫైలుపై సంతకం చేశానని చెప్పినంత మాత్రాన కేసు నుంచి బయట పడలేరని, మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారని, ఏదైనా ఫైలుపై పూర్తి సమాచారం లేకపోయినా, లేదా ఇష్టం లేకపోయినా మంత్రి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చని, అంతే తప్ప ఇతరత్రా కారణాలు చెప్పినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరని, కేసు నుంచి బయటపడేస్తానని ఎవరైనా అన్నా అది వట్టి మాటేనని, కేసు నుంచి తప్పించుకోలేరని ఆ సీనియర్ న్యాయవాది చట్టాలను విడమరిచి చెప్పినట్లు సదరు మంత్రి సన్నిహితుడు ఒకరు తెలిపారు.

మౌనంగా ఉన్నందువల్లే ఇంతదాకా వచ్చింది...
ఈ వ్యవహారంపై తాము మౌనంగా ఉండటం వల్లనే ఇంతవరకు వచ్చిందని, ఇలాగే ఉంటే ప్రమాదం ముంచుకు వస్తుందన్న అభిప్రాయానికి ఆయా మంత్రులు వస్తున్నారు. అందుకే ఈ విషయంలో మరింతగా కూరుకోకముందే మేలుకుని సీఎంను, పార్టీ అధిష్టానాన్ని నిలదీయాలనీ వారు ఆలోచనలు సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం సీఎం నిర్వహించిన సమావేశంలో సీబీఐ నోటీసులు అందుకున్న ముగ్గురు మంత్రులు తమ పరిస్థితి ఏమిటని సీఎంను ప్రశ్నించారు. సీఎం దాదాపు మౌనంగానే ఉన్నా మంత్రులనుంచి పదేపదే ప్రశ్నలు రావటంతో తన చేతుల్లో ఏమీ లేదని తేల్చేశారు.

కనీసం ప్రభుత్వం తరఫున జీఓలపై ఇంప్లీడ్ అయ్యే అంశం పైనా సీఎం భరోసా ఇవ్వలేకపోవడం, ఎవరి వ్యక్తిగతంగా వారే ఈ నోటీసులకు సమాధానం ఇచ్చుకోవాలని సీఎం పేర్కొనడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. శుక్రవారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో మరోసారి భేటీ అయ్యారు. అలాగే మంత్రి సబితారెడ్డి, గీతారెడ్డిలూ వీరిద్దరితో మాట్లాడారు. మరోవైపు.. సీఎం, పీసీసీ చీఫ్ కలిసే ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నారన్న అనుమానాలూ వారిలో ఏర్పడ్డాయి. కిరణ్‌కు బద్ధవ్యతిరేకిగా ఇప్పటివరకు తమ ద్వారా అసమ్మతి కార్యకలాపాలను నడిపించిన బొత్స కూడా ఇందులో భాగస్వామి కావటం మంత్రుల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

మోపిదేవి అరెస్టును సీబీఐ అధికారికంగా ప్రకటించిన వెంటనే బొత్స హుటాహుటిన రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అయితే ఆ సందర్భంగా మోపిదేవి రాజీనామా లేఖ ఏదీ తాను గవర్నర్‌ను కలిసినప్పుడు ఇవ్వలేదని ఆ తర్వాత గాంధీభవన్‌లో చెప్పారు. ఆయన గవర్నర్‌ను కలిసిన సమయంలోనే కొత్తగా ఏసీబీ డీజీగా నియమితులైన ప్రసాదరావు అక్కడే ఉండటం గమనార్హం.

సీఎంపై మోపిదేవి కుటుంబ సభ్యుల ప్రశ్నల పరంపర
మోపిదేవిని బలిపెట్టిన పెద్దలే ఆయన కుటుంబాన్ని ఊరడించే మాటలు చెప్పి మరింతగా మభ్యపెడుతున్నారని మోపిదేవికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు, ఆయన స్నేహితులు మండిపడుతున్నారు. మోపిదేవి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమను నట్టేట్లో ముంచేశారని విలపిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణను గురువారం సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం పరామర్శించారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 లోని మంత్రుల క్వార్టర్లలో ఉంటున్న మోపిదేవి కుటుంబ సభ్యులతో సీఎం పది నిమిషాల పాటు మాట్లాడారు. పక్క క్వార్టర్‌లోనే ఉంటున్న మంత్రి శ్రీధర్‌బాబు కూడా అక్కడికి వచ్చారు. సీఎంను చూడగానే మోపిదేవి సతీమణి బోరున విలపించారు. ‘ఇంత అన్యాయం చేస్తారా?’ అంటూ నిలదీశారు. సీఎంతో ఆమె పలు నిష్టూరాలు మోపారు. మోపిదేవి పిల్లలు సీఎం వచ్చినా దగ్గరకు వెళ్లకుండా దూరంగానే ఉండిపోయారు. సీఎంకు అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా మారటంతో కేవలం పది నిమిషాల్లోనే వెనుదిరిగారు. మోపిదేవి సతీమణి రోదిస్తూ అడిగిన ప్రశ్నలకు సీఎంతో సహా ఎవరూ నోరు తెరవలేదని సమాచారం.

సీఎంతో ఉండవల్లి భేటీ...
గురువారం మోపిదేవిని సీబీఐ కార్యాయం వద్ద కలిసి మంతనాలు సాగించిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మోపిదేవి అంశంతో పాటు సీబీఐ విచారణలో తదుపరి మంత్రుల వ్యవహారమూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ప్రత్యేక ంగా భేటీ అయ్యారు. మోపిదేవి అరెస్టు నేపథ్యంలో ఆయన బొత్స ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చుకోవటంతో పాటు సీబీఐ విచారణ, అరెస్టుల వ్యవహారాలపై మంతనాలు సాగించారు. ఈ వ్యవహారంలో తమను ఆదుకోవాలని ఆయన బొత్సను వేడుకున్నట్లు తెలుస్తోంది.

మోపిదేవిని కలిసిన వట్టి: వాన్‌పిక్ కేసులో అరె స్టయి సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవి వెంకటరమణతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ భేటీ అయ్యారు. విచారణ సందర్భంగా సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్‌కుశ అతిథి గృహంలో ఉన్న మోపిదేవితో ఆయన అరగంటపాటు మంతనాలు జరిపారు. రాత్రి 7.30 గంటల సమయంలో దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చిన ఆయన ఎనిమిది గంటల వరకు లోపలే ఉన్నారు. ఆ సమయంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కూడా దిల్‌కుశలోనే ఉండటం గమనార్హం. వట్టి వసంతకుమార్‌తోపాటు ఒక న్యాయవాదిని కూడా దిల్‌కుశ లోపలికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

ఏదైనా కేసు విచారణలో భాగంగా సీబీఐ కస్టడీలో ఉన్న నిందితులను వేరే వ్యక్తులు కలిసేందుకు అనుమతి ఇవ్వడం అసాధారణం. విచారణకు సంబంధించి నిందితునిపై వారేమైనా ప్రభావం చూపిస్తారా? అనే అనుమానంతో కుటుంబ సభ్యులను సైతం కలిసేందుకు అనుమతి ఇవ్వరు. కానీ, సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవిని గురువారం ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు కలుసుకోగా, శుక్రవారం మంత్రి వంసతకుమార్ ఏకంగా అరగంటపాటు భేటీ అవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవితో భేటీ అనంతరం వట్టి మీడియాతో మాట్లాడుతూ మిత్రుడైనందునే పరామర్శించానని చెప్పారు.




అరెస్టుకు ముందు... అరెస్టు తర్వాత...
సీబీఐ అరెస్టు చేయటానికి ముందు వాన్‌పిక్ భూ కేటాయింపుల నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ గట్టిగా సమర్థిం చారు. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత సంతకం చేసిన రాజీనామా లేఖలో.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాలతోనే సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ఆయన రాజీనామా లేఖ ముందస్తుగా తయారు చేసిందని స్వయంగా మంత్రులే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ నెల 20న రేపల్లెలో మోపిదేవి విలేకరులతో మాట్లాడుతూ...
‘‘ఒక జీవో విడుదల చేసే సమయంలో ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. అయితే ఆ జీవోల వల్ల ఏమైనా నష్టాలు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. తీరప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాన్‌పిక్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైనదే. సీబీఐ విచారణలో నా నిజాయతీ నిరూపించుకుంటా.’’

ఈ నెల 24 న సీబీఐ అరెస్టు చేసిన తర్వాత సీఎంకు సంతకం చేసి పంపిన రాజీనామా లేఖలో...
‘‘... నేను ఎప్పుడూ నాయకుడిని మరియు పార్టీని నమ్ముతూ మరియు ఆదేశాలు పాటించే క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయానికి రాకున్ననూ, వారి కార్యాలయానికి పిలిపించి వారి కార్యదర్శి సమక్షంలో సంతకాలు పెట్టటం జరిగింది.’’
Share this article :

0 comments: