ఎమార్పీకే పీఆర్పీని అమ్ముకున్న చిరంజీవి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమార్పీకే పీఆర్పీని అమ్ముకున్న చిరంజీవి

ఎమార్పీకే పీఆర్పీని అమ్ముకున్న చిరంజీవి

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

 ‘‘అమ్మకు మూర చీర కొనివ్వలేడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట’’అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక కమిటీ సభ్యురాలు ఆర్‌కె రోజా ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డికి మద్దతుగా బుధవారం ఎస్టీవీనగర్ (టీవీఎస్ షోరూం సర్కిల్) రోడ్డు షోలో ఆమె ప్రసంగించారు. జగన్ రాక ముందు అక్కడికి చేరుకున్న రోజా తనదైన శైలిలో చిరంజీవి, చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిపై అభిమానం కోసం 17 మంది ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. గొప్ప మనసుతో ఇక్కడి వారు చిరంజీవిని గెలిపిస్తే ఆయనేమో ప్రజారాజ్యం పార్టీని ఎమ్మార్పీకే అమ్ముకున్నారని చెప్పారు. ఆయన సినిమాలో హీరో ఏమో గాని నిజ జీవితంలో మాత్రం జీరో అని ఎద్దేవా చేశారు. ఎన్‌టీఆర్ 2రూపాయలకు కిలో బియ్యం ఇస్తే, దానిని అటకెక్కించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. 9 గంటలు కరెంటు దండగని, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని ఆ నాడు పలికిన చంద్రబాబు, ఇప్పుడేమో ఉచితంగా కరెంటు ఇస్తామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఁఅమ్మకు చీర కొనివ్వలేడు కాని, పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తాడంట అంటూ తన దైన శైలిలో ధ్వజమెత్తారు. 

ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో...
పేద ప్రజల కోసం అ
హర్నిశలు పాటుపడిన వైఎస్ కుటుంబంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడి దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అతడే మన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి’’ అని చెప్పారు. ప్రజలను రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేస్తే ఆ ప్రజలు కన్‌ఫ్యూజ్ లేకుండా మట్టి కరిపిస్తారని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ఆమె తీవ్రంగా హెచ్చరించారు. లక్ష్మీపురం శంకరంబాడీ సర్కిల్లో ఆ పార్టీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, మునిరెడ్డి, సుబ్రమణ్యం మేస్త్రీ, గిరి, గోవిందరెడ్డి, సత్యవేడు నియోజకవర్గం నాయకులు బీరేంద్రవర్మ, ఆదిమూలం, ఎస్టీవీనగర్‌లో ఎస్‌కె బాబు, మన్నెం సోదరులు (మునిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి), ఆంజనేయులు, ముద్రనారాయణ, నాగయ్య, మునీశ్వరి, రాణెమ్మ, శ్రీదేవి, తాళ్లూరి ప్రసాద్, శివ,బాలాజి తదితరులు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
Share this article :

0 comments: