స్టేపై ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ హర్షం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టేపై ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ హర్షం

స్టేపై ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ హర్షం

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

సాక్షి పత్రిక, టీవీ చానల్‌కు ప్రకటనలు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే), ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి డి.కె.అరుణతో ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ సమావేశమై చర్చలు జరిపినప్పుడే.. ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కోరామని ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. అలా చేసి ఉంటే ప్రభుత్వానికి కనీసం మర్యాద దక్కేదని తెలిపారు. ఇలాంటి జీవోలు చట్టపరంగా నిలబడవని ఆరోజునే మంత్రికి స్పష్టంగా చెప్పామని, దాన్నే ఇప్పుడు హైకోర్టు ధ్రువీకరించిందని అన్నారు.


 ‘సాక్షి’ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 2097పై హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘సాక్షి’ బ్యాంకు అకౌంట్లను సీబీఐ ఫ్రీజ్ చేయడాన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయడం అవివేకమని, అర్ధరాత్రి జీవో జారీ చేసి పత్రికా స్వేచ్ఛకు సర్కారు భంగం కలిగించిందని విమర్శించారు. హైకోర్టు స్టేపై ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎంఎస్ హష్మి, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ (హెచ్‌యూజే) నాయకుడు మామిడి సోమయ్యలు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. 
Share this article :

0 comments: