‘సాక్షి’కి ప్రజలే అండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ‘సాక్షి’కి ప్రజలే అండ

‘సాక్షి’కి ప్రజలే అండ

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

 ‘తెలుగు ప్రజల జీవన స్రవంతిలో కలసిపోయిన సాక్షిని వారే తమ గుండెల్లో పెట్టి కాపాడుకుంటారు. సాక్షిని మూసేయాలని కుట్రలు పన్నితే..కోట్లాది రూపాయలనుఇచ్చి దానిని నడిపించుకోవడానికి ప్రజలు ముందు కు వస్తున్నారు. ప్రజల అండతో జాతీయస్థాయి మీడియా దిగ్గజాలు నివ్వెరపోయేలా ఆ పత్రికను, టీవీ చానల్‌ను నడుపుతాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాక్షిపై జరిగిన దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి కాదని చంకలు గుద్దుకుంటున్న మీడియా సంస్థలు.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ నుంచి కొన్ని దేశాలకు ఎదురైన అనుభవాలే చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఈ చర్యను తప్పు పట్టాల్సిందిపోయి అదేదో సీబీఐ సాధించిన ఘనవిజయంగా బాబు చెప్పడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.

జగన్‌ను ఎదుర్కోలేక సాక్షిపై దాడి: గట్టు
రాష్ట్రంలో జరగనున్న ఉపఎన్నికల్లో రాజకీయంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే ధైర్యంలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమ్మక్కై ‘సాక్షి’ గొంతు నొక్కుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికే కాంగ్రెస్, టీడీపీలు కలసి నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు చాటుమాటు ఢిల్లీ పర్యటనలు చేసి అక్కడిపెద్దలతో కలసి రచించిన స్క్రిప్టే రాష్ట్రంలో సీబీఐ అమలు చేస్తు న్నదని, అందులో భాగంగానే సాక్షి ఖాతాలను స్తంభింపచేశారని విమర్శించారు. దేశంలో అత్యంత ప్రమాదకర వైట్‌కాలర్ నేరస్తుల్లో చంద్రబాబు ఒకరని గట్టు విమర్శించారు. ఎల్లోమీడియాలో ఉన్న పెట్టుబడులన్నీ చంద్రబాబువేనని ఆరోపించారు. రూ.8 వేల జీతంతో పనిచేసే ఒక రిపోర్టర్‌ను అదే సంస్థకు యజమానిని చేసి వెనకుండి నడిపిస్తున్నది ఈ బాబేనన్నారు. 
Share this article :

0 comments: