వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు

వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012

అసెంబ్లీ రికార్డులను కూడా తారుమారు చేస్తున్నారు
ఆనాడు వైఎస్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాం
ఆయన ఈనాడుకు ప్రకటనలు ఆపివేయలేదు
ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషుల దాడులను ఖండించారు
రామోజీరావు సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారు
జగన్‌ను వేధిస్తున్నా మీడియాపై దాడిగా సాక్షి చెప్పలేదు
ఖాతాలను ఫ్రీజ్ చేసి, నల్లజీవోలు జారీ చేశాకే జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు 
ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ ద్వారా రూ.2,600 కోట్లు సేకరించిన అంశంపై అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడిన అంశాలను తెలుగుదేశం పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... అసెంబ్లీ రికార్డులను కూడా తారుమారు చేసి ప్రెస్‌మీట్‌లతో స్లైడ్స్ వేసి దుష్ర్పచారం చేస్తున్న తీరుపట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. రామోజీ విషయంలో మార్గదర్శి మీద రాష్ట్ర ప్రభుత్వమే సాక్ష్యాధారాలతో సహా క్రిమినల్ కేసును నడిపించినా... ఆ రూ.2,600 కోట్లు ఉషోదయా ద్వారా అచీవర్ కంపెనీలోకి వెళ్లి అక్కడి నుంచి మీడియాలోకి ప్రవహించాయని తెలిసినా... ఈనాడుకు ప్రకటనలు నిలిపివేయలేదని గుర్తుచేశారు. 

మార్గదర్శి కేసునకు సంబంధించి వైఎస్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఆయన వారసులుగా ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణకు ఆదేశిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అని గొంతు చించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సాక్షి పత్రిక గొంతు నొక్కాలని ప్రభుత్వం దొంగదారుల్లో జీవోలు జారీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు. రామోజీరావు కేసు విషయంలో అప్పట్లో సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించారని చెప్పారు. అందువల్లే సుప్రీంకోర్టు ఈ కేసు వ్యాపారానికి సంబంధించినది కాబట్టి పత్రికాస్వేచ్ఛకు భంగం వాటిల్లినట్లు ఎందుకు చూడాలని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఆంధ్రజ్యోతిపై మందకృష్ణ మనుషులు దాడిచేస్తే దాన్ని ఖండించిన వ్యక్తుల్లో నాటి సీఎం వైఎస్ కూడా ఉన్నారని తెలిపారు. ఈ రోజు కిరణ్ ప్రభుత్వం అర్ధరాత్రి విడుదల చేసిన నల్ల జీవోపై చంద్రబాబు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఏమయ్యారని జూపూడి నిలదీశారు.

బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసి, నల్లజీవో జారీ తర్వాతే...

‘‘కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కలిసి సీబీఐ చేత ఎనిమిది నెలలుగా జగన్‌ను వేధింపులకు గురిచేస్తూ, సాక్షి సంస్థలపై దాడులు చేసినప్పటికీ రామోజీరావు చెప్పినట్టుగా ఏనాడు సాక్షి యాజమాన్యంగానీ, జర్నలిస్టులుగానీ దాన్ని మీడియాపై దాడిగా చెప్పలేదు. కుట్ర రాజకీయాలకు జగన్ ధైర్యంగా ఎదురొడ్డి నిలబడ్డారు. కానీ మీరు చేస్తున్న వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. సాక్షిపై ఆరోపణలు రుజువు కాకముందే దాని పీకనొక్కే దుశ్చర్యలకు సిద్ధపడ్డారు. సాక్షి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, నల్లజీవోలు విడుదల చేసిన తర్వాతే జగన్‌కానీ ఆ సంస్థ సిబ్బంది మీడియా స్వేచ్ఛపై ప్రశ్నించారు’’ అని జూపూడి వివరించారు. చంద్రబాబు చెంచాలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులను దావూద్ గ్యాంగ్‌తో పోలుస్తూ మదమెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు అధికార, ప్రతిపక్షం కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు. సాక్షిపై కేసులున్నాయని, సీబీఐ అకౌంట్లు ఫ్రీజ్ చేసినందుకే ప్రకటనలు నిలిపివేస్తున్నామని చెబుతున్న కిరణ్ ప్రభుత్వం... మార్గదర్శిపై ఇప్పటికీ కేసు పెండింగ్‌లోనే ఉంది కనుక ఈనాడుకు ప్రకటనలు నిలిపేసే దమ్ము, ధైర్యం ఈ సీఎంకు ఉందా? అని జూపూడి నిలదీశారు.
Share this article :

0 comments: