భారతి కంటతడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారతి కంటతడి

భారతి కంటతడి

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* భయపడొద్దంటూ ధైర్యం చెప్పి అనునయించిన జగన్
* సముదాయించిన మహిళా న్యాయవాదులు, కోర్టులోని మహిళా సిబ్బంది
* ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే భారతి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జూన్ 11 దాకా రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించగానే ఆయన సతీమణి వైఎస్ భారతి ఒక్కసారిగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆమె నాంపల్లిలోని సీబీఐ కోర్టులోనే గడిపారు. ఉదయం కోర్టు ప్రారంభం కాకముందే కోర్టుకు వచ్చిన భారతి, స్థలం లేకపోవడంతో చిన్న బల్లపై ఇరుక్కుని కూర్చున్నారు. సాయంత్రం తీర్పు వెలువడేదాకా ఎంతో బాధతో గడిపారు. జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు సాయంత్రం నాలుగు గంటలప్పుడు జడ్జి ప్రకటించడంతో ఆమె ఉద్వేగంతో కంటతడి పెట్టారు. 

కన్నీటి మధ్యే కోర్టు హాలు పక్కనున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అరగంట పాటు గడిపారు. ఆ సమయంలో పలువురు మహిళా న్యాయవాదులు వచ్చి ఆమెను ఓదార్చారు. ‘న్యాయమే గెలుస్తుంది. మీరేం బాధపడొద్దు’ అంటూ సముదాయించారు. కోర్టులోని మహిళా సిబ్బంది కూడా భారతికి బాసటగా నిలిచారు. కోర్టు ఆదేశాల అనంతరం బయటకు వచ్చిన జగన్ కూడా ఆమె భుజంపై చేయి వేసి అనునయించారు. ‘ఏమీ భయపడొద్దు’ అంటూ ధైర్యం చెప్పి వెళ్లారు. మూడో అంతస్తులో ఉన్న కోర్టు హాలు నుంచి మెట్ల మీదుగా కిందికి దిగే సమయంలో కూడా మహిళా న్యాయవాదులు భారతి వెంటే నడిచారు. కోర్టు ఆవరణ బయటికి వెళ్లి కారెక్కే దాకా ఆమె వెంటే ఉన్నారు.
Share this article :

0 comments: