'ప్రకటనల నిలుపుదల సమంజసమా?' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రకటనల నిలుపుదల సమంజసమా?'

'ప్రకటనల నిలుపుదల సమంజసమా?'

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

సిన్సినాటి/ఒహియో: సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టీవీల బ్యాంకు ఖాతాలు స్తంభించడానికి తోడు ఈ రెండు మాధ్యమాలకు ప్రకటనలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ఎన్నారైలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సాక్షి దిన పత్రిక చేసిన కృషిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయి స్వార్థ ప్రయోజనాలకు పాకులాడుతున్నారని వారు విమర్శించారు. 

అక్రమ మార్గంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి.. ఆ పదవిని నిలుపుకొనేందుకు దొడ్డిదారిలో సాక్షిని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండా.. అర్థాంతరంగా ప్రకటనల నిలిపివేత జీవో జారీ వెనుక రహస్యమేమిటో సులభంగానే అందరికీ అర్థమవుతోందన్నారు. సాక్షి పత్రిక, టీవీపై 20 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 

అవసరమైతే, ఎన్నారైలంతా కలిసి ఒక నెల జీతాన్ని సాక్షి రిజర్వ్ ఫండ్ గా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులమంతా కలిసి సాక్షి పత్రికను నిలబెట్టుకుంటామని శివశంకర్ కొండా, వెంకటరమణారెడ్డి శనివారపు, శశిరెడ్డి పుల్లెలరేవు, పార్థసారథి గోర్ల, సునీల్, చిదంబర్ సిరిరాగం, వెంకట్ రెడ్డి వాక తదితరులు పేర్కొన్నారు.

అట్లాంటా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్థానిక ఎన్నారైలు గురవారెడ్డి తదితరులు హెచ్చరించారు. ఇకనైనా కక్షపూరిత వైఖరి విడనాడి సాక్షి దినపత్రికకు ప్రకటనలు నిలుపుదల చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: