జగన్ సహకరించలేదా? సీబీఐని చెప్పమనండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సహకరించలేదా? సీబీఐని చెప్పమనండి

జగన్ సహకరించలేదా? సీబీఐని చెప్పమనండి

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012


సీబీఐ అనుమానాలన్నీ జగన్ నివృత్తి చేశారని వెల్లడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ అధికారులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకరించలేదని కొన్ని వ్యతిరేక చానళ్లలో వచ్చిన వార్తా కథనాలు పూర్తి అవాస్తవమని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. జగన్ సహకరించలేదని సీబీఐని నోట్ పంపమనండి అని హరి ఆ చానళ్లను సూటిగా అడిగారు. సీబీఐ లేవనెత్తిన అనుమానాలన్నింటికీజగన్ సమాధానమిచ్చారని చెప్పారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ.. మనసులో ఏదో పెట్టుకొని ఒక వర్గం మీడియా గందరగోళం సృష్టించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్‌కు సర్వ అధికారాలున్నాయని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. వారు ఎలాంటి చర్య తీసుకున్నా ఫర్వాలేదన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని హరి పేర్కొన్నారు.

చంద్రబాబు స్క్రిప్టును అమలు చేస్తున్న కాంగ్రెస్: జూపూడి

జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రూపొందించిన మోసపూరిత స్క్రిప్టును కాంగ్రెస్ హైకమాండ్ సీబీఐ ద్వారా అమలు చేస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న నీచరాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. ఆ రెండు పార్టీలకు 18 చోట్లా డిపాజిట్లు దక్కవని మండిపడ్డారు. జగన్‌పై సీబీఐ వ్యవహరిస్తున్న తీరు చూసి అయ్యో పాపమంటూ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచన చేస్తున్నారని, వారు తగిన బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్సే: రోజా
మహానేత వైఎస్‌ను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోజా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హైకమాండ్, చంద్రబాబుల ఆలోచన మేరకే సీబీఐ జగన్‌ను వేధిస్తోందన్నారు. సీబీఐ 9 నెలలుగా దర్యాప్తు చేస్తూ.. మూడు చార్జిషీట్‌లు వేసిన తర్వాత ఉప ఎన్నికల నేపథ్యంలో అర్ధరాత్రి సమన్లు జారీ చేయడాన్ని ఏ విధంగా భావించాలని ప్రశ్నించారు. 26 జీవోలు అక్రమమని చెబుతున్న సీబీఐ ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదన్నారు. జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లైతే ఐటీ రిటర్న్ ఎలా చేయగలుగుతారని నిలదీశారు. చదువుకోసం హోటళ్లలో పనిచేసిన సోనియా గాంధీకి ఈ రోజు లక్షలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. రెండెకరాల పొలం ఆసామిగా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు వేలకోట్ల ఆస్తులు, విదేశాల్లో హోటళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు.
Share this article :

0 comments: