బాబు చేతిలోనే రాం ‘కీ’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు చేతిలోనే రాం ‘కీ’

బాబు చేతిలోనే రాం ‘కీ’

Written By news on Saturday, May 26, 2012 | 5/26/2012



ఫార్మా సిటీ కేటాయించి 2,143 ఎకరాలు కట్టబెట్టిన బాబు
2000 నుంచి విశాఖలో ఫార్మా సిటీకి ప్రయత్నాలు
పరవాడ ప్రాంతం వద్దన్నా అభ్యంతరాలు బేఖాతరు
టెండర్ల ప్రాసెసింగ్‌ను ఎల్ అండ్ టీకి అప్పగించిన ప్రభుత్వం
13 సంస్థలొచ్చినా అన్నిటికీ వంకలు పెట్టి వెనక్కి పంపేసిన తీరు
ఆ తరవాత తాను జోక్యం చేసుకుని బీఓటీ పద్ధతిని మార్చిన బాబు
2003లో తాము చేపడతానని స్వయంగా ప్రతిపాదించిన రాంకీ
హడావుడిగా అప్పగించిన బాబు; 2004 ఏప్రిల్ 11న భాగస్వామ్య సంస్థ ఏర్పాటు
రాంకీ వాటా 89 శాతం; ఏపీఐఐసీకి 11 శాతమే
24 గంటలు తిరక్కుండానే 12న కన్సెషన్ ఒప్పందంపై బాబు సంతకాలు.. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే ఓకే; గ్రీన్‌బెల్ట్‌కు 58 ఎకరాలు చాలని అనుమతి
చార్జిషీట్లో వీటిని అరకొరగా చెప్పిన సీబీఐ; బాబుపై లేని ఫోకస్
తరవాత వైఎస్ వచ్చి గ్రీన్‌బెల్ట్ పెంచాలని ప్రతిపాదించారట
కుదరకపోవటంతో చివరికి బాబు నాటి ఒప్పందానికే సై అన్నారట
అలా అనటమే ఆయన రాంకీకి చేసిన మేలు... అందుకే వారు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు
ఇదీ సీబీఐ వింత వాదన; నాటి కన్సెషన్ ఒప్పందంలో వాన్‌పిక్ మాదిరే రాయితీలు
ఎమ్మార్ దర్యాప్తు మాదిరిగా 2005కు ముందు ఏం జరిగిందో అనవసరమంటున్న దర్యాప్తు సంస్థ

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ఏ విషయమైనా సరే! ఏ వ్యవహారమైనా సరే!! రామోజీరావు పిచ్చి కథనాలతో రెచ్చిపోయారంటే దాన్లో ముందుకు కనిపించే కారణంతో పాటు... దానివెనక కనిపించని కారణమూ ఉంటుంది. సీబీఐ ఇటీవల వేసిన మూడవ చార్జిషీటుపై రెండ్రోజులుగా ‘ఈనాడు’ చెలరేగిపోతోంది. ఇందులో తనకు అనుకూలంగా ఉన్న అంశాల్ని మాత్రమే ప్రస్తావిస్తూ కథనాలు వండి వార్చేస్తోంది. దీన్లో కనిపిస్తున్నది ఒక్కటే. ‘సాక్షి’పై మరింత విషం కక్కటం. జగన్‌మోహన్‌రెడ్డిని మరింత టార్గెట్ చేస్తూ... సీబీఐ అడ్డగోలు దర్యాప్తునకు వత్తాసు పలకటం. మరి కనిపించని కారణమేంటో తెలుసా..? తన సియామీ కవల లాంటి చంద్రబాబు నాయుడిని కాపాడటం. ఫార్మా సిటీని ఆయన ఎంత ఆగమేఘాలపై కేటాయించారో, ఎంత హడావుడిగా ఒప్పందం చేసుకున్నారో, పర్యావరణంపై వచ్చిన అభ్యంతరాల్ని ఎంత కిరాతకంగా పక్కనపడేశారో... అవన్నీ బయటపడకుండా సమాధి చేసెయ్యటం. అసలు రాంకీ సంస్థకు ఫార్మాసిటీని కట్టబెట్టిందెవరు? 2,143 ఎకరాల్ని దానికి అప్పగించిందెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ... ఎన్నికలకు రెండునెలలు కూడా లేకున్నా భాగస్వామ్య సంస్థను రిజిస్ట్రేషన్ చేయించిందెవరు? అది జరిగి 24 గంటలు కూడా గడవకముందే దాంతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నదెవరు? ఆ కన్సెషన్ ఒప్పందం ప్రకారం గ్రీన్‌బెల్ట్ ఉండాల్సిందెంత? ఇప్పుడున్నదెంత? మధ్యలో వైఎస్సార్ ప్రభుత్వం చేసిందేంటి? ఇదికదా ఛార్జిషీట్లో ఉండాల్సింది. ఒకవేళ లేకుంటే దీన్నికదా మీడియా బయటపెట్టాల్సింది!! కావాలంటే మీరే చూడండి...


ఫార్మా సంస్థల్ని హైదరాబాద్ నుంచి తరలించేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని 1999లోనే చంద్రబాబునాయుడి ప్రభుత్వం భావించింది. అందుకని ఐదుగురు సభ్యులతో ఒక బృందాన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు పంపించింది. చివరికి విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ 2000వ సంవత్సరం జూలై 18న చంద్రబాబు నాయుడు జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ఒక ఫార్మా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయింది. దానికి చంద్రబాబే ఛైర్మన్ కూడా.
అభ్యంతరాలు బేఖాతరు... 
ఈ టాస్క్‌ఫోర్స్ బృందం విశాఖలో పలు ప్రాంతాల్ని సందర్శించిన మీదట... చివరికి పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకుంది. అయితే పరవాడ ఐడీఏను 1997లో పారిశ్రామిక వాడగా ప్రకటించినా... ఆ తరవాత జరిపిన సర్వేల్లో అది పారిశ్రామిక వాడకు తగిన ప్రాంతం కాదని బయటపడింది. దీంతో ఈ ప్రాంతాన్ని తక్కువ జల, వాయు కాలుష్యాలు వెదజల్లే కలాపాలకే పరిమితం చేశారు. వీటన్నిటినీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ... ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యంలో ఫార్మా లేదా కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2001 సెప్టెంబరు 24న జీవో ఎంఎస్ నెంబరు 501ని విడుదల చేసింది.


ఎల్ అండ్ టీకే టెండర్ల ప్రక్రియ: బాబు హయాంలో ఏం చేసినా ఎల్ అండ్ టీ మాత్రమే చేయాలనేది తప్పనిసరిగా పాటించే నిబంధన. ఇదే కోవలో ఫార్మా పార్కుకు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్ అండ్ టీ రాంబోల్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. దీంతో టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబర్ 31న, డిసెంబర్ 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో 11 ఇతర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ప్రతిపాదనల్ని పంపే దశలో రాంకీతో పాటు ఏడుగురు బిడ్డర్లే ఆర్‌ఎఫ్‌పీ పత్రాల్ని ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేశారు. కానీ చిత్రంగా మూడు కంపెనీలు మాత్రమే... అంటే జూమ్ డెవలపర్స్, మరిది, వర్ట్సిలా సంస్థలు మాత్రమే సవివర ప్రతిపాదనల్ని సమర్పించాయి. వీటిలో మారిషస్‌కు చెందిన క్రిస్సన్ సంస్థతో కలిసి జూమ్ డెవలపర్స్ వేసిన ప్రతిపాదన మాత్రమే అర్హత పొందింది. అయితే ఏపీఐఐసీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు.

నిబంధనలు మార్చిన బాబు: టెండర్ల ప్రక్రియ రద్దయిపోవటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. 2003 జూన్ 28న సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ బదులు బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని నిర్ణయించింది. అంటే నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... ఇక సదరు ప్రయివేటు సంస్థ యాజమాన్యంలోనే ఇది కొనసాగుతుందన్న మాట. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న నెలరోజులకే అంటే... 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఏపీఐఐసీకి ప్రతిపాదన సమర్పించింది. ఆ ప్రతిపాదనపై నేరుగా ముఖ్యమంత్రితో... ఇన్‌ఫ్రా సబ్‌కమిటీ చర్చించింది. చివరికి 2003 నవంబర్ 14న రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని నేరుగా ఏపీఐఐసీకే అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నోట్‌ను ఆమోదించారు.

రెండు మూడు నెలల్లో మొత్తం సిద్ధమైపోయింది. ప్రాజెక్టును అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం... ఎంఓయూ కుదర్చుకోవటం... అన్నీ జరిగిపోయాయి. అప్పటికే బాబు ప్రభుత్వం ఆపద్ధర్మంలో పడింది. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2003 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది.

ఇదీ... ప్రధాన ఆరోపణ 
మూడవ చార్జిషీట్లో సీబీఐ ప్రధాన ఆరోపణమేమిటంటే... విశాఖపట్నంలో రాంకీ సంస్థ ఏర్పాటు చేసిన ఫార్మా సిటీ గ్రీన్‌బెల్ట్‌కు సంబంధించి నిబంధనల్ని ప్రభుత్వం సవరించిందని! అందుకే ఆ సంస్థ టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రా, ఎరెస్ ప్రాజెక్ట్స్ అనే సంస్థల ద్వారా జగన్‌మోహన్ రెడ్డి కంపెనీల్లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందని!.

గ్రీన్ బెల్ట్‌పై వైఎస్ సమావేశాలు...
సీబీఐ చార్జిషీట్లో ఏమని పేర్కొందంటే... ‘‘2004 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్... ప్రాజెక్టుల్ని సమీక్షించే క్రమంలో ఫార్మాసిటీపైనా సమీక్షించారు. ఈ ఫార్మా సిటీలో నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ ఒక కిలోమీటర్ ఉంటే బాగుంటుందని, అది గోడకు అవతల 500 మీటర్లు, ఇవతల 500 మీటర్లు ఉన్నా సరిపోతుందని, అక్కడ ఉడాయే నేరుగా వాణిజ్య ప్రాతిపదికన మొక్కలు పెంచాలని సూచించారు. అయితే బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయటం సాధ్యం కాదని తరువాతి సమావేశంలో ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గిస్తే సరిపోతుందని చెప్పారు. కానీ ఆ తరవాత జరిగిన సమావేశంలో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే సరిపోయేట్టుగా నిబంధనలు సవరించాలని ‘ఉడా’కు చెప్పారు. ఇది ఖచ్చితంగా ఫార్మా సిటీ యాజమాన్యానికి అయాచిత లబ్ధి చేకూర్చటమే. అందుకు ప్రతిగానే రాంకీ సంస్థ పరోక్షంగా రూ.10 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టింది’’ అని వివరించింది.

ఇక్కడ మౌలికమైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
{పస్తుతం గోడకు లోపల గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉండటం వల్ల రాంకీ సంస్థ వదిలిపెట్టాల్సిన స్థలం 58.95 ఎకరాలు. మరి ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే కదా? దాన్నేమైనా వైఎస్ మార్చారా?
వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లే గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆమోదించవచ్చని సీఎం వైఎస్ భావించే అవకాశం లేదా? అలాంటి సహేతుకమైన కారణాలన్నిటినీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం సమంజసమా?
ఏం! జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార దక్షతపై నమ్మకం ఉండో, మున్ముందు ఇన్వెస్ట్‌మెంట్లు లాభిస్తాయనో, రాష్ట్రంలో బొమ్మనేకాదు... బొరుసును కూడా చూపించే పత్రిక వస్తోంది కాబట్టి దానికి మద్దతివ్వాల్సిన అవసరముందని భావించో ‘రాంకీ’ సంస్థ పెట్టుబడి పెట్టే అవకాశం లేదా? ఇదెక్కడి అడ్డగోలు తీరు?
{Xన్‌బెల్ట్‌పై నిజానికి రాంకీకి వైఎస్ ప్రభుత్వం చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించింది. మరి ఈ పాటిదానికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబుకి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి? అంత హడావుడిగా ఎన్నికల ముందు ఒప్పందం కుదుర్చుకున్నారెందుకు?
ఇక్కడా ఎమ్మార్ లాంటి తేదీలే...
ఎమ్మార్ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2005 కన్నా ముందు ఏం జరిగిందనేది తాను దర్యాప్తు చేయబోనని భీష్మించుకున్న సీబీఐ... రాంకీ వ్యవహారంలోనూ అదే చేసింది. ఎంతసేపూ ఈ ఛార్జిషీట్లో 2005 నుంచి 2009 మధ్య జరిగిన లావాదేవీల ప్రకారం... అంటోందే తప్ప అసలు రాంకీకి ఇచ్చిందెవరు? 2004 ఏప్రిల్లో ఆ సంస్థ ఏర్పాటయిన 24 గంటల్లో కన్షెషన్ ఒప్పందం ఎలా కుదిరింది? అంతకు ముందే భూములు ఎలా అలాట్ చేశారు? అనేవి దర్యాప్తు చేయటమే లేదు. ఎందుకని? అసలు 2004 కన్నా ముందటి వ్యవహారాల్ని విచారించొద్దని సీబీఐకి చెప్పిందెవరు? రామోజీనా? చంద్రబాబా? లేక సీబీఐని నడిపిస్తున్న సూపర్ బాసా?

వాన్‌పిక్ మాదిరే రాయితీలు...
ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసినపుడు సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో చిత్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థకు స్టాంపు, రిజిస్ట్రేషన్ల చార్జీల్ని మినహాయించారని, ఇతరత్రా మినహాయింపులు చాలా ఇచ్చారని, అందుకే వాన్‌పిక్ ‘సాక్షి’లో పెట్టుబ డులు పెట్టినట్లుగా పేర్కొంది. ‘కన్సెషన్’ ఒప్పం దాన్ని పెద్ద భూతంలా చూపించింది. మరి ఫార్మాసిటీతో చంద్రబాబు హడావుడిగా కుదుర్చుకున్న ఈ కన్సెషన్ అగ్రిమెంట్‌లో ఏముందో తెలుసా?
*అమ్మకం పన్ను పూర్తిగా మినహాయిస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా పూర్తిగా మినహాయించారు.
*{పభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా అవసరాన్ని బట్టి ఏపీఐఐసీ రికమెండ్ చేస్తుంది.
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని రాయితీలూ వచ్చేలా ఏపీఐఐసీ సహకరిస్తుంది.
*అయితే 2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్డ్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలి. (దీని ప్రకారం చంద్రబాబు గ్రీన్‌బెల్ట్‌కు నిర్దేశించిన మొత్తం భూమి 352 ఎకరాలు)
*మొత్తం భూమిని రాంకీ పేరిటే కేటాయిస్తారు. దాన్ని అది ప్లాట్లుగా చేసి, తనే ధర నిర్ణయించి విక్రయిస్తుంది. దీన్లో గ్రీన్‌బెల్ట్ జోన్ ఉంటుంది.
*ఈ కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం 2005 ఫిబ్రవరి 28న వుడాకు ‘రాంకీ’ లే ఔట్ ప్లాన్‌ను అందజేసింది. ఈ లే ఔట్ ప్లాన్ ప్రకారం గ్రీన్‌జోన్ మొత్తం 352 ఎకరాలుంటుంది. దీన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు, ఓపెన్‌స్పేస్‌లో గ్రీన్ బఫర్ 221.21 ఎకరాలు, హెచ్‌టీ కారిడార్‌లో గ్రీన్ బఫర్ 72 ఎకరాలు ఉంటుంది. ఈ మేరకు ఉడాకు లేఔట్ సమర్పించిన రాంకీ... ఆమోదం కూడా పొందింది.

మీడియాపైనా సీబీఐ విశ్లేషణ...
ఈ ఛార్జిషీట్లో తన వాదన కరెక్టని చెప్పటానికి రాష్ట్ర మీడియా రంగంపైనా సీబీఐ విశ్లేషణ చేసింది. ‘‘సాక్షి ప్రమోటర్లు పెట్టుబడుల్ని ఆకర్షించటానికి రాష్ట్రంలో ఇప్పటిదాకా బలంగా ఉన్న మీడియా కన్నా ఎక్కువ లాభాలొస్తాయని ఆశించారు. లాభాల మార్జిన్లు కూడా ఇప్పటిదాకా వస్తున్న వాటికన్నా ఎక్కువ అంచనా వేశారు’’ అని పేర్కొన్నారు. వీళ్ల దృష్టిలో రాష్ట్రంలో ఉన్న మీడియా అంటే... ‘ఈనాడు’ తప్ప మరోటి కాదు. అసలు ‘ఈనాడు’ తన ఆదాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైనా చూపించిం దా? ఆదాయపు పన్ను ఎగ్గొట్టడానికి అడ్డగోలు స్టేట్‌మెంట్లు తయారు చేసిన వ్యవహారాన్ని అప్పట్లోనే ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టలేదా?


‘సాక్షి’ తొలి రెండేళ్లలోనే తాను ఆశించిన సర్క్యులేషన్‌ను సాధించిందని, కానీ ఆశించిన లాభాల్ని సాధించలేదని సీబీఐ పేర్కొంది. మరి సర్క్యులేషన్‌ను సాధించటమంటే పెట్టుబడిదారులకు అబద్ధాలు చెప్పినట్టా? అమ్మకాలు ఆశించినంతగా ఉన్నపుడు లాభాలు ఒకటిరెండేళ్లలో ఆశించినట్టు రావా? ఇదెక్కడి వింత వాదన? పెపైచ్చు తొలి ఏడాది భారీ నష్టాలొచ్చినా రెండో ఏడాది అవి గణనీయంగా తగ్గాయని కూడా సీబీఐనే పేర్కొంది. మరి మూడో ఏడాది లాభాల బాటలోకి వచ్చే అవకాశం లేదా?
Share this article :

0 comments: