సాక్షిలో ప్రకటనలు నిలిపివేసే జిఓ రద్దుచేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షిలో ప్రకటనలు నిలిపివేసే జిఓ రద్దుచేయాలి

సాక్షిలో ప్రకటనలు నిలిపివేసే జిఓ రద్దుచేయాలి

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

సాక్షి మీడియాలో ప్రకటనలు నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సాక్షి ఉద్యోగులు, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు సమాచార, పౌరసంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ కార్యాలయం ఎదుట ఈరోజు ఆందోళనకు దిగారు. సాక్షికి ప్రకటనలు నిలిపివేస్తూ జారీ చేసి జిఓ 2079ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి బ్యాంకు ఖాతాలపై ఆంక్షలను రద్దు చేయాలని, జిఓ 2079ని రద్దు చేయాలని, సాక్షికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఐ అండ్ పి ఆర్ కమిషనర్ చంద్రవదన్ కు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన జర్నలిస్టు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జర్నలిస్టులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడాన్ని వారు ఖండించారు. జర్నలిస్టులు దాదాపు గంటన్నర సేపు వేచి ఉన్న తరువాత లోపలికి అనుమతించారు.


సాక్షికి ప్రకటనలు నిలిపివేయడం వల్ల 20వేల మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుందని సాక్షి ఉద్యోగి అమరయ్య కమిషనర్ చంద్రవదన్ కు తెలిపారు. సాక్షికి ప్రకటనలు నిలిపివేస్తూ జారీ చేసిన జిఓ 2079ని రద్దు చేయడానికి మీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


మీడియా ఉద్యోగులకు అభద్రతా భావం కలిగించే జిఓ2079ని రద్దు చేయాలని ఎపిడబ్ల్యూజెయూఎఫ్ నేత ఆంజనేయులు కమిషనర్ ని కోరారు.


మీరు చెప్పిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ చంద్రవదన్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: