పది కాలాలు నిలిచే వైఎస్ పథకాలు:వివేకా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పది కాలాలు నిలిచే వైఎస్ పథకాలు:వివేకా

పది కాలాలు నిలిచే వైఎస్ పథకాలు:వివేకా

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

రాష్ట్రంలో పది కాలాలపాటు నిలిచేవిధంగా పేద ప్రజల కోసం తన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చెప్పారు. రాయచోటిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వారే వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడాన్ని తట్టుకోలేకపోయినట్లు చెప్పారు. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ఈరోజు అన్న సమాధి వద్ద ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వైఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పనులే చేశారన్నారు. 2004 నుంచి 2009 వరకు మంచి పరిపాలన అందించారని గుర్తు చేశారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలని ఆయన తపనపడ్డారన్నారు. ఉచిత విద్యుత్, బియ్యం పథకం, విద్యార్థులకు ఫీజులు చెల్లించే పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకం .... ఇలా ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. అన్న పథకాలు అమలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చి, ఈరోజు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న జగన్ కు అండగా నిలవాలని పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
Share this article :

0 comments: