జననేతకు బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేతకు బ్రహ్మరథం

జననేతకు బ్రహ్మరథం

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012



మాచర్లటౌన్, న్యూస్‌లైన్ : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో జనప్రభంజనం వెల్లువైంది. అశేష జనసంద్రం నడుమ జననేత జగన్ ఉప ఎన్నికల రోడ్డుషో కొనసాగింది. రోహిణికార్తెతో ఎండలు మండిపోతున్నా ప్రజలు లెక్కచేయకుండా జననేత రాకకోసం నిరీక్షించి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దుర్గి, కారంపూడి మండలాల్లో రోడ్డుషో నిర్వహించి అనంతరం జగన్ రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు పయనమయ్యారు. యాత్ర సాగిందిలా.. మాచర్ల పట్టణంలోని పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం నుంచి గురువారం ఉదయం 10.40 నిమిషాలకు జగన్ రోడ్డుషో ప్రారంభించారు. అంతకు ముందుకు పలువురు నేతలు ఆయనను కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దుర్గి మండలం అడిగొప్పుల చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగి గ్రామ ప్రధాన సెంటర్‌లో ప్రసంగించారు. అనంతరం కారంపూడి మండలం నరమాలపాడు చేరుకున్న జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ జగన్‌తో కలిసి మాజీ మంత్రి, దివంగత మహానేత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. నరమాలపాడులో ప్రసంగించి ఒప్పిచర్ల చేరుకున్న జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ రోడ్‌షో పూర్తయిన అనంతరం లక్ష్మీపురం చేరుకున్నారు. అక్కడ రోడ్డుషోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత మిరియాల చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. గ్రామంలో రోడ్‌షో అనంతరం ప్రచార వాహనం దిగి ప్రజలతో మమేకమయ్యారు. తర్వాత కారంపూడి పయనమయ్యారు.

కారంపూడిలో..: కారంపూడిలో జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రధాన వీధిలో దాదాపు కిలోమీటరు పొడవున జన సంద్రమే కనిపించింది. హోరెత్తిన జనవాహిని నడుమ జగన్ అందరికీ అభివాదం చేస్తూ బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించి, రామకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్కడ నుంచి చింతపల్లి చేరుకున్న జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ప్రధానవీధుల్లో రోడ్డుషో నిర్వహించి పలుచోట్ల ప్రజలతో మమేకమయ్యారు. అక్కడి నుంచి రోడ్డుషో ముగించుకుని హైదరాబాద్ పయనమయ్యారు.

ముఖ్యనేతల హాజరు.: నియోజకవర్గం పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ సెంట్రర్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ పోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్కే, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేతలు కాయితి నర్సిరెడ్డి, యెనుముల మురళీధర్‌రెడ్డి, రావి వెంకట రమణ, ఆతుకూరి ఆంజనేయులు, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, నన్నపనేని సుధ, పార్టీ నగర, పట్టణ విభాగ కన్వీనర్లు కావటి మనోహర్‌నాయుడు, నసీర్, సినీనటుడు విజయచందర్, ఇపూరి అనూఫ్, చింతా సుబ్బారెడ్డి, కట్టా సాంబయ్య, ఇందూరి నరసింహారెడ్డి, మారూరి రామలింగారెడ్డి, విజయ్‌కిరణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల ఏడుకొండలు, మేరాజోత్ హనుమంత్‌నాయక్, కుర్రి సాయి మార్కొండారెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, పులివర్తి రత్నబాబు, ఎన్.అంజిరెడ్డి, ఎన్.హనుమయ్య, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తాడి వెంకటేశ్వరరెడ్డి, మారం వెంకటేశ్వరరావు, యరబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: