ఎంపీగా ఉన్నంత కాలం జైల్లో ఉండాలా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎంపీగా ఉన్నంత కాలం జైల్లో ఉండాలా..?

ఎంపీగా ఉన్నంత కాలం జైల్లో ఉండాలా..?

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

సీబీఐవి కేవలం ఆరోపణలు.. ఒక్క ఆధారం లేదు
దర్యాప్తు మొదలై 9 నెలలు గడిచిపోయింది
ఇప్పటిదాకా సాక్ష్యాల తారుమారు ఆరోపణ లేదు
దర్యాప్తును అడ్డుకోలేదు.. విచారణకు సహకరించా..
సీబీఐ నన్ను అరెస్టు చేయడం చట్ట విరుద్ధం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా జైల్లోనే ఉంచాలని కుయుక్తులు పన్నుతున్న సీబీఐ.. అందుకు అర్థం లేని వాదనలను తెరపైకి తెస్తోంది. అంతేకాదు.. వాటిని కోర్టు ముందు కూడా ఉంచుతోంది. జగన్ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి, ఆ హోదాలో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతోంది. ప్రస్తుతం కడప లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్.. ఐదేళ్ల తర్వాత కూడా తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి తప్పక గెలుస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. సీబీఐ లెక్క ప్రకారం.. జగన్ ఎంపీగా ఉన్నంత కాలం జైల్లోనే ఉండాలట! సీబీఐ చేసిన ఈ వాదనపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్నంత కాలం తాను జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండాలనడం చట్టవిరుద్ధమని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్.. సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టి తొమ్మిది నెలలైం దని, ఇప్పటి వరకు జరగని సాక్ష్యాల తారుమారు ఇప్పుడెలా జరుగుతుందని జగన్ ప్రశ్నించారు. తాను సాక్ష్యాలు తారుమారు చేస్తానని సీబీఐ చేస్తున్నవి కేవలం ఆరోపణలేనని కోర్టుకు నివేదిం చారు. ‘‘సీబీఐ ఈ కేసులో ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిం ది. మార్చి 31న మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. 23 ఏప్రిల్, మే 7న రెండు, మూడు చార్జిషీట్లను సమర్పించింది. కేసు నమోదు చేసిన 9 నెలల కాలంలో ఒక్కసారి కూడా నాకు నోటీసులు జారీచేయలేదు. 

ఉప ఎన్నికల ప్రచార బాధ్యతల్లో ఉండగా గుంటూరు జిల్లా మాచర్లలో సీబీఐ అధికారులు సీఆర్‌పీసీ 41 (ఎ) కింద నోటీసులు అందించారు. ఈనెల 25న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 24న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాను. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడే జగన్‌ను అరెస్టు చేయలేదని.. మొదటి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేసిన తర్వాత అరెస్టు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అయినప్పటికీ సీబీఐ నన్ను విచారణకు పిలిపించి.. ఈ నెల 27న అరెస్ట్ చేసింది. ఈనెల 25, 26, 27 తేదీల్లో సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించా. సీఆర్‌పీసీ నిబంధనలకు విరుద్ధంగా.. అరెస్టు చేసే అధికారం లేకపోయినా సీబీఐ అరెస్టు చేసింది. 

సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను మాయం చేస్తారనే అనుమానంతోనే నన్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. దర్యాప్తును అడ్డుకుంటారని కూడా ఆరోపించింది. ఇది పూర్తిగా నిరాధారం.. అవాస్తవం. వంచనతోనే సీబీఐ నన్ను అరెస్టు చేసింది. 9 నెలల కాలంలో దర్యాప్తును అడ్డుకోవడంగానీ, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను మాయం చేయడంగానీ చేయలేదు. ఉన్నత హోదా కల్గిన వ్యక్తిని. ఎంపీని. గుర్తింపు పొం దిన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని. దర్యాప్తునకు సహకరించకుండా ఎక్కడికీ పారిపోయే, కనిపించకుండాపోయే అవకాశమే లేదు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా. భవిష్యత్తులోనూ మళ్లీ ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. సాక్షులను ప్రభావితం చేస్తారనే నిరాధారమైన ఆరోపణ కారణంగా ఎంపీగా ఉన్నంత కాలం జ్యుడీషియల్ కస్టడీలో ఉండాలని కోరడం ఎంత వరకు సమంజసం? చార్జిషీట్‌కు ముందే సీబీఐ అరెస్టు చేయాలి. చార్జిషీట్ దాఖలు తర్వాత సీబీఐకి అరెస్టు చేసే అధికారం ఉండదు. సీఆర్‌పీసీ నిబంధనల మేరకు నా అరెస్టు అన్యాయం. జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగించడం చట్టవిరుద్ధం’’ అని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు
Share this article :

0 comments: